ఎయిర్పోర్టులో ఎబోలా వైరస్ పరీక్షలు
శంషాబాద్: పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో విస్తరిస్తున్న ఎబోలా వైరస్ భారతదేశంలోకి రాకుండా విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన ప్రాథమిక పరీక్షా కేంద్రాలు కొనసాగుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇంతవరకు ఈ వ్యాధి లక్షణాలు కలిగిన ప్రయాణికులు ఎవరు కూడా రాలేదని ఎయిర్పోర్టు అథారిటీ ప్రాంతీయ ఉన్నత వైద్యాధికారి డాక్టర్ జూపాక మహేష్ బుధవారం తెలిపారు.
ఉదయం ఇద్దరు, రాత్రి ఇద్దరు వైద్యులు విమానాశ్రయంలో అరైవల్ కేంద్రంలో పరీక్షలు చేయడానికి అందుబాటులో ఉన్నారన్నారు. వ్యాధి తీవ్రత లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇందుకోసం విమానాశ్రయంలో ప్రయాణికులకు సూచించే విధంగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.