ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ప్రొఫెసర్ సాయిబాబా అరెస్ట్‌తో ఢిల్లీ వర్సిటీలో కలకలం రేగింది. మావోయిస్టులతో సంబంధాలపై ఆయనను పోలీసులు ప్రశ్నించే అవకాశముంది. ఎంతకాలం నుంచి మావోయిస్టులతో ఆయనకు సంబంధాలున్నాయనే దానిపై దర్యాప్తు చేయనున్నారు.