ధర్మపరిరక్షణార్థమే సత్యసాయి అవతరణ
సత్యసాయి బోధనల ఆంగ్ల అనువాదకుడు ప్రొఫెసర్ అనిల్‌కుమార్
పుట్టపర్తి టౌన్ :
మానవతా విలువలు అంతరించిపోతున్న తరుణంతో ధర్మపరిరక్షణార్థం సత్యసాయి భూమిపై అవతరించారని సత్యసాయి అంగ్ల బోధనల అనువాదకుడు ప్రొఫెసర్ అనిల్‌కుమార్ అన్నారు. సత్యసాయి 91వ జయంతి కార్యక్రమాల్లో భాగంగా ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సోమవారం ఉదయం ఆయన ప్రసంగించారు. సత్యం, ధర్మ, శాంతి, ప్రేమ మానవ జీవింతలో మూలస్తంభాలని, వాటిని సత్యసాయి బోధించి, ఆచరించి చూపారన్నారు. ప్రతి ఒక్కరూ సత్యసాయి బోధనల అనుసారం సన్మార్గంలో నడవాలని కోరారు.
సత్యసాయి మొబైల్ వైద్యసేవల వాహనాలు ప్రారంభం
సత్యసాయి సంచార వైద్య సేవల్లో భాగంగా హైదరాబాద్, విజయనగరం జిల్లాలో గ్రామీణ రోగులకు సేవలందించేందుకు రెండు నూతన మొబైల్ వైద్య వాహనాలను సత్యసాయి ట్రస్ట్ సభ్యులు సోమవారం ప్రారంభించారు. సత్యసాయి జయంతిలో భాగంగా సోమవారం ఉదయం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వాహనాలను ప్రారంభించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్రాజు, చక్రవర్తి, నాగానంద, ఏపీ మిశ్రా, టీకేకే భగవత్, కార్యదర్శి ప్రసాద్‌రావు, సత్యసాయి సేవా సంస్థల దేశీయ అధ్యక్షుడు నిమిష్‌పాండ్య, ప్రశాంతి కౌన్సిల్ చైర్మ¯ŒS డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, మాజీ డీజీపీ హెచ్‌జే దొర పాల్గొన్నారు.