ఓయూ బీఈడీ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన బీఈడీ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ప్రకటించారు. ఈ నెల 20 నుంచి ఆయా కళాశాలల నుంచి మార్కుల జాబితాలను పొందవచ్చని అడిషనల్ కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. రీవాల్యూయేషన్ కోసం ఈ నెల 11 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కాగా.. ఉస్మానియా యూనివర్సిటీ వివిధ పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ నెల 11న మార్కుల జాబితాలను ఆయా కళాశాలలకు అందచేయనున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ప్రొఫెసర్ సుధాకర్‌రెడ్డి చెప్పారు.