ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ‘లోగో’ విడుదల
జగిత్యాల అగ్రికల్చర్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం లోగోను గురువారం వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు విడుదల చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న తెలంగాణకు చెందిన పరిశోధన స్థానాలు, వ్యవ సాయ కళాశాలలు, డాట్ సెంటర్లు కొత్తగా ఏర్పాటైన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోకి మారనున్నారుు. వీటన్నింటిలో కొత్త లోగోను ఉపయోగించనున్నారు.