ప్రైవేట్ హోటల్లో చంద్రబాబు బస
ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సాధారణంగా బస చేసే ఏపీ భవన్లో కాకుండా ఓ ప్రైవేట్ హోటల్లో దిగారు. ఓటుకు నోటు కేసు విషయంలో పలువురు ముఖ్యనేతలను ప్రైవేట్ గా కలుసుకోవడానికే ఇలా చేశారని సమాచారం.
దీనిలో భాగంగా బుధవారం ఢిల్లీలో గంటకో కేంద్రమంత్రిని కలిసి ఓటుకు నోటు కేసులో ఆడియో టేపు విడుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేయనున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు గవర్నర్ చేతికి ఇవ్వాలని కోరనున్నారు. అంతేకాకుండా గవర్నర్ నరసింహన్ పై కూడా ఫిర్యాదు చేయనున్నారు.
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్రమంత్రి ఉమాభారతితో భేటీకానున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. 5:30 కు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తో భేటీ అవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం కానున్నారు. అంతేకాకుండా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో పాటు పలువురు ముఖ్యనేతలను కూడా కలుసుకోనున్నారు.