హెల్త్ స్కీం ప్రీమియం వసూలు నిలిపివేత
ప్రభుత్వోద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించిన ప్రీమియం వసూలును నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగులు కూడా రెండు రాష్ట్రాలకు వెళ్లాల్సి రావడం, ఉద్యోగుల పంపిణీ తదితర సమస్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జూన్ తర్వాత హెల్త్ స్కీం ప్రీమియంను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వసూలు చేయనున్నాయి. ఈనెల నుంచే ఉద్యోగులు, పెన్షనర్ల ప్రీమియం వసూలు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాల కోరిక మేరకే ప్రీమియం వసూలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.