అడల్ట్ సైట్ లో ఫోటోలు..ఉన్నతాధికారిణి రాజీనామా
యార్క్ షైర్: విద్యార్థులను బుద్ధిమంతులుగా తీర్చిదిద్దే ఉన్నతమైన పదవిలో ఉన్న ఓ మహిళ తన చేష్టలతో ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటన పశ్చిమ యార్క్ షైర్ లోని బ్రాడ్ ఫోర్డ్ లోని వుడ్ సైడ్ అకాడమీలో చోటు చేసుకుంది.
కోప్ లాండ్(39) ప్రైమరీ స్కూల్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే సెక్స్ వర్కర్లు తమ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం ఉపయోగించే వెబ్ సైట్లలో ఆమె ఫోటోలు దర్శనమిచ్చాయి. అది కూడా స్కూలు విద్యార్థినుల దుస్తులను కోప్ లాండ్ ధరించి. అడల్ట్ వర్క్ డాట్ కామ్ వెబ్ సైట్ లో కోప్ లాండ్ బెడ్ పైన టై, స్కర్టు ధరించి వివిధ భంగిమల్లో ఫోజులిచ్చింది. ఈ విషయం బయటకు రావడంతో చేసేదేమీలేక తన పదవికి రాజీనామా చేసింది.
ఆమె పేరుతో ఉన్న ప్రొఫైల్ లో తాను చాలా నాటీ అని, తనకు కొత్తవారితో సంబంధాలంటే చాలా ఇష్టమని పేర్కొంది. అయితే సదరు ప్రొఫైల్ లో పెట్టిన ఫోటోలు తనవేనని కోప్ లాండ్ అంగీకరించింది. కానీ, ఆ వెబ్ సైట్ లోకి ఎలా వచ్చాయో మాత్రం తనకు తెలియడం లేదని వాపోయింది. మరిన్ని సైట్ లలో తన ప్రమేయం లేకుండానే ఆ ఫోటోలు చక్కర్లు కొట్టడంతో వాటిని తొలగించాల్సిందిగా కోరినట్టు తెలిపారు. ఆ ప్రొఫైల్ ను వీక్షించడానికి కస్టమర్ల నుంచి 24 గంటలకు దాదాపు 5 యూరోలు వసూలు చేసేది.
వుడ్ సైడ్ అకాడమీ ట్రస్టుకు కోప్ లాండ్ గత ఏడాది కాలంగా డైరెక్టర్గా వ్యవహరించారని స్కూలు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. జూన్ 7న ఆమె తన పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. కోప్ లాండ్ ప్రైవేటు వ్యవహారాలతో అకాడమీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.