productivity minus
-
‘మెదడు మొద్దుబారిపోతోంది.. ఆఫీసులకే వస్తం’
థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆఫీసులను తెరిచే ఉద్దేశాన్ని చాలా కంపెనీలు వాయిదా వేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఏడాదిన్నరగా కొనసాగుతున్న ‘వర్క్ ఫ్రమ్ హోం’.. జనవరి దాకా కంటిన్యూ కానుంది. అయితే ఇక తమ వల్ల కాదని, ఆఫీసులకు వచ్చేస్తామని కరాకండిగా చెప్పేస్తున్నారు కొందరు ఉద్యోగులు. అందుకు తమ దగ్గర సరైన కారణాలు ఉన్నాయంటున్నారు మరి! ►రియల్ టైం కమ్యూనికేషన్ లోపం.. ఏడాదిన్నరగా ఉద్యోగుల మధ్య ఈ-మెయిల్స్, ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్‌లతో కంపెనీ పనులు జరుగుతున్నాయి. ఫోన్, వీడియో కాల్స్ ఆధారంగా మీటింగ్‌లను, సమీక్షలను నిర్వహించుకుంటున్నారు. తద్వారా ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్స్ అనేది గణనీయంగా తగ్గిపోయింది. ► కంపెనీ సక్సెస్‌లో టీం వర్క్ ఎంత శక్తివంతమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందుకోసమే టీంల మధ్య ఇంటెరాక్షన్ ఎక్కువ ఉండాలని చెప్తుంటారు. అయితే కరోనాకు ముందున్న పరిస్థితులతో పోలిస్తే.. సగటున వర్క్ ఫ్రమ్ హోం వల్ల కొలీగ్స్ మధ్య గడిపే టైం 25 శాతం తగ్గిపోయింది. సోషల్ గ్యాదరింగ్‌లు లేకపోవడం, ఒకవేళ కలిసినా ఎక్కువసేపు గడపలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ఇన్నోవేషన్‌తో పాటు కంపెనీ ప్రొడక్టివిటీపైనా నెగెటివ్ ప్రభావం చూపెడుతోంది. ► ఎంప్లాయిస్ వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపెడుతోంది వర్క్ ఫ్రమ్ హోం సిస్టమ్. ఏడాదిన్నరగా ఇంటికే పరిమితం కావడంతో కుటుంబ సభ్యుల మధ్య తగదాలు నెలకొంటున్నాయి. పిల్లల వల్ల పనులు ఆగిపోతున్నాయనే ఫిర్యాదులు చేస్తున్నారు. ఇది పరోక్షంగా వర్క్ మీద చూపెడుతోంది. ఉద్యోగులను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. క్లిక్: నా భర్తను ఆఫీస్‌కు పిలవండి.. ప్లీజ్ ► టార్గెట్లు.. ఉద్యోగుల్ని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఆఫీస్ స్పేస్‌లో లేకపోవడంతో మానిటరింగ్ పేరుతో ఉద్యోగుల్ని క్షణం తీరిక లేకుండా చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనై శారీరక, మానసిక అనారోగ్యం బారినపడుతున్నారు. ► మానసిక స్థితిపై ప్రభావం.. దీని ప్రభావంతో ఉద్యోగుల మెదడు మొద్దుబారిపోతోంది. స్కిల్స్‌ను పెంచుకునే వాళ్లకు తీరిక లేకుండా చేస్తోంది. చివరికి.. జాబ్ మారాలనే ఆలోచనల్ని సైతం దూరం చేస్తున్నాయి వర్క్‌ఫ్రమ్ హోమ్ పరిస్థితులు. ► ఇంటర్నెట్ ఇష్యూస్. ఒక్కోసారి సిగ్నల్స్ లేక వర్క్ ఆగిపోవడం, ఆలస్యం కావడం. చిరాకు తెప్పిస్తున్న అంశాలు. ► అన్నింటి కంటే ముఖ్యమైన విషయం.. ఆఫీస్ అట్మాస్పియర్‌ను మిస్ కావడం. కెరీర్ ఎదుగుదలకు వర్క్ ఫ్రమ్ హోం అడ్డుపడుతుందనే భావనలోకి కూరుకుపోతున్నారు ఉద్యోగులు . వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల జాబ్ సెక్యూరిటీ చూసుకుంటున్న ఉద్యోగులు చాలామట్టుకు.. హైక్‌లు, బోనస్‌లకు దూరంగా పని చేస్తున్నారు. ఇది కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందనే ఆందోళన ఉద్యోగుల తరపు నుంచి వ్యక్తం అవుతోంది. టెక్ కంపెనీలు భారీ ఎత్తున్న నిర్వహించిన సర్వేలో ఎంప్లాయిస్ వెల్లడించిన అభిప్రాయాలివి. చదవండి: వర్క్ ఫ్రమ్లోనూ లైంగిక వేధింపులు.. ఇలా! -
వర్క్ ఫ్రం హోం.. ‘బాబోయ్ మాకొద్దు’
సాక్షి, వెబ్‌డెస్క్: కోల్‌కతా బేస్డ్ ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. వర్క్‌ఫ్రం బెటరా ? లేక ఆఫీస్ నుంచి పని బెటరా అని అర్థం వచ్చేలా గ్రాఫ్లతో కూడిన ఫోటోలను షేర్ చేశారు. బిజినెస్ టైకూన్ సంధించిన ఈ ప్రశ్నకు ఉద్యోగులు వేల సంఖ్యలో స్పందిస్తున్నారు. ఏది బెటర్ కోవిడ్ తీవ్రత తగ్గిపోవడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ క్రమంగా ఊపందుకోవడంతో అనేక కంపెనీలు తిరిగి ఆఫీసులు తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్‌కు రావాలంటూ ఉద్యోగులకు సూచించగా మరికొన్ని కంపెనీలు వర్క్‌ఫ్రం హోం గడువు పెంచాయి. ఎక్కువ శాతం కంపెనీలు ఇళ్లు, ఆఫీసుల నుంచి పని చేసుకునేలా హైబ్రిడ్ విధానానికి మొగ్గు చూపుతున్నాయి. మొత్తంగా ఐటీ, మీడియా, బిజినెస్ సెక్టార్లో వర్క్‌ఫ్రం హోం అనే అంశంపై చర్చ బాగా జరుగుతోంది. అమ్మో ! వర్క్‌ఫ్రం హోం ఆనంద్ మహీంద్రా తరహాలోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హర్ష్ గోయెంకా వర్క్‌ఫ్రం హోం, ఆఫీస్ వర్క్‌పై ట్వీట్ వదిలారు. ఇందులో ఆఫీస్ వర్క్ అయితే ట్రాఫిక్‌లో ఎంత సేపు ఉంటాం, కో వర్కర్లతో ముచ్చట్లు, లంచ్‌టైం, టీ టైంలో ఎంత సేపు ఉంటమనే విషయాలు గ్రాఫ్‌లో చెప్పారు. ఈ పనులన్నీ పోను ఆఫీసులో పని చేసేది చాలా తక్కువ సమయం అన్నట్టుగా ఫోటో పెట్టారు. అదే వర్క్‌ఫ్రం హోం అయితే వర్క్ తప్ప మరేం ఉండదంటూ చమత్కరించారు. మరికొందరు వర్క్‌ఫ్రం హోంలో వర్క్ మాత్రమే ఉంటున్నా అది కేవలం ఆఫీస్ పని ఒక్కటే కాదని, ఇంటి పనులు, సినిమాలు చూడటం వంటి పనులు కూడా ఉంటున్నాయన్నారు. వర్క్‌ఫ్రం హోంతో ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు. It has become reality now. Employees requesting to HR for office opening so that they can work for 8 hours instead of 24 hours. pic.twitter.com/Dm8pYXywie — Talkative $ (@Talkativedollar) August 16, 2021 ఆఫీసే బెటర్ హార్స్ గోయెంకా ఈ ట్వీట్ చేయడం ఆలస్యం నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఇప్పటికే ఆఫీసులు ఓపెన్ చేయాలంటూ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ను కోరుతున్నా మా విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. వర్క్‌ఫ్రం హోంలో వర్క్‌లోడ్ ఎక్కువైపోయిందనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అయ్యాయి. మరికొందరు ఆఫీస్‌లో పని ముగిస్తే పర్సనల్ లైఫ్ ఉంటుందని, కానీ వర్క్‌ఫ్రం హోంలో 24 గంటలు ఆఫీస్ పనే అవుతోందంటూ ట్వీట్ చేశారు. మొత్తం మీద వర్క్‌ఫ్రం హోం కంటే ఆఫీస్ పనే బాగుందంటూ దానికి తగ్గట్టుగా ఫన్నీ మీమ్స్ షేర్ చేశారు. pic.twitter.com/TcUG3LT9I2 — prashant (@chanchvayu) August 16, 2021 -
పరిశ్రమలు.. మైనస్‌లోనే!
• ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి 0.7 శాతం క్షీణత • జూలైలో ఉత్పాదకత మైనస్ 2.49 శాతం • తయారీ, మైనింగ్, యంత్రపరికరాల • రంగాల పేలవ పనితీరు ప్రభావం... న్యూఢిల్లీ: పరిశ్రమల తిరోగమనం కొనసాగుతోంది. వరుసగా రెండో నెలలోనూ మైనస్‌లోనే నిలిచాయి. ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 0.7% క్షీణించింది. ప్రధానంగా తయారీ, మైనింగ్, యంత్రపరికరాల రంగాల ఉత్పాదక పేలవంగా ఉండటమే దీనికి కారణం. జూలైలో ఐఐపీ మైనస్ 2.49%గా(సవరించిన గణాంకాలు) నమోదైంది. ఇది 8 నెలల కనిష్టస్థాయి. రంగాలవారీగా చూస్తే... తయారీ: ఆగస్టులో ఈ రంగం ఉత్పాదకత 0.3 శాతం క్షీణించింది. క్రితం ఏడాది ఇదే నెలలో 6.6 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఐఐపీలో తయారీ రంగం వాటా 75 శాతం కావడం గమనార్హం. యంత్రపరికరాలు: ఉత్పాదకత ఆగస్టులో అత్యంత ఘోరంగా 22.9% క్షీణించింది. క్రితం ఏడాది ఇదే నెలలో 21.3 శాతంగా నమోదైంది. మైనింగ్: 4.5% వృద్ధి నుంచి 5.6 శాతం క్షీణతలోకి జారిపోయింది. విద్యుత్: ఉత్పాదకత వృద్ధి 5.6 శాతం నుంచి 0.1 శాతానికి తగ్గింది. కన్జూమర్ గూడ్స్: ఈ రంగంలో ఉత్పాదకత వృద్ధి 6 శాతం నుంచి 1.1 శాతానికి పడిపోయింది. ఇందులో విభాగాలైన కన్జూమర్ డ్యూరబుల్స్ 2.3 శాతం వృద్ధి చెందగా.. మొత్తం తయారీ రంగంలోని 22 పరిశ్రమ గ్రూపులలో 7 గ్రూప్‌ల ఉత్పాదకత ఆగస్టులో మైనస్‌లోనే ఉండటం గమనార్హం. ఏప్రిల్-ఆగస్టులో ఇలా...: ఈ ఆర్థిక సంవత్సరం(2016-17) తొలి 5 నెలలకు(ఏప్రిల్-ఆగస్ట్) చూస్తే... పారిశ్రామికోత్పత్తి ఉత్పాదకత మైనస్‌లోనే ఉంది. 0.3% క్షీణించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఐఐపీ 4.1% వృద్ధి చెందింది. ప్రోత్సాహకాలు కావాలి...: కార్పొరేట్లు వినిమయ ఆధారిత డిమాండ్‌ను పెంచడంద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలంటే ప్రభుత్వం పరిశ్రమలకు పోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కార్పొరేట్ ఇండియా కోరింది. ఐఐపీ వరుసగా రెండో నెలలోనూ క్షీణించిన నేపథ్యంలో పారిశ్రామిక వర్గాలు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేశాయి. యంత్రపరికరాల రంగం ఉత్పాదకత ఘోరంగా క్షీణించడాన్ని చూస్తే.. పెట్టుబడులు నిలిచిపోయిన బలమైన సంకేతాలకు నిదర్శనమని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. తయారీ రంగం తిరోగమనం, విద్యుదుత్పత్తి వృద్ధి తగ్గడం కూడా ఆందోళనకలిగించే అంశమేనని.. 7.6 శాతం జీడీపీ వృద్ధి లక్ష్యానికి ఇది పెనుసవాలుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. వినిమమ డిమాండ్‌ను పెంచడానికి కొన్ని కీలక చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. దీనివల్ల కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంటుందన్నారు. కాగా, ఖరీఫ్ పంట దిగుబడులు రికార్డు స్థాయిల్లో నమోదవుతాయన్న అంచనాల నేపథ్యంలో రానున్న నెలల్లో డిమాండ్ భారీగా పుంజుకోవచ్చని భావిస్తున్నట్లు ఇక్రా వైస్ ప్రెసిడెంట్, సీనియర్ ఎకనమిస్ట్ అదితి నాయర్ పేర్కొన్నారు.