‘అమృతహస్తం’ భేష్
తాండూరు రూరల్, న్యూస్‌లైన్: ‘ఇందిరమ్మ అమృతహస్తం’ పథకం పనితీరును బుధవారం విదేశీ బృందం సభ్యులు పరిశీలించారు. రాష్ర్టంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం వారు తాండూరు మండలం ఖాంజపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. వారిలో చైనాలోని లావోస్ నగరం నుంచి ఆరుగురు సభ్యులు, ప్రపంచ బ్యాంక్ నుంచి ఇద్దరు ప్రతినిధులు ఉన్నారు. వారికి స్థానిక ఐసీడీఎస్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ శిశుసంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ సరళ రాజ్యలక్ష్మి విదేశీ బృందానికి అమృతహస్తం పథకం పనితీరును వివరించారు. పథకం ద్వారా లబ్ధిపొందుతున్న గ ర్భిణులు, బాలింతలతో మాట్లాడించారు. పథకం తీరుపై విదేశీబృందం సభ్యులు కితాబిచ్చారు. కార్యక్రమంలో ప్రాజెక్టు రీజినల్ మేనేజర్ నర్సింహమూర్తి, జిల్లా, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
మంబాపూర్లో పర్యటన..
పెద్దేముల్: మండల పరిధిలోని మంబాపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని విదేశీబృందం సభ్యులు సందర్శించారు. అమృతహస్తం పనితీరుపై స్థానిక ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో తాండూరు సీడీపీఓ వెంకట్‌లక్ష్మి, అంగన్వాడీ సూపర్వైజర్లు దశమ్మ, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.