ప్రేమ్‌రాజ్ వర్మ అరెస్ట్
హైదరాబాద్: ‘అవేక్ ఓ వరల్డ్’ పేరుతో అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రేమ్‌రాజ్ వర్మను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపారు.
అంతకుముందు నింబోలిఅడ్డలోని ప్రభుత్వ బాలికల సదన్‌లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణకు ప్రేమ్‌రాజ్ వర్మ హాజరయ్యారు. అనంతరం అతన్ని విచారణ నిమిత్తం కూషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.