10 వరకు గడువు
అనంతపురం అగ్రికల్చర్: ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద ఎంపిక చేసిన ఎనిమిది పంటలకు ప్రీమియం చెల్లింపు గడువు ఈ నెల పదోతేదీ వరకు పొడిగించినట్లు వ్యవసాయ సంయుక్త సంచాలకుడు (జేడీఏ) పీవీ శ్రీరామమూర్తి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వరి పంటకు మాత్రం ఆగస్టు 21 వరకు గడువుందని పేర్కొన్నారు.
పత్తి, మిరపకు ఐదు శాతం, మిగతా పంటలకు రెండు శాతం మేర ప్రీమియం కట్టాలని సూచించారు. పంట రుణాలు తీసుకున్న రైతులతో పాటు పొందని రైతులు కూడా ప్రీమియం చెల్లించాలని తెలిపారు. ఫసల్‌బీమా పథకాన్ని ఈ ఏడాది కంది పంటకు గ్రామం యూనిట్‌గా, వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, మిరప (నీటి వసతి), పత్తి పంటలకు జిల్లా యూనిట్‌గా అమలు చేస్తున్నారు.