రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
విజయనగరం క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు పటి ష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ పే ర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఎస్పీ గ్రేవాల్ పోలీసు అధికారులతో మాసాంతపు నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. రహదారి నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ సూచిం చారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తిం చి రోడ్లు, భవనాల శాఖ సహకారంతో హెచ్చరిక బో ర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చైన్ స్నానింగ్లు, దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టి నివారణ చర్యలు తీసుకోవాలన్నా రు. పట్టణ శివార్లలో ద్విచక్ర వాహనాలతో మఫ్టీలో సి బ్బందిని నియమించి వాహనదారులపై నిఘా ఉంచాలన్నారు.
వైట్ కాలర్ నేరాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, ఆ తరహా నేరాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. చిన్నపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్ప డే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి సర్కిల్ పరిధిలో ఆస్తికి సంబంధించిన నేరాలను నియంత్రిం చేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగిం చాలని సూచించారు. ఇప్పటివరకు జరిగిన నేరాల్లో దొంగతానికి గురైన ప్రాపర్టీని తిరిగి రికవరి చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. బీట్ వ్య వస్థను పటిష్టపరచాలని ఆదేశించారు.
సమావేశంలో అ దనపు ఎస్పీ ఎ.వి.రమణ, పార్వతీపురం ఎఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ టి.త్రినాధ్, డీసీఆర్బీ డీఎస్పీ కె.ప్రవీణ్‌కుమార్, విజయనగరం డీఎస్పీ పి.వి.రత్నం, బొబ్బిలి డీఎస్పీ బి.వి.రమణమూర్తి, సీసీఎస్ డీఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.రాజేశ్వరరావు, అట్రాసిటీస్ డీఎస్పీ కె.కృష్ణప్రసన్న, ఏఆర్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు, సి.ఐలు ఆర్.శ్రీనివాసరావు, ఎ.రవికుమార్, కె.వైకుంఠరావు, కె.లక్ష్మణమూర్తి, సంజీవరావు, టి.సీతారాం, కె.వి.వి.విజయనాధ్, వి.చంద్రశేఖర్, జి.వేణుగోపాల్, వై.వి.శేషు, వి.నర్సింహమూర్తి, బి.లలిత, ఆర్.ఐలు ఎస్వీ అప్పారావు, పి.నాగేశ్వరరావు, డీపీఓ పరిపాలన అధికారి జి.త్రిమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేశవరరావు, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.