Probationary officer
-
అన్ని వర్గాల సంక్షేమమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం
సాక్షి,తణుకు అర్బన్: ప్రజలకు పారదర్శకంగా సంక్షేమాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థ ఏర్పరచారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో తణుకు మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరిస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. ఓకేసారి ఇంత మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత దేశచరిత్రలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు. ఏ లక్ష్యంతో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయబడిందో దానికి కట్టుబడి ఉద్యోగులంతా ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు. సీఎం జగన్కు రుణపడి ఉంటాం పీజీలు చేసి ఈ చెత్త ఉద్యోగాలే దిక్కా అని కొందరు.. మీ ఉద్యోగాలు నీటి బుడగలే అంటూ ఇంకొందరు తమను విమర్శించారని, వీటికి చెక్ చెబుతూ చెప్పాడంటే చేస్తాడంతే అనే రీతిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా అవకాశం కల్పించారని సచివాలయ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. తమ జీవితాలు మారిపోయాయంటూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, మంత్రి కారుమూరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సచివాలయ ఉద్యోగులతో కలిసి మంత్రి కారుమూరి కేక్ కట్ చేసి వారందరికీ పంచారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ దాట్ల సుందరరామరాజు, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మెహర్ అన్సారీ, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, మునిసిపాలిటీ పరిధిలోని సెక్రటరీలు పాల్గొన్నారు. -
ఎస్బీఐ ఎండీగా తెలుగు వ్యక్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త ఎండీగా చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగేలా కేంద్రం ఆయన నియామకాన్ని ఖరారు చేయటంతో... మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలియజేసింది. గతంలో ఈయన ఎస్బీఐ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. 1988లో అహ్మదాబాద్ ఎస్బీఐలో ప్రొబెషనరీ అధికారిగా ఉద్యోగంలో చేరిన శ్రీనివాసులుకు వ్యవసాయమంటే ఎంతో ఇష్టం. దానికి తగ్గట్టే ఆయన హైదరాబాద్లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (ప్రస్తుతం ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ) వ్యవసాయ విద్యను అభ్యసించారు. ఆ తరవాత అనుకోకుండా బ్యాంకింగ్ రంగంలో అడుగు పెట్టి అక్కడే స్థిరపడ్డారు. ఎస్బీఐలో వివిధ హోదాల్లో పనిచేసిన శ్రీనివాసులు... వృత్తి రీత్యా గతంలో కొన్నాళ్లపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. -
ఉద్యోగాలు
సిండికేట్ బ్యాంక్ మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్, నొయిడాలోని ఎన్ఐటీటీఈ ఎడ్యుకేషనల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంయుక్తంగా అందిస్తున్న ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు’లో ప్రవేశాలకు సిండికేట్ బ్యాంక్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులను ప్రొబేషనరీ ఆఫీసర్ (జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్) పోస్టులకు ఎంపిక చేస్తారు. ఖాళీల సంఖ్య: 400 అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష (ఆన్లైన్ టెస్టు), గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: నవంబరు 18 ఆన్లైన్ టెస్టు తేది: డిసెంబరు 27 వెబ్సైట్: www.syndicatebank.in