వాల్ పోస్టర్ విడుదల చేస్తున్న డీఎస్పీ ప్రకాశరావు
సాక్షి, ఇల్లెందు: ‘‘మావోయిస్టు యాక్షన్ టీం తిరుగుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండండి’’ అని, ఇల్లెందు డీఎస్పీ జి.ప్రకాశరావు హెచ్చరించారు. ఆయన బుధవారం ఇల్లెందు పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ‘‘ఆరుగురు సభ్యులున్న మావోయిస్టు యాక్షన్ టీం తిరుగుతోంది. వారు బైక్‌ల మీద వస్తున్నారు. వారిని గుర్తించేందుకు ఫోటోలు విడుదల చేస్తున్నాం.
ఆ ఆరుగురిలో..
- కుర్సం మంగూ అలియాస్ పాపన్న (భద్రు): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా చరమాంగి గ్రామస్తుడు.
- లింగయ్య (లింగు) అలియాస్ రాకేష్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కుంట తాలూకా, మడకంగూడ గ్రామస్తుడు.
- మడివి కాయ అలియాస్ రమేష్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం మండలంలోని పిట్టతోగు గ్రామస్తుడు.
- కొవ్వాసి గంగ అలియాస్ మహేష్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా నెమలిగూడ గ్రామస్తుడు.
- మంగతు: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవాడు.
- పండు అలియాస్ మంగులు: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కోట్రం బైరంగఢ్ గ్రామస్తుడు.
జాడ చెబితే.. లక్షల రూపాయలు..!
ఈ పోస్టర్‌లోని వీరిని గుర్తుపట్టి సమాచారమిస్తే ఐదులక్షల రూపాయల బహుమతి ఇస్తాం. సమచారం ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతాం. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వచ్చినా, ఎవరి మీదనైనా అనుమానం ఉన్నా వెంటనే సమీపం పోలీస్ స్టేషన్‌కు సమాచాం ఇవండి’’. సమావేశంలో ఇల్లెందు సీఐ డి.వేణుచందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment