Professional career
-
సెంచరీ హీరో
బాలీవుడ్లో ఉన్న అగ్రహీరోల్లో అజయ్ దేవగణ్ ఒకరు. ఎన్నో విభిన్నమైన పాత్రలతో మంచి నటుడిగా గుర్తింపు పొందారాయన. ఈ నెల 2న అజయ్ జన్మదినం. 50వ వసంతంలోకి అడుగు పెట్టారాయన. ప్రొఫెషనల్‌గా కెరీర్లో వందో చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం నటిస్తున్న పీరియాడికల్ మూవీ ‘తానాజీ: ది అన్సంగ్ వారియర్’ ఆయనకు వందో చిత్రం. ‘‘రేపు ఏమౌతుంది? అనే ఆలోచన లేకుండా ఇండస్ట్రీలో నా కెరీర్‌ను స్టార్ట్ చేశాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే 28 ఏళ్లు పూర్తయ్యాయి. వందో చిత్రంలో నటిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది’’ అని అజయ్ దేవగణ్ అన్నారు. ఆయన నటించిన ‘టోటల్ ధమాల్, దే దే ప్యార్ దే’ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. -
విజేందర్ ప్రత్యర్థి జిలెన్
ఈనెల 30న రెండో బౌట్ లండన్: ప్రొఫెషనల్ కెరీర్ అరంగేట్రం బౌట్‌లోనే ‘టెక్నికల్ నాకౌట్’ విజయంతో అదరగొట్టిన భారత బాక్సర్ విజేందర్ సింగ్ రెండో బౌట్‌కు సిద్ధమయ్యాడు. ఈనెల 30న లండన్‌లో జరిగే రెండో ప్రొఫెషనల్ బౌట్లో బ్రిటన్‌కు చెందిన 33 ఏళ్ల డీన్ జిలెన్తో విజేందర్ తలపడతాడు. మాంచెస్టర్ ఎరీనాలో సోనీ వైటింగ్ (ఇంగ్లండ్)తో జరిగిన తొలి బౌట్లో విజేందర్ మూడో రౌండ్లోనే గెలిచాడు. గత మేలో ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగుపెట్టిన జిలెన్ ఆడిన రెండు బౌట్లలో విజయం సాధించడం విశేషం. అంతకుముందు అమెచ్యూర్ బాక్సర్‌గా జిలెన్ 2013లో ప్రపంచ పోలీస్ గేమ్స్, ఫైర్ ఫైటర్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించాడు.