priyana chopra
-
దాచాల్సిన అవసరం లేదు!
గొప్పలు చెప్పుకోవడానికి కాదు మనలో ఉన్న లోపాలను ఒప్పుకోవడానికి నిజంగా ధైర్యం కావాలి. ఈ విషయంలో ప్రియాంకా చోప్రా ముందు వరసలోనే ఉన్నారు. ‘‘నేను ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నా’’ అని సూటిగా చెప్పేశారు. ఆస్తమా వ్యాధిగ్రస్తుల కోసం ఓ సంస్థ కోరిన మీదట వారిలో ధైర్యం నింపే విధంగా మాట్లాడారు ప్రియాంక. ‘‘నాకు బాగా దగ్గరగా ఉన్నవారికి నేనూ ఆస్తమా పేషంట్ అని తెలుసు. ఈ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆస్తమా నన్ను కంట్రోల్ చేయడానికి ముందే నేనూ ఆస్తమాను కంట్రోల్ చేయగలనని నమ్మాను. ఆస్తమా ఉందని అధైర్యపడలేదు. నా గోల్‌ను సాధించుకోవడంలో బెదరలేదు’’ అని చెప్పుకొచ్చారు ప్రియాంకా చోప్రా. ఇక ప్రియాంకా చోప్రా సినిమాల దగ్గరకు వస్తే సోనాలీ బోస్ దర్శకత్వంలో ‘ద స్కై ఈజ్ పింక్’ అనే సినిమాలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పర్సనల్ లైఫ్‌లోకి తొంగి చూస్తే.. కాబోయే భర్త నిక్ జోనస్‌కు ముద్దు రూపంలో మంచి గిఫ్ట్ ఇచ్చారు ప్రియాంకా చోప్రా. ఇటీవల నిక్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్‌గా పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో నిక్ని ముద్దాడారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక్కడ ఇన్సెట్లో ఉన్న ఫొటో అదే. -
ఒక రోజు ముందే వేడుక
‘ఈజ్ ఇట్ నాట్ రొమాంటిక్’.. ప్రియాంకా చోప్రా చేస్తున్న హాలీవుడ్ సినిమా టైటిల్ ఇది. అంటే.. ఇది రొమాంటిక్ కాదా? అని అర్థం వస్తుంది. ప్రస్తుతం ప్రియాంకా వ్యక్తిగత జీవితం గురించి చాలామంది ఇలానే అనుకుంటున్నారు. అమెరికన్ సింగర్ నిక్ జోనస్లో ప్రియాంక లవ్‌లో ఉన్నారనడానికి ఈ ఇద్దరూ కలిసి తిరుగుతున్న ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. ‘ఈజ్ ఇట్ నాట్ రొమాంటిక్’ అని ఈ జంటను చూసినవాళ్లు అంటున్నారు. ఇవాళ ప్రియాంక బర్త్‌డే. ఈ ఒక్క రోజు మాత్రమే సెలబ్రేట్ చేస్తే ఏం కిక్ ఉంటుందనుకున్నారేమో.. సినిమాలకు ప్రీ–రిలీజ్ ఈవెంట్ జరుపుతున్నట్లు.. ప్రీ–బర్త్‌డే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు నిక్ జోనస్. ఇక్కడ కాదు.. లండన్‌లో. మంగళవారం ఈ ఇద్దరూ అక్కడి ఫేమస్ రెస్టారెంట్లో కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేయడం చాలామంది కళ్లల్లో పడింది. వీళ్లతో పాటు నిక్ సోదరులు కూడా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ప్రియాంకను తమ కుటుంబంలోకి ఆహ్వానించడానికి నిక్ కుటుంబం సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అలాగే, ఇటీవల నిక్ ముంబై వచ్చిన విషయం తెలిసిందే. ప్రియాంక తల్లి మధు చోప్రా కూడా నిక్ని అల్లుడిగా స్వీకరించడానికి సుముఖంగా ఉన్నారట. మరి.. ఈరోజు బర్త్‌డే సందర్భంగా పెళ్లి కబురు ఏమైనా ఈ జంట బయటపెడుతుందా? చూద్దాం. -
హీరోలకేనా అత్యధిక పారితోషికం.. మరి మాకు!
నటి ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ప్రియాంక ఒకరు. అందంతో పాటు చక్కటి అభినయాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. నటనలో హీరోల కంటే హీరోయిన్స్ ఏమీ తక్కువ కాదంటూ ఈ మధ్య బాలీవుడ్ లో సంచలన రేపింది. హీరోయిన్స్ కు సరైన పారితోషికం ఇవ్వని సంఘటనలు ఈ మధ్య సినీ ఇండస్టీలో ఎక్కువగానే ఉన్నాయంటూ విమర్శలు గుప్పించింది. సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ పై ఎప్పుడూ చిన్నచూపూ ఉంటుందంటూ మీడియాకెక్కింది. సినిమాల విషయంలో హీరోయిన్స్ ప్రాధాన్యత పెరిగినా, పారితోషికానికి సంబంధించి హీరోల హవానే ఇంకా కొనసాగుతుందని ఆమె ఓ ప్రకటనలో పేర్కొంది. బాలీవుడ్ లో సినిమా నిర్మించడానికి ఇప్పుడు రూ.200 కోట్లు పైనే ఖర్చు పెడుతున్నారని, అయినా హీరోయిన్స్ కు హీరోలకు ఇచ్చే రెమ్యూనిరేషన్ సగం కూడా లేదంటూ విమర్శలు గుప్పించింది. ఇక ఆ సాంప్రాదాయం మారాలంటే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు పెరగాలని సినీ పెద్దల చెవిన వేసింది. ఇప్పటికే హీరోయిన్స్ ముఖ్య భూమిక పోషించిన సినిమాలు వస్తున్నా, వాటి సంఖ్య పెరగాలని తెలిపింది. డర్టీ పిక్చర్స్ లాంటి తదితర చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నా హీరోయిన్స్ తగిన ప్రాధాన్యత లభించడం లేదని ప్రియాంక తెలిపింది.ఇది మారాలంటే లేడీ ప్రాముఖ్యత ఉన్న సినిమాలు రావాలంటోంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే హీరోయిన్స్ కూడా హీరోలతో సమానంగా పారితోషకం తీసుకోవచ్చని ప్రియాంక తెలిపింది. సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నహీరోయిన్స్ కూడా హీరోలకంటే ఏమీ తక్కువ కాదంటూ బాలీవుడ్ లో గొప్ప చర్చనే లేవదీసింది. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. మహిళా బాక్సర్ మేరీకామ్ వాస్తవిక జీవితం ఆధారంగా నిర్మితమవుతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో చేస్తోంది. ఈ చిత్రం నిర్మాణ దశల్లో ఉండగానే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విజయం సాధించి ఆమె కోరుకున్న పారితోషకం రావాలని ఆశిద్దాం.