20న గ్రేటర్ అధ్యక్షుని ఎన్నిక: పెద్ది సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్: ఈ నెల 20న గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందని టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. శనివారం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్ మైనంపల్లి హన్మంతరావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ క్రియాశీల, సాధారణ సభ్యత్వం 55.65 లక్షలకు చేరిందన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల కమిటీలకు అధ్యక్షులు, అనుబంధ సంఘాలకు ఎన్నికలు పూర్తైట్లు వివరించారు. మంత్రి మహేందర్‌రెడ్డి ఎన్నికల పరిశీలకునిగా హాజరవుతారని, మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో ఎన్నికలు జరుగుతాయన్నారు.