prizes given
-
సీఎం కప్పు..చేయించింది అప్పు..!
సాక్షి, రాయవరం (మండపేట): స్కూల్ గేమ్స్‌ను సీఎం కప్‌గా నామకరణం చేసి క్రీడా పోటీలు నిర్వహించారు. పేరు మారినా..తీరు మారలేదు. నిధులు మంజూరు చేస్తాం..క్రీడలు ఆడించండంటూ అధికారులు చెప్పడంతో పాఠశాలల్లో పనిచేసే పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ) జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టారు. స్కూల్ గేమ్స్‌ను పూర్తి చేసి నెలలు గడుస్తున్నా..నేటికీ పైసా విడుదల కాకపోవడంతో అప్పులు చేసి తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని తలలు పట్టుకుంటున్నారు. డిసెంబరుతో ముగిసిన పోటీలు... విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం సీఎం కప్ పేరుతో క్రీడా పోటీలను నిర్వహించింది. సెప్టెంబరు 24వ తేదీ నుంచి జిల్లాలో ఎస్జీఎఫ్ పోటీలు ప్రారంభించారు. తొలుత మండల స్థాయి, అనంతరం నియోజకవర్గ స్థాయి, తదనంతరం జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయి పోటీలు నవంబరులో జరిగాయి. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయిలో ఆడించారు. జాతీయ స్థాయి పోటీలు డిసెంబర్లో ముగిశాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా సీఎం కప్ క్రీడా పోటీలు అండర్–14, అండర్–17 విభాగాల్లో మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలను నిర్వహించారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి అండర్–14, అండర్–17 పోటీలు నిర్వహించారు. ఇంటర్ విద్యార్థులకు అండర్–19 పోటీలు నిర్వహించారు. ఆడించే ఆటలివే మండల స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్‌బాల్, త్రోబాల్, బాల్‌బాడ్మింటన్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్, యోగా పోటీలను నిర్వహించగా, జిల్లా స్థాయిలో ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్, బాస్కెట్‌బాల్, నెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్, కత్తి సాము, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్ తదితర 41 క్రీడలను ఆడించారు. తలకు మించిన భారంగా మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలు పూర్తయి ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. క్రీడల్లో పాల్గొనే ప్రతి విద్యార్థికీ టీఏ రూ.30, డీఏ రూ.30ల వంతున మంజూరు చేయాల్సి ఉంది. దీని ప్రకారం మండలానికి రూ.50 వేలు, నియోజకవర్గ స్థాయి పోటీలకు రూ.50 వేలు విడుదల చేయాల్సి ఉంది. జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలకు ఒక్కో విద్యార్థికి టీఏ రూ.50, డీఏ రూ.50ల వంతున మంజూరు చేయాల్సి ఉంది. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి పోటీల నిమిత్తం జిల్లాకు రూ.40.5 లక్షలు, జిల్లా స్థాయి పోటీలకు రూ.2 లక్షలు విడుదల కావాల్సి ఉంది. జిల్లాలోని జి.మామిడాడలో వెయిట్‌లిఫ్టింగ్, కాకినాడలో జిమ్నాస్టిక్స్, అనపర్తిలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల నిర్వహణ, జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయడం, వారిని జాతీయ స్థాయి పోటీలకు గౌహతి, అగర్తల, జామ్‌నగర్‌కు పంపించారు. కోసం దాదాపు రూ.15 లక్షలు మంజూరు కావాల్సి ఉంది. ఈ విధంగా జిల్లాకు రూ.60 లక్షలు విడుదల కావాల్సి ఉండగా, నేటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఇచ్చేదే అరకొర... క్రీడా పోటీల నిర్వహణకు ప్రభుత్వం కంటితుడుపు చర్యగా, అరకొరగా నిధులు కేటాయిస్తోంది. ఆ అరకొర నిధులు కూడా క్రీడాపోటీలు ముగిసి మూడు నెలలవుతున్నా నేటికీ ఒక్క రూ పాయి విడుదల కాలేదు. చాలా మంది పీఈటీలు, పీడీలు వడ్డీ కి అప్పులు తీసుకుని వచ్చి, పెట్టుబడి పెట్టారు. ఓ వైపు తెచ్చి న డబ్బులకు రోజు రోజుకూ వడ్డీలు పెరుగుతుంటే, వీరికి తలకు మించిన భారంగా మారుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్జీఎఫ్ నిధులు విడుదల చేయాలని పీఈటీలు, పీడీలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా అయితే మెరుగైన క్రీడాకారులను ఎలా తయారు చేయగలమని పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదల కాకపోవడం వాస్తవమే... సీఎం కప్ క్రీడా పోటీలకు ఇప్పటి వరకు నిధులు విడుదల కాని విషయం వాస్తవమే. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పోటీలు పూర్తి చేసినా డబ్బులు విడుదల కాలేదు. పెట్టుబడి పెట్టిన డబ్బులకు వడ్డీలు పెరగడంతో పీఈటీలు, పీడీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – రాజశేఖర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు, పీఈటీ, పీడీ అసోసియేషన్, కాకినాడ -
వారి జాడ చెబితే.. ఐదులక్షలు బహుమతి
సాక్షి, ఇల్లెందు: ‘‘మావోయిస్టు యాక్షన్ టీం తిరుగుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండండి’’ అని, ఇల్లెందు డీఎస్పీ జి.ప్రకాశరావు హెచ్చరించారు. ఆయన బుధవారం ఇల్లెందు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ‘‘ఆరుగురు సభ్యులున్న మావోయిస్టు యాక్షన్ టీం తిరుగుతోంది. వారు బైక్‌ల మీద వస్తున్నారు. వారిని గుర్తించేందుకు ఫోటోలు విడుదల చేస్తున్నాం. ఆ ఆరుగురిలో.. కుర్సం మంగూ అలియాస్ పాపన్న (భద్రు): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా చరమాంగి గ్రామస్తుడు. లింగయ్య (లింగు) అలియాస్ రాకేష్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కుంట తాలూకా, మడకంగూడ గ్రామస్తుడు. మడివి కాయ అలియాస్ రమేష్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం మండలంలోని పిట్టతోగు గ్రామస్తుడు. కొవ్వాసి గంగ అలియాస్ మహేష్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా నెమలిగూడ గ్రామస్తుడు. మంగతు: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవాడు. పండు అలియాస్ మంగులు: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కోట్రం బైరంగఢ్ గ్రామస్తుడు. జాడ చెబితే.. లక్షల రూపాయలు..! ఈ పోస్టర్‌లోని వీరిని గుర్తుపట్టి సమాచారమిస్తే ఐదులక్షల రూపాయల బహుమతి ఇస్తాం. సమచారం ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతాం. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వచ్చినా, ఎవరి మీదనైనా అనుమానం ఉన్నా వెంటనే సమీపం పోలీస్ స్టేషన్‌కు సమాచాం ఇవండి’’. సమావేశంలో ఇల్లెందు సీఐ డి.వేణుచందర్ పాల్గొన్నారు. -
ముగిసిన నాటక పోటీలు
పాలకొల్లు టౌ న్ : సమాజంలోని రుగ్మతలను పోగొట్టి ప్రజలను చైతన్య వంతులను చేసే శక్తి నాటక రంగానికి ఉందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం రాత్రి డాక్టర్ గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ జాతీయ స్థాయి నాటిక పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటక రంగం కనుమరుగవకుండా భావితరాలకు అందించడానికి కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆ నాటి కళాకారుడు, ప్రముఖ సినీ, నాటక దర్శకుడు పినిశెట్టి శ్రీరామమూర్తి దగ్గరి నుంచి నేటి తరం గజల్ శ్రీనివాస్ వరకు ఎందరో ప్రముఖ కళాకారులను అందించి కళలకు పుట్టినిల్లుగా పాలకొల్లు భాసిల్లుతోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కళాపరిషత్‌లు నిర్వహించడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, విన్నకోట వేంకటేశ్వరరావు, డాక్టర్ కేఎస్పీఎ న్ వర్మ, మేడికొండ శ్రీనివాసచౌదరి, కేవీ కృష్ణవర్మ, మానాపురం సత్యనారాయణ, రంగ స్థల వృత్తి కళాకారుల సంఘ జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి అప్పారావు, గుండా రామకృష్ణ, రాయప్రోలు భగవాన్, బుద్దాల వెంకట రామారావు, జీవీబీఎస్ మూర్తి, జి.రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనగా ‘చాలు.. ఇక చాలు’ ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా శ్రీ సాయి ఆర్ట్స్–కొలకలూరి వారి ‘చాలు..ఇక చాలు’ నాటిక మొదటి బహుమతిని గెలుచుకుంది. అభినందన ఆర్ట్స్–గుంటూరు వారి ‘కేవలం మనుషులం’, అరవింద ఆర్ట్స్–తాడేపల్లి వారి ‘స్వర్గానికి వంతెన’ నాటికలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. జ్యూరీ ప్రదర్శనగా ‘నాన్నా.. నువ్వో సున్నా’ నిలిచింది. దిష్టిబొమ్మలు నాటక రచయిత తాళాబత్తుల వేంకటేశ్వరరావు ఉత్తమ రచయితగా, నాన్నా నువ్వో సున్నా నాటిక దర్శకుడు పి.బాలాజీనాయక్ ఉత్తమ దర్శకుడిగా అవార్డులు సొంతం చేసుకున్నారు. చాలు–ఇక చాలులో నీలకంఠం పాత్రధారి కేవీ సుబ్బారాయుడు ఉత్తమ నటుడిగా, దిష్టిబొమ్మలు నాటికలో జానకమ్మ పాత్రధారిణి ఎం.లక్ష్మీ తులసి ఉత్తమ నటిగా, గోవు మాలచ్చిమిలో గోవిందయ్య పాత్రధారి జానా రామయ్య ఉత్తమ ప్రతినాయకుడిగా, సందడే..సందడి నాటికలో దొంగ పాత్రధారి కె.జోగారావు ఉత్తమ హాస్య నటుడిగా, కేవలం మనుషులం నాటికలో మీర్జా ఆలీఖా న్ పాత్రధారి వీసీహెచ్‌కే ప్రసాద్ ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంపికయ్యారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రసాదరెడ్డి (హైదరాబాద్), కేకేఎల్ స్వామి (విజయనగరం), విన్నకోట వేంకటేశ్వరరావు (పాలకొల్లు) వ్యవహరించారు. -
ఉత్కంఠభరితంగా బాస్కెట్‌బాల్ పోటీలు
మార్టేరు (ఆచంట) : స్థానిక వేణుగోపాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న అంతర జిల్లాల స్త్రీ, పురుషుల బాస్కెట్ బాల్ పోటీలు ఆద్యంతం నువ్వానేనా అన్నట్టు సాగుతున్నాయి. స్త్రీల విభాగంలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, అనంతపురం, జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. పురుషుల విభాగంలో కృష్ణా, గుంటూరు, అనంతపురం జట్లు సెమీస్‌కు చేరాయి. శనివారం రాత్రికి మొత్తం పోటీలు ముగియ వలసి ఉంది, అయితే సెమీఫైనల్స్ పూర్తికాకపోవడంతో ఆదివారం కూడా పోటీలు నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం జరగనున్నది. మహిళల విభాగంలో శనివారం నిర్వహించిన క్వార్టర్ ఫైనల్స్‌లో కృష్ణా గుంటూరుపై 52–42 తేడాతో, తూర్పుగోదావరి, విశాఖపై 36–35, నెల్లూరుపై అనంతపురం 28–10, చిత్తూరుపై పశ్చిమగోదావరి 37–19 పాయింట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాయి. పురుషుల క్వార్టర్స్‌లో విశాఖపై కృష్ణా 61–42, కర్నూలుపై గుంటూరు 75–57, పశ్చిమ గోదావరిపై అనంతపురం 60–35 తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించాయి.