ఒకే ఒక్కరు
గండేడ్ : పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు సెంటర్లో గురువారం జరిగిన హిందీ పరీక్షకు ఒకే ఒక్క విద్యార్థి హాజరయ్యారు. గండేడ్ మండలం మహమ్మదాబాద్ కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల కోసం 150 మంది విద్యార్థులకు సెంటర్ను ఏర్పాటు చేశారు. హిందీ పరీక్ష మాత్రం ఒకే విద్యార్థి రాయాల్సి ఉంది. ఆమె కోసమే ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్ ఒకరు, ఇద్దరు ఇన్విజిలేటర్లు, బందోబస్తు కింద ఇద్దరు పోలీసులు, ఒక వాటర్బాయ్ విధులు నిర్వర్తించారు.