breaking news
Priya Shetty
-
లక్స్ పాప సేఫ్.. నీలా బూతులు మాట్లాడనంటూ రీతూను రెచ్చగొట్టిన శ్రీజ
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ (Bigg Boss Telugu 9) మొదలై రెండు వారాలైందంతే.. అప్పుడే ఫ్యామిలీ కోసం బోరుమని ఏడుస్తున్నారు కంటెస్టెంట్లు. ప్రతిసారి కనీసం నెల రోజుల తర్వాతే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి లెటర్లు గట్రా పంపేవాడు. అదేంటో కానీ ఈసారి రెండువారాలకే ఈ కుటుంబ ఎమోషన్స్ ఎపిసోడ్ మొదలుపెట్టేశారు. బ్లూ సీడ్స్ అందుకున్నవారికే ఈ అవకాశం కల్పించాడు. సీక్రెట్ బాక్స్ ఓపెన్అందులో భాగంగా ఇప్పటికే ఇమ్మాన్యుయేల్ ఫ్యామిలీ ఫోటో గెల్చుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో తనూజ, ప్రియ ఇంటినుంచి లెటర్స్ అందుకున్నారు. సుమన్ ఇంటినుంచి ఏదైనా అందుకోవాలంటే భరణి సీక్రెట్ బాక్స్ ఓపెన్ చేయాలని బిగ్‌బాస్ మెలిక పెట్టాడు. దీంతో అతడు తన బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో ఒక చైన్, లాకెట్ ఉంది. లాకెట్లో అమ్మ, గురువు అని రాసుంది. వీరిద్దరూ తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని చెప్పాడు.శ్రీజ, రీతూ మధ్యే అసలైన పోటీఅలా సుమన్ తండ్రి ఫోటో అందుకున్నాడు. కానీ సంజనాకు ఏదీ అందలేదు. ఇకపోతే బ్లాక్ సీడ్స్ ఉన్న ముగ్గురు రీతూ, శ్రీజ, ఫ్లోరాకు గురి తప్పద్దు అనే గేమ్ పెట్టాడు. ఈ గేమ్‌కు సంజనాను సంచాలక్‌గా పెట్టారు. ఇక బరిలో దిగిన శ్రీజ, రీతూ పోటాపోటీగా ఆడారు. రీతూ విజయం తథ్యం అన్న సమయంలో శ్రీజ ఆటను మలుపు తిప్పింది. తను గెలవకపోయినా పర్లేదు కానీ రీతూ గెలవకూడదన్న ఉద్దేశంతో ఫ్లోరాకు సాయం చేసింది.నీలాగా బూతులు మాట్లాడట్లేదుగాఅది చూసిన రీతూ.. గేమ్ సరిగా ఆడు, నువ్వు గెలవాలని ఆడు కానీ, ఇదేంటి? అని చిరాకు పడింది. అందుకు శ్రీజ.. నా గేమ్ నా ఇష్టం. నువ్వు మొన్న రాముకు సపోర్ట్ చేయలేదా? నేను ఫ్లోరాకు సమాన అవకాశం రావాలని చేస్తున్నా.. నీలాగా బూతులు మాట్లాడి వేరొకరినైతే హర్ట్ చేయట్లేదుగా అని కౌంటరిచ్చింది. చివరకు ఈ గేమ్‌లో ఫ్లోరా గెలిచి ఈ వారం ఇమ్యూనిటీ దక్కించుకుంది.ఎప్పుడూ ఇంతే..అంత కష్టపడ్డా ప్రతిఫలం దక్కకపోవడంతో రీతూ కన్నీళ్లు పెట్టుకుంది. నాకు అదృష్టం కలిసిరాదు, ఎప్పుడూ ఇంతే.. అని బోరుమని ఏడవడంతో అందరూ ఆమెను ఓదార్చారు. ఇక ఈ వారం ఫ్లోరా గెలవడంతో నామినేషన్స్‌లో ఐదుగురే మిగిలారు. వారే ప్రియ, రాము, రీతూ, పవన్ కల్యాణ్, హరీశ్. వీరిలో ప్రియ డేంజర్ జోన్లో ఉంది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి!చదవండి: స్టార్ హీరో ఇల్లు వేలం.. రోడ్డు మీదకు సతీమణి -
బిగ్‌బాస్‌కు వద్దన్నాం.. మీరే ఓట్లేశారు.. మరిప్పుడెందుకు తిడుతున్నారు?
సామాన్యుల్లో నుంచి వజ్రాల్ని వెలికితీసి పంపాలనుకుంది బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) టీమ్. అందుకే అగ్నిపరీక్ష కార్యక్రమం నిర్వహించింది. దానికి బిందుమాధవి, అభిజిత్, నవదీప్ జడ్జిలుగానూ వ్యవహరించారు. గేమ్స్ ఆడుతూ, ముక్కుసూటిగా మాట్లాడిన వారిని, చలాకీగా ఉన్నవారిని సెలక్ట్ చేసి పంపారు. అక్కడివరకు బాగానే ఉంది. కానీ తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లోకి వెళ్లాక అంతా రివర్స్ అయింది. కామనర్లపై నెగెటివిటీఆట సంగతి పక్కనపెడితే మాటలు, గొడవలు, రూల్స్, ప్రవర్తన.. అన్నిరకాలుగా పెంట పెంట చేశారు. దీంతో కామనర్లు మాకొద్దురా బాబూ అని జనం తలలు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే గతవారం కామనర్ల నుంచి మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చంటున్నారు. అందులో ప్రియ పేరు బలంగా వినిపిస్తోంది. పుట్టుకతో వచ్చిన గొంతుఈ క్రమంలో ప్రియ (Priya Shetty) పేరెంట్స్ సురేఖ-వివేకానంద ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వారు మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు వద్దనే చెప్పాం. అగ్నిపరీక్షకు ట్రై చేస్తుంటే కూడా వద్దన్నాం. తనే గట్టిపోటీనిస్తానంటూ షోకి వెళ్లింది. అగ్నిపరీక్షలో ఆదరించిన ప్రేక్షకులే ఇప్పుడు బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడు విమర్శిస్తున్నారు. పుట్టుకతో వచ్చిన గొంతుకకు మనమేం చేయలేం. చాలా తప్పుతను ఉన్నదున్నట్లుగా మాట్లాడుతుంది. వాయిస్ వల్ల మీకు డిఫరెంట్‌గా కనిపిస్తుందంతే! గొంతు వల్ల ఆమెను ట్రోల్ చేయడం చాలా తప్పు. అగ్నిపరీక్షలో కూడా అదే గొంతుంది. అప్పుడేమో క్యూట్ అంటూ ఓట్లేశారు. ఇప్పుడెందుకు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు? ఈ ట్రోలింగ్ చూస్తుంటే బాధేస్తోంది. బిగ్‌బాస్ వల్ల తన పెళ్లికి ఏమీ ఎఫెక్ట్ కాదు. తనను అర్థం చేసుకునే వ్యక్తితోనే పెళ్లి చేస్తాం అని చెప్పుకొచ్చారు.చదవండి: అర్ధరాత్రి ఇంటికి రీతూ.. తననలాగే చూస్తా! డిప్రెషన్లో ఉన్నా: ధర్మ మహేశ్ -
హౌస్‌లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై బిగ్‌బాంబ్ వేసిన మనీష్
బిగ్‌బాస్ షోలో మనీష్ ఓవర్ కాన్ఫిడెన్స్, అతి చేష్టలతో ఎలిమినేషన్ ఏరికోరి తెచ్చుకున్నాడు. దీంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మొదటి కామనర్‌గా నిలిచాడు. వెళ్తూ వెళ్తూ కామనర్‌పై ఓ బిగ్‌బాంబ్ విసిరాడు. మరి సండే ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం.. రీతూ చౌదరి వల్ల కెప్టెన్సీ పెంటపెంటయింది. దీంతో కెప్టెన్సీ టాస్క్‌ను రద్దు చేసి మళ్లీ గేమ్ పెట్టారు. ఈ గేమ్‌లో పవన్ కష్టపడి కెప్టెన్సీ సాధించుకున్నాడు. తర్వాత ఓ ఫన్ గేమ్ ఆడించగా అందులో కామనర్స్ గెలిచారు.మనీష్ ఎలిమినేటెడ్ఇక నాగ్ ఒక్కొక్కరినీ సేవ్ చేస్తూ రాగా చివరకు ఫ్లోరా, మనీష్ (Manish Maryada) మిగిలారు. ఎలాగో ఫ్లోరా ఎలిమినేషన్ ఖాయమని ఫిక్సయిన కామనర్లు.. ఆమెకు ఆల్ ద బెస్ట్, మిస్ యూ అంటూ డైలాగులు చెప్పారు. తీరా ఫ్లోరా సేఫ్, మనీష్ ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించగానే అందరూ నోరెళ్లబెట్టారు. మనీష్ వెళ్లేముందు అతడితో ఓ గేమ్ ఆడించారు. ఈ షోలో టాప్ 3 ఎవరు? బాటమ్ 3 ఎవరు? చెప్పాలన్నాడు. బాటమ్ 3లో శ్రీజఅందుకు మనీష్ ముందుగా బాటమ్ 3లో శ్రీజ (Dammu Srija) పేరు చెప్తూ తను గేమ్ సరిగా ఆడట్లేదన్నాడు. తర్వాత ఫ్లోరా సైనిని బాటమ్‌లో పెడుతూ.. ఆమె పని తప్ప గేమ్ కనిపించట్లేదన్నాడు. సుమన్‌ను కూడా బాటమ్ 3లో యాడ్ చేశాడు. సుమన్ అన్నా.. హ్యాట్సాఫ్. మీరు ఏం ఆడుతున్నారన్నా.. నేనసలు ఊహించనేలేదు. అయినా బాటమ్‌లో ఎందుకున్నారంటే.. అలా కనిపించి, ఇలా వెళ్లిపోతారు. మీకంటూ ఓ స్టాండ్ తీసుకోరు అని చెప్పుకొచ్చాడు. తర్వాత టాప్ 3 గురించి మాట్లాడాడు. ఆయనే నెం.1నా ప్రకారం భరణిగారు నెం.1. ఆయన అందరి కోసం ఆలోచిస్తారు, మరోపక్క గేమ్ కూడా ఆడతారు. మీరు చాలా స్ట్రాంగ్ కంటెండర్. మీలాంటివాళ్లతో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు, మీతో ఫైట్ చేసినందుకు సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇమ్మాన్యుయేల్.. మొదట ఇతడిని నేను సీరియస్‌గా తీసుకోలేదు. కామెడీ చేస్తారంతే అనుకున్నా.. కానీ ఇచ్చిపడేసిండు. కామెడీ, ఎమోషన్స్, గేమ్.. అన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. మిమ్మల్ని తప్పకుండా టాప్ 3లో చూడాలనుకుంటున్నా.. వేరేవాళ్ల కోసం ఆటను వదిలేయకండి అని సూచనలిచ్చాడు.అపార్థం చేసుకున్నా..కామనర్ల నుంచి ఏకైక వ్యక్తిని టాప్ 3లో చేర్చాడు. అతడే హరీశ్. ఎమోషన్స్ దగ్గరే ఆగిపోకండి. కొంచెం కోపం తగ్గించుకుంటే టాప్ 1కి వెళ్తారు అన్నాడు. తర్వాత నాగార్జునను అడిగి మరో వ్యక్తిని టాప్ 4గా వెల్లడించాడు. ఆవిడే సంజన. సంజనను నేను ఎంత అపార్థం చేసుకున్నానో తర్వాత అంత అర్థం చేసుకున్నాను. నాకు, తనకు ఇంట్లో ఏ పనీ లేదు. అయితే పని రాలేదు కాబట్టి తనే పని తెచ్చుకుంటా.. అది కూడా గేమే అంది. అప్పుడే నాకు మైండ్ బ్లాక్ అయింది.రాత్రి ఒంటరిగా కన్నీళ్లుపగలంతా అందర్నీ సతాయిస్తుంది. రాత్రి ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంది. ఈ విషయం ఎవరికీ తెలియదు. నేను ఎక్కువ మిస్ అయ్యేది సంజననే.. అని ఎమోషనలయ్యాడు మనీష్. అందరినీ పని అడిగాను, ఎవరూ ఇవ్వలేదు. ఈమె ఒక్కరే నాకు వర్క్ ఇచ్చింది. తనకు నేను వంట చేసి పెట్టాను. మీరు టాప్ 3లో ఉండాలి. భాష నీకు అడ్డు కాదు. నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మనీష్ ధైర్యం చెప్పాడు. జైల్లోకి ఫ్లోరా..అందుకు సంజనా.. నేను తెలుగమ్మాయినే, నాకు భాష ఏం అడ్డం కాదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్‌లో మోస్ట్ బోరింగ్ మనిషిగా ఫ్లోరాను ఎంపిక చేశారు. దీంతో ఆమె జైల్లోకి వెళ్తుంది. కాబట్టి ఆమె చేసే వాష్‌రూమ్ డ్యూటీ టెనెంట్స్‌లో ఒకరికి వేయాలన్నాడు నాగ్. దీంతో ఈ బిగ్‌బాంబ్‌ను మనీష్ ఇది నా రివేంజ్ అంటూ ప్రియకు ఆ క్లీనింగ్ పని అప్పగించి సెలవు తీసుకున్నాడు.చదవండి: ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్! రెండువారాల సంపాదన ఎంతంటే? -
నాగార్జుననే ఎదిరించిన శ్రీజ, ప్రియ.. ఉతికారేసిన హోస్ట్
జింతాత జితా జితా.. జింతాత తా.. శనివారం ఎపిసోడ్ చూశాక ఈ పాట కచ్చితంగా వేసుకోవాల్సిందే! ఆ రేంజ్లో ఉంది నాగార్జున హోస్టింగ్. మేమే తోపు, ఇల్లంతా మాదే అన్న భ్రమలో బతికేస్తున్న సామాన్యుల మబ్బులు విడిపోయేలా క్లాస్ పీకాడు. ముఖ్యంగా ప్రతిదానికీ గొడవపడటం ఒక్కటే మార్గం అన్నట్లుగా నోరేసుకుని పడిపోతున్న ప్రియ, శ్రీజల నోటికి తాళం వేసేలా మాట్లాడాడు. అసలు ఎపిసోడ్లో ఏం జరిగిందో వివరంగా చూసేద్దాం..ఒళ్లంతా కళ్లు లేవునాగార్జున (Nagarjuna Akkineni) వచ్చీరావడంతోనే రీతూ చౌదరి సంచాలక్‌గా ఫెయిలైందని వీడియో ఆధారాలతో సహా బయటపెట్టాడు. భరణిని కావాలనే గేమ్‌లో ఎలిమినేట్ చేసిందని చూపించాడు. పవన్ కెప్టెన్ అవాలని ముందునుంచే నిర్ణయించుకున్న ఆమె అనుకున్న ప్రకారం అతడిని కెప్టెన్ చేసిందన్నాడు. రీతూ మాత్రం.. నాకున్నవి రెండే కళ్లు, బాడీ మొత్తం లేవు కదా.. టాస్క్‌లో పవన్ వేరేవాళ్లకు రంగు పూసింది కనిపించలేదు. నాకతడిపై సాఫ్ట్ కార్నర్ లేదు. కావాలని గెలిపించలేదు అని కహానీలు చెప్పింది. సారీ చెప్పిన రీతూకానీ స్టూడియోలో ఉన్న ఆడియన్స్ రీతూ (Rithu Chowdary) తప్పు నిర్ణయం తీసుకుంది సార్. ప్రియ, శ్రీజ, మనీష్ శాడిస్టులుగా ప్రవర్తించారు. టెనెంట్స్‌కు అన్యాయం జరిగింది అన్నారు. దాంతో రీతూ చేసేదేంలేక సారీ చెప్పింది. అయితే ప్రియ, శ్రీజ మాత్రం మేమేం తప్పు చేశాం? అని ఏమీ ఎరగనట్లే మాట్లాడారు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నాం, అందులో తప్పేముంది? అని ప్రశ్నించింది. ప్రియ, శ్రీజలకు ఇచ్చిపడేసిన నాగ్దీనికి నాగ్.. షోకి వెళ్లేవరకు మాత్రమే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. ఇప్పుడు ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ మాత్రమే అని క్లాస్ పీకాడు. ఎంతసేపూ తుత్తుత్తు అంటూ మాట్లాడతారు. ఇద్దరూ కాదు, ఎవరో ఒకరే మాట్లాడండి అని ప్రియ, శ్రీజలను హెచ్చరించాడు. అలాగే ప్రియ సంచాలక్‌గా ఫెయిలైన వీడియో (చక్రం టాస్క్‌లో పవన్ కల్యాణ్ ఫౌల్ గేమ్) కూడా ప్లే చేశాడు. మొదట తనది తప్పేనని ఒప్పుకున్న ఆమె.. తర్వాత తనసలు తప్పు చేయలేదు, అంతా కరెక్ట్‌గానే ఉందని నాగార్జునతోనే వాదించింది.ఇది కరెక్ట్ కాదు సార్ఇక మరోవైపు డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు చేసిన నాగ్ మళ్లీ కెప్టెన్సీ టాస్క్ పెడతానని ప్రకటించాడు. ఈసారి కూడా రీతూ చౌదని సంచాలక్‌గా ఉంటుందని వెల్లడించాడు. ఇది నచ్చని శ్రీజ.. ఇది కరెక్ట్ కాదు సార్.. అంటూ నాగార్జుననే ఎదిరించింది. సంచాలక్ చేసిన తప్పుకి ప్లేయర్‌ను తీసేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. పవనే ఈ కెప్టెన్సీ వద్దనుకుంటున్నాడు. ఫెయిర్‌గా ఆడి గెలవాలనుకుంటున్నాడు. నీకేంటి సమస్య? ప్రతి విషయంలో తుత్తుత్తు అని వస్తావ్ అని శ్రీజ దుమ్ము దులిపేశాడు. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లంటే ఇదే!అలా నెత్తికెక్కిన కామనర్ల కళ్లు కిందకు వచ్చేలా చేశాడు. నాగార్జున కామనర్లపై విరుచుకుపడినప్పుడల్లా ప్రేక్షకుల చప్పట్లతో స్టూడియో దద్దరిల్లిపోయింది. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే.. ఓనర్లను టెనెంట్లుగా, టెనెంట్లను ఓనర్లుగా మార్చేశాడు. ఓనర్షిప్ గెలిచి సాధించుకున్న రాము, భరణి ఓనర్లుగానే కొనసాగుతారన్నాడు. మరి టెనెంట్లయ్యాకైనా కామనర్ల గర్వం అణుగుతుందేమో చూడాలి!చదవండి: బిగ్‌బాస్ 9 రెండో ఎలిమినేషన్.. సామాన్యుడు ఔట్! -
'మీ ఇద్దరే గొడవ పెట్టుకుంటున్నారు'.. మర్యాద మనీశ్ ఫైర్!
తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్ బుల్లితెర ప్రియులను అలరిస్తోంది. మొదటి వారం నుంచే హౌస్ హాట్‌హాట్‌గా సాగుతోంది. నామినేషన్స్ తంతు ముగియగానే ఒకరిపై ఒకరు తమ ఆగ్రహాన్ని ప్రదరిస్తునే ఉన్నారు. ఇవాళ కెప్టెన్సీ టాస్క్ కావడంతో ఎపిసోడ్ ఫుల్ సీరియస్‌గా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.తాజాగా ఇవాల్టి బిగ్‌బాస్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో మర్యాద మనీశ్, ప్రియా శెట్టి, శ్రీజ దమ్ముల మధ్య పెద్ద వార్ నడిచింది. మీ ఇద్దరు ప్రతి విషయంలో గొడవ పెట్టుకుంటున్నారని ప్రియా, శ్రీజపై మర్యాద మనీశ్ మండిపడ్డారు.నేను కామ్‌గా ఉన్నానని నన్ను సెపరేట్ చేయడానికి ట్రై చేయకండి అన్నాడు. ఆ తర్వాత ప్రియాశెట్టి.. మర్యాద మనీశ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ ప్రోమో చూస్తుంటే హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య ఫుల్ ఫైటింగ్ నడిచినట్లు తెలుస్తోంది.Fights heating up! 🔥 #PriyaShetty & #SrijaDammu Vs #ManishMaryada🤯Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat–Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/EUTUXSKlR4— JioHotstar Telugu (@JioHotstarTel_) September 11, 2025 -
నోరు తెరిస్తే అబద్ధాలు, నీవల్లే గొడవలు.. నామినేషన్స్‌లో హీరోయిన్
బిగ్‌బాస్ షోలో అందరికీ నచ్చేది నామినేషన్స్. ఈ సీజన్లో మొదటి నామినేషన్స్ నేడు జరగనున్నాయి. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో అందరి టార్గెట్ హీరోయిన్ సంజన అనే కనిపిస్తోంది. బిగ్‌బాస్.. కామనర్లను ఓనర్లుగా ప్రధాన హౌస్‌లోకి పంపించి, సెలబ్రిటీలను టెనంట్లు(అద్దెకుండేవారు)గా గార్డెన్ ఏరియాలో ఉన్న బెడ్రూమ్కు పంపాడు. ఈరోజు నామినేషన్స్ ఓనర్స్ వర్సెస్ టెనంట్స్ అన్నట్లుగా జరగనుంది. టెనంట్స్లో నుంచి ఒకరిని ఓనర్స్ నేరుగా నామినేట్ చేయొచ్చన్నాడు బిగ్‌బాస్.అబద్ధాలుదాంతో అందరూ కలిసి సంజన గల్రానీని సెలక్ట్ చేశారు. నీ వల్లే గొడవలు జరుగుతున్నాయి. అబద్ధాలాడుతున్నావ్, వెనకాల మాట్లాడుతున్నావ్ అంటూ కారణాలు చెప్పారు. ప్రియ బ్యాక్ బిచింగ్ అనగానే సంజనాకు మండిపోయింది. అలాంటి పదాలు వాడొద్దని హెచ్చరించింది. తర్వాత సంజనా- ఆశా గొడవపడ్డారు. నా పర్సనల్ రిలేషన్షిప్ గురించి పదేపదే మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? అని సంజనాను నిలదీసింది. (Bigg Boss 9 Telugu First Week Nominations)ఎలిమినేషన్ గండంఆమె నామినేషన్స్‌లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరైతే కిచెన్‌లో అడుగుపెడతారో వారు ఎప్పుడూ ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉంటారు. అందులోనూ మొదటివారం కిచెన్‌లో దూరినవారు మరోవారం కనిపించకుండా పోతారు, అదే ఎలిమినేట్ అవుతారు. మరి సంజనా ఈ గండం గట్టెక్కుతుందో, లేదో చూడాలి!