ఎదురులేని యు ముంబా | On Puneri paltan You Mumbai Success | Sakshi
Sakshi News home page

ఎదురులేని యు ముంబా

Published Wed, Jul 22 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

ఎదురులేని యు ముంబా

ఎదురులేని యు ముంబా

- వరుసగా నాలుగో విజయం     
- ప్రొ కబడ్డీ లీగ్-2

ముంబై:
సొంతగడ్డపై యు ముంబా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అజేయంగా నిలిచింది. ప్రొ కబడ్డీ లీగ్-2లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 2 సాధించింది. ఈ లీగ్‌లో యు ముంబా జట్టుకిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో ముంబా 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మ్యాచ్ ఆరంభం నుంచి ముంబా ఆటగాళ్ల జోరు కొనసాగింది. మొదట్లోనే 9-6తో ఆధిక్యంలోకి వెళ్లిన ముంబా జట్టుకి ఒకదశలో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. విరామ సమయం ముగిశాక రెండు జట్ల స్కోరు 10-10తో సమమైంది.

ఆ తర్వాత ప్రతి పాయింట్ కోసం రెండు జట్ల ఆటగాళ్లు పోరాడటంతో మరోసారి స్కోరు 18-18 వద్ద సమమైంది. ఈ దశలో ముంబా స్టార్ ప్లేయర్ అనూప్ కుమార్‌తోపాటు షబీర్ బాపు, రిషాంక్ రాణించడంతో ఆ జట్టు నాలుగు పాయింట్లు స్కోరు చేసి 22-18తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ముంబా ఈ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయి విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం నుంచి కోల్‌కతా దశ పోటీలు మొదలవుతాయి. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రారంభోత్సవంలో జాతీయ గీతం ఆలపిస్తాడు.
 
 ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు

 బెంగాల్ వారియర్స్ x జైపూర్ పింక్ పాంథర్స్
 రాత్రి గం. 8.00 నుంచి
 బెంగళూరు బుల్స్ x పాట్నా పైరేట్స్
 రాత్రి గం. 9.00 నుంచి
 స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement