'పృథ్వీ-2' ను విజయవంతంగా ప్రయోగించిన భారత్
భువనేశ్వర్: భారత్ అమ్ముల పొదిలో కొత్తగా మరో క్షిపణి వచ్చి చేరింది. భూ ఉపరితలం నుంచి గగన తలంలోకి అణ్వాయుధాలను సమర్ధవంతంగా తీసుకువెళ్లే పృథ్వీ-2 మిస్సైల్ ను శుక్రవారం భారత్ విజయవంతగా ప్రయోగించింది. ఒడిశాలోని మిలటరీ బేస్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించినట్లు సీనియర్ రక్షణ అధికారి తెలిపారు.
ఈ క్షిపణి 350 కి.మీ వరకూ లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలదని స్సష్టం చేశారు. భారత ఆర్మీ దళాలకు మిస్సైల్ ప్రయోగాలు రెగ్యులర్ శిక్షణలో ఒక భాగమని టెస్ట్ రేంజ్ డైరెక్టర్ ఎమ్.వీ.కే.వీ ప్రసాద్ తెలిపారు.