problem of fluoride
-
రూ.కోట్లు వెచ్చించారు.. నిర్లక్ష్యంగా వదిలేశారు
► సత్యసాయి నీటి కోసం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ట్యాంకులు నిరుపయోగం ► 18 ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఎన్పీకుంట వాసులు ఎన్పీకుంట : మండలంలో ఫ్లోరైడ్ సమస్యను అధిగమించి సత్యసాయి మంచినీటి పథకం రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్లక్ష్యంగా వదిలేశారు. దాహార్తి నివారణతో పాటు ఫ్లోరైడ్ రహిత నీటిని అందిస్తామని ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదు. రక్షిత మంచినీరు గ్రామీణులకు అందని ద్రాక్షగానే మిగిలి పోయింది. ఫ్లోరైడ్ రహిత మంచినీటిని అందించడానికి 1998లో రూ.7.33 కోట్ల వ్యయంతో ఎన్పీకుంట, గాండ్లపెంట, కదిరి రూరల్ మండలాలతో కలిపి 105 గ్రామాలకు సత్యసాయి నీటి పథకం ద్వారా నీరు అందించడానికి అప్పటి ఎమ్మెల్యే జొన్నా సూర్యనారాయణ పథకాన్ని ప్రారంభించారు. కదిరి నుంచి ఎన్పీకుంట వరకు పైప్‌లైన్ ఏర్పాటు చేసి 2 కిలోమీటర్ల పరిధిలో ఇరువైపులా ఉన్న గ్రామాల్లో ఫ్లోరైడ్ రహిత నీటిని అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అయితే పథకం ప్రారంభించి 18 ఏళ్లు గడుస్తున్నా నేటికీ మండల ప్రజలకు సత్యసాయి నీరు అందడంలేదు. ప్రతి ఏటా వేసవిలో గ్రామాల్లో మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశాలల్లో మాత్రం త్వరలోనే సత్యసాయి నీటి సరఫరా కోసం సర్వే చేస్తున్నామని ప్రజా ప్రతినిధులకు అధికారులు భరోసా ఇచ్చారే కానీ ఇంతవరకు పనులు జరగలేదు. ఏర్పాటు చేసిన పైపులూ చోరీకి గురి.. నీటి సరఫరా సంగతి పక్కన బెడితే, పలుచోట్ల పైప్‌లైన్ ఏర్పాటు చేయగా, వాటిలో కొన్నిచోట్ల పైపులు చోరీకి గురయ్యాయి. వాటి స్థానంలో కొత్త పైపులు అమర్చలేదు. సత్యసాయి నీటి కోసం గ్రామాల్లో నిర్మించిన మంచినీటి ట్యాంకులు సైతం దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. మండలంలోని వెలిచెలమల, వడ్డిపల్లి, పడమర నడిమిపల్లి, గౌకనపేట, తాటిమానుగుంత, బందారుచెట్లపల్లి, దిగువపల్లి, ఎన్.పీకుంట, టీఎన్పల్లి, జౌకల, మండెంవారిపల్లి, మర్రికొమ్మదిన్నె తదితర గ్రామాల్లో ఫ్లోరైడ్ అధికంగా ఉందని గుర్తించిన అధికారులు ఫిల్టర్ నీటిని అందించడానికి ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఇవి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. అన్ని గ్రామాలకు నీటిని అందించే ఏర్పాట్లు చేస్తాం అన్ని గ్రామాలకు నీటిని అందించాలంటే సంపు సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంది. అంతేకాకుండా పైప్‌లైన్‌లో సైతం సక్రమంగా నీటిని పంపు చేయడానికి తగిన ఏర్పాట్లు ఉండాలనే ఉద్దేశ్యంతో సర్వే చేస్తున్నాం. అందుకు ఈ ఎడాది రూ,1.7 కోట్లు నిధులు మంజూరయ్యాయి. - ఉమామహేశ్వరి. (ఆర్డబ్యుఎస్జెఈ) -
చలించి..స్పందించి
కవిత: నమస్తే అమ్మా. నాపేరు గడిపల్లి కవిత.. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ను. మీ ఊళ్లో సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. ఏ సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారు..? శౌరి: వర్షం వస్తే.. గ్రామంలో రోడ్లు అన్నీ బురదగా మారుతున్నాయి. మురుగు కాల్వలు పొంగి ఇళ్లలోకి నీరొస్తోంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ? ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. కవిత: ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు ఈ సమస్య చెప్పారా..? శౌరి: ఎన్నో సార్లు అధికారులకు చెప్పాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము కూలీ పనులకు వెళ్లే వాళ్లం. ఎవరి వద్దకూ వెళ్లలేం. ఈ పనులన్నీ అధికారులే చేయించాలి. కవిత: ఎందుకు ఏడుస్తున్నావమ్మా..? నీ సమస్య ఏంటీ..? మంగతాయారు: మాది పేద కుటుంబం. నాకు జబ్బు చేసి పశ్చవాతం వచ్చింది. మందుల్లేవు, పట్టించుకునే వారు లేరు. నేను ఎట్లా బతకాలి. కవిత: నేను లెటర్ రాసి ఇస్తా, గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్తావా? మంగతాయారు: మందుల కోసం వెళ్తా. కవిత: మీరేం చేస్తున్నారు..? నంద: అమ్మా.. నేను రోజూ కూలీకి వెళ్లేదాన్ని. పంటలు ఎండిపోవడంతో కూలీ పని దొరకడం లేదు. కవిత: నీకు ఎంతమంది పిల్లలు. ఆడపిల్లను చదివించాలి. డ్వాక్రాలో డబ్బులు పొదుపు చేయండి. దుర్గ: నేను కూలీకి వెళ్తా. ఒక్కతే ఆడపిల్ల. 6వ తరగతి వరకు చదివించాను. ఇంకా చదవమంటే చదవనంటోంది. మీరు చెప్పినట్లు కష్టం చేసైనా చదివిస్తా. కవిత: రాంబాయీ.. నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు. వార్డు సభ్యురాలివి. వారి సమస్యలపై అవగాహన ఉండాలి. పంచాయతీ సమావేశాల్లో సమస్యలు చర్చిస్తారా? రాంబాయి: నేను చదువుకోలేదమ్మ. మీరు చెప్పినట్లు చదువు నేర్చుకుంటా. గ్రామంలో రోడ్లు, మురుగు కాలువలు సరిగా లేవు. కవిత: ఏం తాత.. ఏ పంట వేశావు. ఎలా ఉంది? వీరు: రెండు ఎకరాల్లో పత్తి వేశానమ్మా. వర్షాలు లేక పంట ఎండి పోయింది. పండిన పంటకు రేటు కూడా రానట్లుంది. ఈసారి కాలంతో నష్టమే వచ్చింది. కవిత: అవ్వా నీకు పింఛన్ వస్తుందా..? పుల్లమ్మ: నా భర్త చనిపోయి 25 ఏళ్లు అయింది. నేను ఒక్కదాన్నే ఉంటున్నా. కూలీకి పోవడానికి కూడా చేత కావడం లేదు. పింఛన్ రావట్లే.. వస్తే ఆ డబ్బుతోనే బతుకుతా. కవిత: మీరు వ్యవసాయం చేస్తున్నారా..? వీరయ్య: చేస్తున్నానమ్మా. కరెంట్ ఉండడం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. వ్యవసాయానికి కరెంట్ ఇస్తే పంటలు చేతికి అందేవి. కాలంకాక ఏంచేయాలో అర్థం కావడం లేదు. కవిత: చిన్నా చదువుకుంటున్నావా. అంగన్వాడీ కేంద్రంలో ఏం పెడతారు? లక్ష్మీప్రసన్న: అ..ఆలు చదువుకుంటున్నా. అంగన్వాడీ స్కూల్‌కు వెళ్తున్నా. గుడ్డు పెడుతున్నారు. మురుకులు ఇస్తున్నారు. కవిత: అంగన్వాడీ కేంద్రంలో అన్నీ ఇస్తున్నారా.. పిల్లలు ఎంతమంది వస్తున్నారు? కవిత(అంగన్వాడీ టీచర్): మేడమ్. మా కేంద్రంలో 25 మంది పిల్లలు ఉన్నారు. గర్భిణులకు మెనూ ప్రకారం పోషక పదార్థాలు అందిస్తున్నాం. కవిత: తాత మీ ఊళ్లో ఏ సమస్యలు ఉన్నాయి? గోపాల్: ఫ్లోరైడ్ నీళ్లతో ఊళ్లో అందరికి కాళ్ల నొప్పులు, నడుంనొప్పులు వస్తున్నాయి. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. కవిత: సర్పంచ్‌గారు.. మీ ఊరి గురించి చెప్పండి? నాగేశ్వరరావు: మేడమ్. ఊళ్లో ప్లోరైడ్ సమస్య తో ఇబ్బంది పడుతున్నాం. 50ఏళ్ల వయసున్న వారు 70ఏళ్ల మనుషుల్లా ఉంటున్నారు. గ్రామం లో ఉన్న మంచినీటి పైపులైన్లలో ఫ్లోరైడ్ పేరుకపోయింది. ఎక్కడ బోరు వేసినా ఫ్లోరైడే వస్తుం ది. ఈ నీటిని గ్రామస్తులు తాగలేకపోతున్నారు. కవిత: ఈ విషయం అధికారులకు చెప్పారా..? ఏం చర్యలు తీసుకున్నారు? నాగేశ్వరరావు: ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చెప్పాం. చాలా చోట్ల బోరు వేయడానికి పరిశీలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. పాలేరు ద్వారా సాగర్ కాలువతో లకారం చెరువు నీటిని నింపి అక్కడి నుంచి పైపులైను ద్వారా గ్రామానికి మంచినీటిని అందించడానికి ప్రతిపాదన చేశారు. ఈ పనులు ముందుకు సాగడం లేదు. కవిత: ఈఓపీఆర్డీగారు.. ఈ పనులు ఎంతవరకు వచ్చాయి? ఈఓపీఆర్డీ: మేడమ్. లకారం చెరువు నుంచి మండలంలోని 15 గ్రామాలకు మంచినీటి అందించేందుకు పైపులైన్లు వేస్తున్నారు. త్వర లో ఈ గ్రామానికి కూడా మంచినీళ్లు వస్తాయి. కవిత: మీ సమస్య ఏంటీ? షేక్ జానీ: అధికారులు పాత పైపులైన్ల ద్వారానే లకారం చెరువు మంచినీటి అందించాలని చూస్తున్నారు. ఈ పైపులతో గ్రామంలోకి నీరు, మంచినీరు వస్తే మళ్లీ ఫ్లోరైడ్ వస్తుంది. జెడ్పీ చైర్పర్సన్ హామీలు.. నేను మీ గ్రామానికి విలేకరిగా వచ్చాను. ఇక్కడ అన్ని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి పాలేరు నుంచి లకారం చెరువుకు నీటిని మళ్లించి అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా అందించే పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటా. గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీలను నిర్మించేందుకు అంచనాలు రూపొందించడంతో పాటు, జెడ్పీ నిధుల నుంచి ఈ పనులు పూర్తి చేసేలా కృషి చేస్తా. గ్రామంలో ఉన్న అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెపుతా. గ్రామంలో సాక్షర భారత్ కేంద్రాలను నిరంతరాయంగా కొనసాగించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తా.