Prof. Kabaddi League 2
-
ఎదురులేని యు ముంబా
పుణే : ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగినప్పటికీ.. ఆద్యంతం దూకుడుగా ఆడిన యు ముంబా జట్టు ప్రొ కబడ్డీ లీగ్-2లో 12వ విజయాన్ని సాధించింది. పుణేరి పల్టన్‌తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో యు ముంబా 39-34 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్లో కేవలం ఒక మ్యాచ్‌లోనే ఓడిన యు ముంబా ఈ మ్యాచ్‌లో అనూప్ కుమార్, షబీర్ బాపు, రిశాంక్, మోహిత్ చిల్లార్లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది. రిజర్వ్‌లో ఉన్న ఆటగాళ్లను బరిలోకి దించింది. తొలి అర్ధభాగంలో ముంబాకు గట్టిపోటీనిచ్చిన పుణేరి స్కోరును 13-13తో సమం చేసింది. రెండో అర్ధభాగంలో ముంబా ఆటగాళ్లు జోరు పెంచారు. పవన్ కుమార్ రైడింగ్‌లో విజృంభించి నిలకడగా పాయింట్లు సాధించడంతో ముంబా జట్టు 36-23తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివర్లో పుణేరి తేరుకున్నా అప్పటికే ఆలస్యమైపోయింది. ప్రస్తుతం యు ముంబా 60 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... 45 పాయింట్లతో తెలుగు టైటాన్స్ రెండో స్థానంలో, 43 పాయింట్లతో బెంగళూరు బుల్స్ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ మూడు జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
చివర్లో తారుమారు
- ఢిల్లీ అద్భుత విజయం - ప్రొ కబడ్డీ లీగ్-2 కోల్‌కతా: చివరి సెకను దాకా నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ దబాంగ్ జట్టు పైచేయి సాధించింది. ఓటమి అంచుల్లో నుంచి విజయతీరాలకు చేరింది. ప్రొ కబడ్డీ లీగ్-2లో భాగంగా పుణేరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ దబాంగ్ 38-37తో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. మ్యాచ్ ముగియడానికి మరో 90 సెకన్లు ఉందనగా ఢిల్లీ 35-37తో వెనుకబడి ఉంది. ఈ దశలో రైడింగ్‌కు వచ్చిన కాశిలింగ్ అడకె ఒక పాయింట్ సాధించాడు. దాంతో తేడా ఒక పాయింట్‌కు తగ్గింది. ఆ తర్వాత పుణేరి పల్టన్ ఆటగాడు వజీర్‌సింగ్ రైడింగ్‌కు వచ్చినా ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లాడు. మరోసారి రైడింగ్‌కు వచ్చిన కాశిలింగ్ ఈసారీ ఒక పాయింట్ సంపాదించడంతో స్కోరు 37-37తో సమమైంది. ఈ దశలో చివరి సెకన్లలో రైడింగ్‌కు వచ్చిన పుణేరి పల్టన్ ఆటగాడు వజీర్ సింగ్‌ను ఢిల్లీ జట్టు ఆటగాళ్లు పట్టుకోవడంతో ఆ జట్టు పాయింట్ తేడాతో విజ యాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా ఢిల్లీ రైడర్లు కాశిలింగ్ 12 పాయింట్లు, రోహిత్ కుమార్ చౌదరీ 11 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. పుణేరి జట్టులో కెప్టెన్ వజీర్ సింగ్ 13 పాయింట్లతో రాణించినా కీలకమైన చివరి రైడింగ్‌లో ప్రత్యర్థి జట్టుకు చిక్కి మూల్యం చెల్లించుకున్నాడు. యు ముంబా జోరు: మరోవైపు గతేడాది రన్నరప్ యు ముంబా జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసి 25 పాయిం ట్లతో టాపర్‌గా ఉంది. బెంగాల్ వారియర్స్‌తో జరి గిన మ్యాచ్‌లో యు ముంబా 29-25తో గెలిచింది. విరామ సమయానికి 16-23తో వెనుకబడిన యు ముంబా రెండో అర్ధభాగంలో అద్భుతంగా పుంజుకుంది. ఏకంగా 13 పాయింట్లు నెగ్గి, ప్రత్యర్థికి కేవలం రెండు పాయింట్లే ఇచ్చింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు బెంగళూరు బుల్స్ x పుణేరి పల్టన్ రాత్రి గం. 8.00 నుంచి బెంగాల్ వారియర్స్ x ఢిల్లీ దబాంగ్ రాత్రి గం. 9.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
ఎదురులేని యు ముంబా
- వరుసగా నాలుగో విజయం - ప్రొ కబడ్డీ లీగ్-2 ముంబై: సొంతగడ్డపై యు ముంబా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అజేయంగా నిలిచింది. ప్రొ కబడ్డీ లీగ్-2లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 2 సాధించింది. ఈ లీగ్‌లో యు ముంబా జట్టుకిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో ముంబా 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మ్యాచ్ ఆరంభం నుంచి ముంబా ఆటగాళ్ల జోరు కొనసాగింది. మొదట్లోనే 9-6తో ఆధిక్యంలోకి వెళ్లిన ముంబా జట్టుకి ఒకదశలో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. విరామ సమయం ముగిశాక రెండు జట్ల స్కోరు 10-10తో సమమైంది. ఆ తర్వాత ప్రతి పాయింట్ కోసం రెండు జట్ల ఆటగాళ్లు పోరాడటంతో మరోసారి స్కోరు 18-18 వద్ద సమమైంది. ఈ దశలో ముంబా స్టార్ ప్లేయర్ అనూప్ కుమార్‌తోపాటు షబీర్ బాపు, రిషాంక్ రాణించడంతో ఆ జట్టు నాలుగు పాయింట్లు స్కోరు చేసి 22-18తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ముంబా ఈ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయి విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం నుంచి కోల్‌కతా దశ పోటీలు మొదలవుతాయి. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రారంభోత్సవంలో జాతీయ గీతం ఆలపిస్తాడు. ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు బెంగాల్ వారియర్స్ x జైపూర్ పింక్ పాంథర్స్ రాత్రి గం. 8.00 నుంచి బెంగళూరు బుల్స్ x పాట్నా పైరేట్స్ రాత్రి గం. 9.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం