5న ప్రొద్దుటూరులో పొలికేక
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఈనెల 5వ తేదీన ప్రొద్దుటూరులోని అనీబీసెంట్ మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ‘ప్రొద్దుటూరు పొలికేక’ నిర్వహించాలని జేఏసీ తీర్మానించింది. ఇందులో భాగంగా లక్షమందితో ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, అర్బన్ సీఐ బాలిరెడ్డి నిర్వాహకులతో చర్చించారు. ఏర్పాట్ల గురించి తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ రాజగోపాల్‌రెడ్డి, ఎన్జీఓ అసోషియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు డాక్టర్ లక్ష్మిప్రసన్న, ప్రైవేటు విద్యా సంస్థల జిల్లా గౌరవాధ్యక్షుడు కేవీ రమణారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మాజీ కౌన్సిలర్ పోరెడ్డి నరసింహారెడ్డి, నాగేంద్రారెడ్డి, జేఏసీ నాయకులు రషీద్‌ఖాన్, రావుల సుధాకర్‌రెడ్డి, ఎన్జీఓ అసోషియేషన్ కోశాధికారి రఘురామిరెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఏర్పాట్లపై చర్చించారు.
తహశీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ పొలికేకకు సాంస్కృతిక కార్యక్రమాలు, నీటి సరఫరా, ఆరోగ్యం, ప్రచార కార్యక్రమాలు, ఫ్లెక్సీలు, స్టేజీ ఏర్పాట్లకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 15 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అడ్వైజరీ కమిటీలో తనతోపాటు మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ, ఎంఈఓ ఉన్నారన్నారు.