pro-Pak slogans
-
పాక్ కోసం సంబరాలు: అడ్డంగా బుక్కయ్యారు!
భోపాల్: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ జట్టుపై పాకిస్థాన్ విజయం సాధించడంతో కొందరు అత్యుత్సాహంతో దాయాది పట్ల ప్రేమతో సంబరాలు జరిపి.. అడ్డంగా బుక్కయ్యారు. ఫైనల్లో పాక్ విజయంతో పటాకులు కాల్చి.. పాక్ అనుకూల నినాదాలు చేసి కలకలం రేపిన 15మందిని మధ్యప్రదేశ్లో పోలీసులు అరెస్టు చేశారు. గత ఆదివారం రాత్రి పాక్ విజయం సాధించిన వెంటనే బుర్హాన్పూర్లో పలువురు వీధుల్లోకి వచ్చి పటాకులు కాల్చారు. పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో 15మందిని అరెస్టు చేశామని, సెక్షన్ 120బీ, 124ఏ కింద వారిని అదుపులోకి తీసుకున్నామని షాపూర్ పోలీసు స్టేషన్ ఇన్చార్జి సంజయ్ పాఠక్ తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా విపరీత చర్యలకు పాల్పడే వారిని సెక్షన్ 124ఏ కింద అరెస్టు చేసే అధికారం ఉందని ఆయన తెలిపారు. -
'పాక్ అనుకూల నినాదాలు చేస్తే సహించం'
న్యూఢిల్లీ: రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి యూపీఏ ప్రభుత్వం ఏళ్లకు ఏళ్లు తాత్సారం చేసిందని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏడాదిలో 40 రక్షణ ఒప్పందాలు ఖరారు చేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా వ్యవస్థను భ్రష్టు పటిస్తే, ఎన్డీఏ సర్కారు పారదర్శకత పెంచిందని చెప్పారు. పాకిస్థాన్ తమ సొంత సంక్షేమం కాంక్షిస్తే ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని సూచించారు. కుతంత్రాలకు ముగింపు పలకాలని హితవు పలికారు. ఎవరితోనా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే భారత్ భూభాగంపై ఎవరైనా పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తే సహించబోమని రాజ్ నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు.