రాష్ట్రపతి భద్రతకు 155 కోట్ల ఖర్చు
ఆగ్రా: రాష్ట్రపతి భద్రతా సిబ్బంది జీతభత్యాల కోసం గత నాలుగేళ్లలో రూ.155.4కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. లక్నోకు చెందిన నూతన్ ఠాకూర్ అనే హక్కుల కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు బదులిచ్చింది.
భద్రతా సిబ్బంది జీతభత్యాల కింద 2014–15లో 38.17కోట్లు, 2015–16లో 41.77కోట్లు, 2016–17లో 48.35కోట్లు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 27.11కోట్లు చెల్లించారు.భద్రతా వాహనాల నిర్వహణకు నాలుగేళ్లలో 64.9లక్షలు ఖర్చు చేశారు. వాహనాల్లో ప్రభుత్వం నిర్వహించే బంకుల్లోని పెట్రోల్‌ను వాడుతున్నందున ఆ ఖర్చును లెక్కల్లో చూపలేదంది. భద్రతా కారణాల రీత్యా మొత్తం సిబ్బంది, వాహనాల సంఖ్యను వెల్లడించలేమని పేర్కొంది.