Private persons
-
ఫైర్ వస్తే ఫైటర్ రెడీ!
సాక్షి, హైదరాబాద్: ఏదైనా బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగుతుంటే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే అత్యవసర నంబర్ ‘101’కు ఫోన్ చేసి ఫలానా చోట అగ్ని ప్రమాదం సంభవించిందని చెబుతారు. కానీ ఘటనాస్థలికి ఫైరింజన్లు చేరుకొనేలోగా భవనంలో చిక్కుకున్న వారికి ప్రాణాపాయం క్షణక్షణానికీ పెరుగుతుంటుంది. ఆస్తినష్టమూ అంతకంతకూ ఎక్కువ అవుతూ ఉంటుంది. అయితే ఒకవేళ ప్రమాదం జరిగిన మరుక్షణమే భవనానికి కాపాలాగా ఉండే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందే ఫైర్‌ఫైటర్ల అవతారం ఎత్తగలిగితే ప్రాణ, ఆస్తినష్టాన్ని వీలైనంత మేర తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. సరిగ్గా ఈ ఆలోచనతోనే అగ్ని మాపకశాఖ వినూత్న కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఫస్ట్ రెస్పాండర్స్ కోసం ప్రత్యేకంగా.. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఎంత త్వరగా స్పందిస్తే అంత నష్ట తీవ్రత తగ్గుతుంది. అగ్ని ప్రమాద స్థలంలో ఉన్న వారి అప్రమత్తత సైతం ప్రాణాలు కాపాడటంలో, మంటల వ్యాప్తిని నియంత్రించడంలో కీలకం. అలాంటి ఫస్ట్ రెస్పాండర్స్ అయిన వారిని గుర్తించి అగ్నిప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర అగ్ని మాపకశాఖ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక జీఓను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రైవేటు వ్యక్తులకు 30 రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే మొదటి బ్యాచ్‌లో 29 మందికి శిక్షణ మార్చి 29న ప్రారంభించినట్లు అగ్నిమాపకశాఖ డీజీ వై. నాగిరెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉండే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, పరిశ్రమలు, నివాస సముదాయాల్లో అందుబాటులో ఉండే వారికి అగ్ని ప్రమాదాల నియంత్రణ, ప్రమాద సమయంలో ప్రాణ, ఆస్తినష్టం నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి నేర్పడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని నాగిరెడ్డి వివరించారు. ఫీజు రూ.5,000 గతంలో అగ్ని మాపక శాఖ నుంచి ప్రైవేటు వ్యక్తులకు శిక్షణ ఇచ్చేవారు. కానీ అది మూడు రోజులు మాత్రమే ఉండేది. దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో అగ్ని మాపకశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా 30 రోజుల శిక్షణకు అనుమతి తీసుకున్నారు. దాని ప్రకారం వట్టినాగులపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్విసెస్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రైవేటు వ్యక్తులకు శిక్షణ ప్రారంభించారు. 30 రోజులపాటు ఇచ్చే ఈ శిక్షణలో అన్ని రకాల అగ్నిప్రమాదాలు, ప్రమాదాల నియంత్రణలో అనుసరించాల్సిన విధానాలు, నివాసాలు, వ్యాపార సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాల నిర్వహణ, అగ్ని ప్రమాదాల నియంత్రణపై అవగాహన తదితర అంశాలను వారికి నేర్పుతున్నారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు, ప్రైవేటు ఆస్పత్రులు, పరిశ్రమలు, ఇతర రెసిడెన్షియల్ సొసైటీలలో ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి ఈ శిక్షణ అందిస్తున్నారు. తమ సిబ్బందికి శిక్షణ ఇప్పించాలనుకొనే ప్రైవేటు సంస్థలు అగ్ని మాపకశాఖ వెబ్సైట్లో ముందుగా దరఖాస్తు చేసుకుంటే బ్యాచ్‌లవారీగా శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శిక్షణ కోసం ఒక్కో వ్యక్తి నుంచి ఫీజు కింద రూ. 5 వేలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇలా స్పాన్సర్స్ నుంచి తీసుకున్న మొత్తాన్ని శిక్షణ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. -
సీబీఐ అధికారినంటూ విశాఖవాసి మోసాలు.. ఏకంగా ఏడీజీపీగా నటన.. చివరకు
న్యూఢిల్లీ: సీబీఐ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి బాగోతం బట్టబయలైంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో సీనియర్ ఆఫీసర్ని అని చెప్పుకుంటూ అనేక మంది వ్యక్తుల నుంచి డబ్బు వసూలు చేసిన కొవ్విరెడ్డి శ్రీనివాసరావును సీబీఐ అరెస్టు చేసి కేసు నమోదు చేసింది. ఈ నకిలీ అధికారి విశాఖపట్నం చిన్నవాల్తేరుకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. సీబీఐలో సీనియర్ ఐపీఎస్ అధికారిగా నటిస్తూ అతను భారీగా కూడబెట్టినట్టు తెలిసింది. నిందితుడిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు అతని ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.21లక్షల నగదు, గోల్డ్ స్టోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఢిల్లీలోని తమిళనాడు హౌస్‌లో ఉంటున్నాడు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ)గా అందరినీ నమ్మించాడు. శ్రీనివాసరావును అరెస్ట్ అనంతరం ఢిల్లీలోని కాంపిటెంట్ కోర్టు ముందు హాజరుపరచగా, రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. -
కాపాడే వారెవరురా...!
తిరుమల బైపాస్ రోడ్డులోని అలిపిరి పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న మొహబూబా లే అవుట్ పార్క్ స్థలంలో 1980 నుంచి రెండేళ్ల క్రితం వరకు ఇది కార్పొరేషన్ స్థలం.. ఎవరు ప్రవేశించినా శిక్షార్హులు అన్న బోర్డు ఉండేది. కానీ ఇప్పుడా ప్రదేశంలో భారీ భవంతి వెలసింది. కోటిన్నర రూపాయల విలువ చేసే 30 అంకణాల∙స్థలాన్ని అధికార పార్టీ నాయకుడు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కబ్జా చేశారు. కార్పొరేషన్ రికార్డుల ప్రకారం ఈ స్థలం ఇప్పటికీ పార్క్ స్థలమే. కొంతమంది అధికారులు కబ్జాదారుడికి సహకరించారు. కోటిన్నర విలువ చేసే స్థలాన్ని కట్టబెట్టేశారు. సాక్షి, తిరుపతి తుడా : తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ స్థలాలకు రక్షణ కరువైంది. కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఒక్కొక్కటిగా తరిగిపోతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ 27.44 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కొన్ని స్థలాలు ఏళ్ల క్రితమే కనుమరుగయ్యాయి. ఆ ఆక్రమణల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. అధికారులే ఆక్రమణదారులతో చేతులు కలుపుతున్నారు. స్థలాలకు ఎసరు పెడుతున్నారు. సుమారు 11 ప్రాంతాల్లోని స్థలాలను కబ్జారాయుళ్లు కొట్టేశారని అంచనా. ఇవన్నీపోగా ఇప్పుడు 43 స్థలాలు మాత్రమే మిగిలాయి. గతంలో కొంతమంది కమిషనర్లు స్థలాలను కాపాడేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ మాత్రమైనా మిగిలాయని బాధ్యత కలిగిన కొంతమంది అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన ఖరీదైన స్థలాలనైనా పూర్తిస్థాయిలో రక్షించేం దుకు అధికారులు చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు. 2008లో కార్పొరేషన్లోకి మూడు పంచాయితీలు విలీనమయ్యాయి. ఈ ప్రాంతంలో 27స్థలాలు కార్పొరేషన్ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో 23 స్థలాలకు కనీసం ప్రహ రీ గోడలను కూడా ఏర్పాటు చేయలేదు. అప్పటి పంచాయితీలకు చెందిన స్థలాలు, ప్రైవేట్ వెంచర్లలో ప్రజా అవసరాలకు కేటాయించిన పార్కు స్థలాలు ఇప్పుడు కార్పొరేషన్ చేతిలోకి వచ్చాయి. పాత నగర పరిధిలో స్థలాలను కాపాడలేకపోయిన అధికారులు కనీసం విలీన పంచాయితీల స్థలాలనైనా కాపాడుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ వెంచర్లలోని పార్కు స్థలాలను స్వాధీనం చేసుకుని ప్రహరీగోడ నిర్మించి స్థానిక అవసరాల నిమిత్తం అభివృద్ధి చేపడితేగానీ వీటిని కాపాడగలరు. ప్రహరీగోడలను సైతం నిర్మించకుండా అధికారులు ఈ స్థలాలపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వీటిపై స్థానికంగా ఉండే కొంతమంది నాయకులు కన్నుపడింది. ఆక్రమించి నిర్మాణాలు చేపట్టకముందే అధికారులు రక్షించుకోవాల్సిన బాధ్యత పై స్థాయి అధి కారులపై ఉంది. ప్రైవేట్ వ్యక్తుల గుప్పెట.. కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలు ఇప్పటికే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అధికారులు లీజు పేరుతో కార్పొరేషన్ స్థలాలను కొంతమందికి కట్టబెట్టారు. ఇప్పటికీ ఆ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సాహసించడం లేదు. లీజు పేరుతో స్థలాలను ఆధీనంలో పెట్టుకున్న వ్యక్తులు కోర్టుద్వారా స్టేలు తెచ్చుకుంటూ ఏళ్ల తరబడి అనుభవిస్తున్నారు. అధికారులు సమర్ధంగా తమ వాదనను కోర్టులో వినిపిస్తే ఎప్పుడో ఈ స్థలాలను కార్పొరేషన్ చేజిక్కించుకునేది. కొంతమంది అధికారులు ఆ వ్యక్తులతో లాలూచీ పడి విలువైన స్థలాలను కార్పొరేషన్‌కు రాకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. తిరుపతి గాంధీరోడ్డు లాంటి ప్రాంతంలోని స్థలాన్ని అతితక్కువ అద్దెతో నెట్టుకొస్తున్నారు. పదేళ్ల నుంచి ఇక్కడ మల్టీ పార్కింగ్ కాంప్లెక్స్ కట్టాలని ప్రతిపాదన ఉంది. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించే సాహసాన్ని అధికారులు చేయడం లేదు. ఈ స్థలా న్ని స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా అధికారులు స్పందిం చడం లేదు. శ్రీనివాసం సముదాయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో 15 ఏళ్లక్రితం ఓ వ్యక్తి హోటల్ నడిపేందుకు కార్పొరేషన్ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఆ వ్యక్తి నుంచి ఆ స్థలాన్ని తీసుకునేం దుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. రైల్వేస్టేషన్ పార్సిల్ సర్వీస్‌కు ఎదురుగా ఉన్న స్థలాన్ని ప్రైవేట్ పార్కింగ్ స్థలంగా మార్చేశారు. ఇలా అనేక ప్రాంతాల్లో కార్పొరేషన్ స్థలాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. -
మద్యం సిండికేట్లకు ఏపీ ప్రభుత్వం దాసోహం
-
దేవుడికీ రాజకీయ సెగ
ప్రభుత్వం వరమిచ్చింది. అర్చకులు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తమ పరపతిని పెట్టుబడిగా పెట్టి అసలుకే ఎసరు పెడుతున్నారు. దైవారాధనే నిత్యకృత్యమైన అర్చకులకు జీవన భృతి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారికిస్తున్న దేవాలయ భూములు ప్రైవేట్ వ్యక్తుల పరమవుతున్నాయి. లక్షలకు లక్షలు ఆర్జించి పెడుతున్నాయి. అరసవల్లి ఆదిత్యునికి చెందిన భూములూ దీనికి మినహాయింపు కాదు. అధికారులు సైతం చూసీచూడనట్లు పోతుండటం.. రాజకీయ ఒత్తిళ్లు తోడుకావడంతో దేవస్థానానికి చెందిన విలువైన స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు పాగా వేశారు. అరసవల్లి:దేవుడి భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. శ్రీకాకుళం పట్టణంలోని అరసవల్లి రోడ్డులో సర్వే నెంబర్ 503/2లో ఉన్న 16 సెంట్ల అరసవల్లి దేవస్థానం భూమిని బయటి వ్యక్తులు ఆక్రమించి వ్యాపారం చేసుకుంటున్నారు. మెయిన్ రోడ్డును ఆనుకొనే ఈ భూమి ఉంది. ఆలయ ఈవో, సిబ్బంది, దేవాదాయశాఖ అధికారులు నిత్యం ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నా.తమకు సంబంధం లేనట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు వెంటనే సిబ్బందిపై విరుచుకుపడి మెమోలు, సస్పెన్షన్లు వంటి చర్యలు చేపడుతున్న అధికారులు దేవుడి భూమిలో ప్రైవేట్ వ్యాపారం విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నారు. వాస్తవానికి ఈ భూమిని జీవన భృతి కోసం దేవస్థానం అర్చకులకు ఇచ్చారు. వారు దీన్ని అన్యాక్రాంతం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ.80 లక్షల విలువైన ఈ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చేసిన విషయం దేవస్థానం ఇన్చార్జి ఈవో ఆర్.పుష్పనాథానికి గతంలో తెలిసింది. అయితే ఆయన పెద్దగా పట్టించుకోకుండా ప్రధాన అర్చకుడికి మెమో ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. మిగిలిన సిబ్బంది దీన్ని తప్పు పడుతున్నారు. అదే ఇతరులెవరైనా దేవుడి మాన్యాన్ని ఆక్రమించి సొంత వ్యాపారాలు పెట్టుకుంటే కఠిన చర్యలకు దిగుతారని.. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. చట్టం చట్టుబండలే..అర్చకులకు ఇచ్చే మాన్యాల్లో పండించే ఫలసాయాన్ని అనుభవించడమే తప్ప భూములను ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ లీజుకు ఇవ్వరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. లీజుకు ఇచ్చినా, భూములను ఎవరైనా ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా కల్పించాయి. అయితే ఈ 16 సెంట్ల భూమి విషయంలో రాజకీయ ఒత్తిళ్లు బాగా పనిచేస్తున్నట్లు తెలిసింది. అందువల్లే ఈవో సహా ఇతర అధికారులు దాని జోలికి వెళ్లడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘కేశవరెడ్డి స్కూల్ ఎదురుగా ఉన్న స్థలంలో మావాడే ఉంటున్నాడు.. చూసి చూడనట్లు వదిలేయండి’ అంటూ దేవస్థానం ఇన్చార్జి ఈవోకు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధులే ఇలా ఆక్రమణదారులను వెనకేసుకొస్తూ.. ఆక్రమణలను ప్రోత్సహిస్తుంటే ఇక దేవుడి మాన్యాలకు దిక్కెవరన్న ప్రశ్న తలెత్తుతోంది. చేతులు మారిన లక్షలు మొయిన్ రోడ్డును ఆనుకొని ఉన్న ఈ స్థలంలో అక్రమ లీజు విషయంలో లక్షలాది రుపాయలు చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ అధికారులకు కూడా ముడుపులు అందడం వల్లే వారు నోరు మెదపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పొట్ట కూటికి రోడ్డు పక్కన చిన్న బడ్డీ పెట్టుకుంటేనే నానా యాగీ చేసే అధికారులు రూ.లక్షల విలువైన దేవస్థానం భూమిలో పాగా వేసి యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నా తమకు సంబంధం లేనట్లు మిన్నకుండటం విడ్డూరమే. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం శ్రీసూర్యనారాయణస్వామి దేవస్థానానికి చెందిన సర్వే నెంబరు 503/2లోని 16 సెంట్ల భూమిలో ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై ఈ ఏడాది జూన్ 19న ఆర్సీ నెంబర్42/4 మెమో జారీ చేశాం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటాం. - ఆర్.పుష్ఫనాథం, ఇన్చార్జి ఈవో