‘ఈజ్ ఇట్ నాట్ రొమాంటిక్’.. ప్రియాంకా చోప్రా చేస్తున్న హాలీవుడ్ సినిమా టైటిల్ ఇది. అంటే.. ఇది రొమాంటిక్ కాదా? అని అర్థం వస్తుంది. ప్రస్తుతం ప్రియాంకా వ్యక్తిగత జీవితం గురించి చాలామంది ఇలానే అనుకుంటున్నారు. అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌లో ప్రియాంక లవ్‌లో ఉన్నారనడానికి ఈ ఇద్దరూ కలిసి తిరుగుతున్న ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. ‘ఈజ్ ఇట్ నాట్ రొమాంటిక్’ అని ఈ జంటను చూసినవాళ్లు అంటున్నారు. ఇవాళ ప్రియాంక బర్త్‌డే. ఈ ఒక్క రోజు మాత్రమే సెలబ్రేట్ చేస్తే ఏం కిక్ ఉంటుందనుకున్నారేమో.. సినిమాలకు ప్రీ–రిలీజ్ ఈవెంట్ జరుపుతున్నట్లు.. ప్రీ–బర్త్‌డే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు నిక్ జోనస్. ఇక్కడ కాదు.. లండన్‌లో.
మంగళవారం ఈ ఇద్దరూ అక్కడి ఫేమస్ రెస్టారెంట్‌లో కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేయడం చాలామంది కళ్లల్లో పడింది. వీళ్లతో పాటు నిక్ సోదరులు కూడా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ప్రియాంకను తమ కుటుంబంలోకి ఆహ్వానించడానికి నిక్ కుటుంబం సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అలాగే, ఇటీవల నిక్ ముంబై వచ్చిన విషయం తెలిసిందే. ప్రియాంక తల్లి మధు చోప్రా కూడా నిక్‌ని అల్లుడిగా స్వీకరించడానికి సుముఖంగా ఉన్నారట. మరి.. ఈరోజు బర్త్‌డే సందర్భంగా పెళ్లి కబురు ఏమైనా ఈ జంట బయటపెడుతుందా? చూద్దాం.
ఒక రోజు ముందే వేడుక
Published Wed, Jul 18 2018 12:38 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment