Prices of rice
-
ఇక వెండి.. కొండ!
ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న పసిడి రేట్లకు దీటుగా పరుగులు తీసేందుకు వెండి కూడా సన్నద్ధమవుతోందా? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఖరీదైన బంగారానికి ప్రత్యామ్నాయంగా ఇన్వెస్టర్లు వెండి వైపు చూస్తుండటంతో పాటు పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన డిమాండ్ పెరుగుతుండటం కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. బంగారం, వెండి మధ్య కీలక నిష్పత్తుల్లో చోటు చేసుకుంటున్న మార్పులు దీన్ని సూచిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏడాది వ్యవధిలో వెండి రేటు కేజీకి రూ. 1.1 లక్షల నుంచి రూ. 1.25 లక్షల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారానికి మించి వెండి అధిక రాబడులు ఇచ్చే అవకాశం ఉందనే అంచనాలతో ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) వైపు చూసే ఇన్వెస్టర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. నిష్పత్తి చెబుతోందిదే.. బంగారంతో పోలిస్తే వెండి ధర ఎంత చౌకగా ఉంది, లేదా ఎంత ఎక్కువగా ఉంది అనేది తెలుసుకోవడానికి రెండింటి రేట్ల మధ్య నిర్దిష్టంగా ఉండే నిష్పత్తి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ఆల్టైమ్ కనిష్టం అయిన 0.01 స్థాయిలో ఉంది. ఈ నిష్పత్తి ఆల్టైం గరిష్టం 0.06 స్థాయి. సాధారణంగా సగటున ఒక్క ఔన్సు (31.1) గ్రాముల బంగారం విలువ, 60 నుంచి 70 ఔన్సుల వెండి విలువకు సమానంగా ఉంటుంది. ప్రస్తుతం ఒక్క ఔన్సు బంగారం కొనాలంటే 90 ఔన్సుల వెండి అవసరమవుతోంది. ఈ వ్యత్యాసం సగటు స్థాయికి తగ్గాలంటే వెండి మరింతగా పెరగాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో పసిడి భారీగా ఎగిసిన నేపథ్యంలో స్వల్పకాలానికి వెండిని కొనుగోలు చేస్తే సురక్షితంగా ఉంటుందనే భావన ఇన్వెస్టర్లలో నెలకొంది. గత మూడేళ్లుగా రాబడుల విషయంలో పసిడితో పోలిస్తే వెండి వెనకబడింది. డాలరు మారకంలో పసిడిపై రాబడులు సుమారు 54 శాతంగా ఉండగా, వెండిపై రాబడులు 37 శాతమే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పసిడి రేటు 11.77 శాతం పెరగ్గా, వెండి రేట్లు 13.3 శాతం పెరిగాయి. 3,200 డాలర్ల దిశగా పసిడి!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల దెబ్బతో ద్రవ్యోల్బణం భారీగా ఎగియొచ్చన్న అంచనాలు పసిడి ర్యాలీకి దోహదపడుతున్నాయి. సురక్షిత పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం దాదాపు రూ. 2,948 డాలర్లకు పెరిగింది. ఇది ఈ ఏడాది ఏకంగా 3,200 డాలర్లకు ఎగియొచ్చనే పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుత స్థాయి నుంచి మరీ దూకుడుగా ధరల పెరుగుదల ఉండకపోవచ్చని పేర్కొన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత విషయంలో జాప్యం చేసే అవకాశాలు, రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు, ట్రేడ్ టారిఫ్ల అమలు నెమ్మదించడం వంటి అంశాలు ప్రతికూలంగా మారొచ్చని వివరించాయి.ఇన్వెస్టర్లు, పరిశ్రమల దన్ను.. ఇటు ఇన్వెస్టర్లు, అటు పరిశ్రమల నుంచి డిమాండ్ నెలకొనడంతో సమీప భవిష్యత్తులో పసిడికి మించి వెండి ర్యాలీ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడాది వ్యవధిలో వెండి ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.25 లక్షల వరకు చేరొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేస్తోంది.అంటే సగటున 20 శాతం రాబడి ఉండొచ్చు. దీంతో ప్రస్తుతం రేటు తగ్గితే కొనుక్కుని దగ్గర పెట్టుకోవడం మంచిదని సూచించాయి. అయితే, వెండి మీద అధిక రాబడులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపాయి. పసిడితో పోలిస్తే వెండి ధరలో హెచ్చుతగ్గులు 2.5 రెట్లు అధికంగా ఉంటాయని వివరించాయి. ఏడాది వ్యవధిలో వెండి ఈటీఎఫ్ల్లో రాబడులు (%)ఏబీఎస్ఎల్ సిల్వర్ 36.36 కోటక్ సిల్వర్ 36.34 డీఎస్పీ సిల్వర్ 36.21 హెచ్డీఎఫ్సీ సిల్వర్ 36.13 యూటీఐ సిల్వర్ ఈటీఎఫ్ 36.01 ఫిబ్రవరి 20 గణాంకాల ప్రకారం–సాక్షి, బిజినెస్డెస్క్ -
బియ్యానికి రెక్కలు!
వచ్చే ఏడాదికల్లా రెట్టింపు కానున్న ధరలు? సాక్షి, హైదరాబాద్: బియ్యం బంగారం కానుందా..? వచ్చే ఏడాదికల్లా బియ్యం ధరలు ఆకాశాన్ని తాకనున్నాయా..? ప్రస్తుతం రూ.42 నుంచి రూ.50 మధ్య ఉన్న సూపర్ ఫైన్ క్వాలిటీ బియ్యం సెంచరీ కొట్టనుందా..? తాజా పరిస్థితులు అందుకు అవుననే సమాధానమిస్తున్నాయి! ఏటేటా బియ్యం దిగుబడి ఊహించని విధంగా పడిపోతుండడంతో రేట్లు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఏటా మూడో వంతుకుపైగా బియ్యం దిగుబడి తగ్గిపోతోంది. రెండేళ్ల కిందటితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో 36.02 లక్షల టన్నుల బియ్యం దిగుబడి తగ్గిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే సమీప భవిష్యత్తులోనే బియ్యానికి తీవ్ర కొరత ఏర్పడనుంది. మార్కెట్లో ఖరీదైన నిత్యావసర సరుకుగా మారి జనాన్ని హడలెత్తించనుంది. రాష్ట్ర అర్థ గణాంక శాఖ సోమవారం విడుదల చేసిన ‘తెలంగాణ వ్యవసాయ గణాంకాల దర్శిని 2014-15’ ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. ఈ గణాంకాల ప్రకారం వరుసగా మూడేళ్ల పంట ఉత్పత్తులను పరిశీలిస్తే.. బియ్యం దిగుబడి తగ్గిన తీరు కళ్లకు కడుతోంది. 2013-14లో రాష్ట్రంలో 65.81 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అయింది. 2014-15లో ఇది ఒక్కసారిగా 45.45 లక్షల టన్నులకు పడిపోయింది. ఒకే ఏడాదిలో 20.36 లక్షల టన్నుల బియ్యం దిగుబడి తగ్గిపోవటం గమనార్హం. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ వేసిన లెక్కల ప్రకారం ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వర్షాభావం, కరువుతో వరి సాగు నిరుటి కంటే గణనీయంగా తగ్గింది. 2015-16లో బియ్యం ఉత్పత్తి 29.79 లక్షల టన్నులకే పరిమితమవుతుందని అధికారులు ఇటీవల అంచనా వేశారు. అంటే నిరుటితో పోలిస్తే మరో 15.66 లక్షల టన్నులు తగ్గిపోనుందన్నమాట! బెంబేలెత్తిస్తున్న ధరలు ఇప్పటికే మార్కెట్లో బియ్యం ధరలు సామాన్యులకు అందకుండా పోయాయి. మధ్య తరగతి కుటుంబీకులు, సంపన్నులకు సైతం దడ పుట్టిస్తున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం సూపర్ ఫైన్ బెస్ట్ క్వాలిటీ బియ్యం కిలో రూ.42 నుంచి రూ.50 మధ్య ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ధర 5 శాతం పెరిగినట్లు ప్రభుత్వమే నిర్ధారించింది. సూపర్ ఫైన్ సాధారణ రకం బియ్యం కిలో రూ.38 నుంచి రూ.42 మధ్య లభ్యమవుతోంది. గతేడాదితో పోలిస్తే ఇది 8 శాతం పెరిగింది. సాధారణ రకం బియ్యం రూ.24 నుంచి రూ.25 ధరలో విక్రయిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ధరలో పెద్ద తేడా లేదు. కానీ తగ్గుతున్న బియ్యం ఉత్పత్తితో వచ్చే ఏడాది బియ్యం ధరలు ఏకంగా 90 శాతం వరకు ఎగబాకే ప్రమాదముందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కరువే కారణం.. తీవ్ర వర్షాభావంతో రాష్ట్రంలోని రైతులు వరి సాగుకు దూరమవుతున్నారు. అందుకే ఏటా వరి సాగు విస్తీర్ణం తగ్గిపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వేసిన వరి పంటను సైతం ప్రకృతి వైపరీత్యాలు వెంటాడాయి. ఆహార ధాన్యాలన్నీ ప్రియమే బియ్యంతో పాటు కరువు దెబ్బకు మిగతా పంట ఉత్పత్తుల దిగుబడి కూడా పడిపోయింది. రెండేళ్ల కిందటితో పోలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి సగానిపైగా తగ్గింది. 2013-14లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 106.86 లక్షల టన్నులుగా నమోదవగా.. ఈ ఏడాది 49.35 లక్షల టన్నుల ఉత్పత్తిని అంచనా వేస్తున్నారు. గతేడాది 72.18 లక్షల టన్నులు ఉత్పత్తి అయినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. మక్కల (మొక్కజొన్న) దిగుబడి సైతం అదే స్థాయిలో తగ్గుముఖం పట్టింది. రెండేళ్ల కిందట 35.12 లక్షల టన్నులు, కిందటేడాది 23.08 లక్షల టన్నులుండగా.. ఈసారి కేవలం 16.19 లక్షల టన్నుల దిగుబడి మాత్రమే రావొచ్చని అంచనా వేశారు. చిరుధాన్యాల దిగుబడి కూడా.. గడిచిన అయిదేళ్ల సగటు కంటే తగ్గిపోయింది. 2013-14లో 102.21 లక్షల టన్నులున్న చిరుధాన్యాల ఉత్పత్తి కిందటేడాది 69.55 లక్షల టన్నులకు పడిపోయింది. ఈసారి అంతకంటే ఘోరంగా 46.85 లక్షల టన్నులకు పరిమితమైంది.