జూలైకి ‘పురుషోత్తపట్నం’ పూర్తి
పురుషోత్తపట్నం (సీతానగరం):
2017 జూలై నాటికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పూర్తిచేసి, 75 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పోలవరం ఎడమకాలువ ఎస్ఈ సుగుణాకరరావు తెలిపారు. శుక్రవారం పురుషోత్తపట్నం పథకం నెలకొల్పే స్థలాన్ని ఆయన, ఈఈ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పథకంలో పది మోటార్లతో అయిదు పైప్లై¯ŒSలు పది కిలోమీటర్లు పొడవునా వెళతాయన్నారు. 240 ఎకరాల భూసేకరణ సేకరించాలని, అందులో ప్రభుత్వ భూమి ఎంత, రైతుల భూమి ఎంత అనేది నిర్ధారించవలసి ఉందన్నారు. రైతుల నుంచి తీసుకునే భూమికి నష్టపరిహారమా లేదా లీజు అనేది వారి సూచనల మేరకు ఉంటుందన్నారు. 58 కిలోమీటర్లు ఏలేరు రిజర్వాయర్ వరకు పోలవరం ఎడమ కాలువ పనులు మూడు ప్యాకేజీలుగా జరుగుతున్నాయన్నారు. రెండు, మూడు ప్యాకేజీ పనులు పూర్తి అయ్యాయని, ఒకటవ ప్యాకేజీలో 7 లేదా 8 స్ట్రక్చర్స్ ఉన్నాయని, వాటిని జూలై నాటికి పూర్తి చేసి ఏలేరు రిజర్వాయర్లో నీటిని పంపిస్తామన్నారు. 2017నాటికి ఏలేరు పరిధిలో 53 వేల ఎకరాలు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో ఉన్న 23 వేల ఎకరాలకు నీరు అందిస్తామని, 2018 నాటికి తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. ఏలేరు రిజర్వాయర్ కింద 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, ఈ పథకం ద్వారా రెండు పంటలకు నీరు అందించవచ్చన్నారు. 225–11 విద్యుత్ సబ్స్టేçÙ¯ŒS నెలకొల్పి పురుషోత్తపట్నం, పుష్కర పథకాలకు పుష్కలంగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. సుమారు రూ.1,450 కోట్లతో నెలకొల్పే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి జనవరి 5న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేస్తారని సుగుణాకరరావు తెలిపారు.