ప్రాథమిక రంగ అభివృద్ధికి రూ.50 కోట్లు
కలెక్టర్ కేవీ రమణ
కడప రూరల్: జిల్లాకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద ప్రభుత్వం విడుదల చేసిన రూ. 50 కోట్లను ప్రాథమిక రంగ అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ కేవీ రమణ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద విడుదలైన నిధులతో ప్రాథమిక రంగంలో నిర్మాణాత్మక పనులు చేపట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందించి సమర్పించాలన్నారు.
ప్రాథమిక రంగంలోని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందించి సమర్పించాల్సి ఉందన్నారు. వివిధ శాఖల నుంచి అందిన ప్రణాళికలను క్రోడీకరించి ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ వారికి సమర్పించి ఆమోదం పొందాల్సి ఉందన్నారు. అధికారులు తమతమ శాఖలకు సంబంధించి హేతుబద్ధమైన ప్రణాళికలు రూపొందించి వెంటనే సమర్పించాలని కోరారు. కార్యక్రమంలో జేసీ-2 చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రజియాబేగం, సీపీఓ తిప్పేస్వామి, డీఆర్డీఏ, డ్వామా పీడీలు అనిల్‌కుమార్‌రెడ్డి, బాలసుబ్రమణ్యం, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు టాగూర్ నాయక్, జిల్లా పరిశ్రమలశాఖ జీఎం గోపాల్, డీపీఓ అపూర్వసుందరి, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు శ్రీనివాసులు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా వినతులకు సత్వర పరిష్కారం కలెక్టర్ కేవీ రమణ
కడప సెవెన్‌రోడ్స్: ప్రజా వినతులను సత్వరమే ప రిష్కరించాలని కలెక్టర్ కేవీ రమణ జిల్లా అధికారుల ను ఆదేశించారు. సోమవారం సభా భవనంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఆయన వినతులు స్వీకరించి పరిశీలించారు. వినతులు పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ రామారావు, జేసీ-2 చంద్రశేఖర్‌రెడ్డి, డీఆర్వో సులోచన, డీఆర్డీఏ, డ్వామా పీడీలు అనిల్‌కుమార్‌రెడ్డి, బాలసుబ్రమణ్యం, జిల్లా పరి శ్రమలశాఖ జీఎం గోపాల్, సెప్ట్ సీఈఓ మమత తదితరులు పాల్గొన్నారు.