the president
-
స్పీకర్ పరామర్శ
వేల్పూర్: టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దివంగత వేముల సురేందర్‌రెడ్డి మృతి తీరని లోటు అని స్పీకర్ మధుసుదనాచారి పేర్కొన్నారు. సురేందర్‌రెడ్డి గత నెల 27న మృతి చెందిన నేపథ్యంలో ఆయన తనయుడు, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డిని స్పీకర్ మంగళవారం వేల్పూర్‌లో పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి సురేందర్‌రెడ్డి పార్టీలో ఉన్నారని, నైతిక విలువలు పక్కన పెడుతున్న ఈ రోజుల్లోనూ ఆయన టీఆర్ఎస్ కోసం అంకిత భావంతో పని చేశారని కొనియాడారు. రైతు నాయకుడిగా నిరంతరం రైతుల సంక్షేమం కోసం పరితపించేవారన్నారు. సురేందర్‌రెడ్డికి రావాల్సిన గౌరవం ఆయన తన యుడు ప్రశాంత్‌రెడ్డికి దక్కిందన్నారు. మరోవైపు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ పురాణం సతీష్, టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవిప్రసాద్ తదితరులు కూడా ప్రశాంత్‌రెడ్డిని పరామర్శించారు. సురేందర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -

మంత్రి హరీశ్‌రావు తీరు మార్చుకోవాలి
ఆర్మూర్(నిజామాబాద్): రెండో ఏఎన్ఎంల సమస్యలు వినకుండా మిమ్మల్ని ఎవరూ పట్టించుకోకున్నా సమ్మె ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తన తీరు మార్చుకోవాలని పీడీఎస్‌యూ చంద్రన్న వర్గం జిల్లా అధ్యక్షుడు బొర్ర నాగరాజు సూచించారు. ఆర్మూర్‌లోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ డిమాండ్ల సాధన కోసం రెండో ఏఎన్ఎంలు బుధవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 31వ రోజు కొనసాగుతున్న సమ్మెకు పీడీఎస్‌యూ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావుకు ఏఎన్ఎంలు వినతి పత్రం అందజేస్తే ఆయన స్పందించిన తీరు బాధాకరమన్నారు. రెండో ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు యెల్లుల శ్రీకాంత్, స్వామి ఏఎన్ఎంలు ప్రమీళ, రాజగంగు, విజయ, స్వప్న, గీత, ఎస్తేర్, వాణి, రాణి, స్వరూప, కమల, చైతన్య, సుమలత తదితరులు పాల్గొన్నారు. -
జూన్‌లో రాష్ట్రపతి రాక..హైదరాబాద్‌లో విడిది
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌లో వేసవి విడిది చేయనున్నారు. జూన్ చివరి వారంలో ఆయన పర్యటన ఉంటుందని రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. వారం నుంచి పది రోజుల పాటు ఆయన సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్రపతి భవన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 24 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో శీతాకాల విడిదికి రావాల్సి ఉండగా... అనివార్య కారణాలతో ఆ పర్యటన రద్దు అయింది. గుండె సంబంధిత ఇబ్బందులతో ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న నేపథ్యంలో విశ్రాంతి తీసుకునేందుకు రాష్ట్రపతి ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రపతి నిలయంలో విడిదికి వచ్చిన సమయంలో ఇక్కడి నుంచే ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుంటారు. దీంతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాజిక సంఘాలు, ఎన్జీవోలు, ప్రజలను కలిసేందుకు ఆయన కొంతసమయం వెచ్చిస్తారు. ఇటీవలే రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన ఒక బృందం హైదరాబాద్‌కు వచ్చి ఈ విడిదికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి వెళ్లినట్లు తెలిసింది. మే నెలాఖరున రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన అధికారిక ప్రణాళికను విడుదల చేసే అవకాశముంది.