సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలి
– మంత్రి లక్ష్మారెడ్డి
– ఆయకట్టుకు కోయిల్‌సాగర్ నీటి విడుదల
కోయిల్‌సాగర్ (దేవరకద్ర రూరల్): సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రతి నీటి బొట్టు వథా కాకుండా చూడాల్సిన బాధ్యత ఆయకట్టు రైతులపై ఉందన్నారు. దేవరకద్ర మండలంలోని భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ కోయిల్‌సాగర్ నీటిని గురువారం దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డిలతో కలిసి మంత్రి లక్ష్మారెడ్డి ఆయకట్టుకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ఎంతో శ్రమకోర్చి జూరాల నుంచి లిఫ్టు ద్వారా కోయిల్‌సాగర్‌కు కష్ణా జలాలను తరలించామన్నారు. నీటిని వథా చేయకుండా ఆయకట్టు రైతులు సేద్యానికి ఉపయోగించుకొని లబ్ధి పొందాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరిలాల్, ఎంపీడీఓ భాగ్యలక్ష్మి, ఎంపీపీ గోపాల్, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, హర్షవర్ధన్‌రెడ్డి, దేవరకద్ర వ్యవసాయ కమిటీ ఛైర్మన్ జెట్టి నర్సింహ్మారెడ్డి, ప్రాజెక్టు కమిటీ మాజీ ఛైర్మన్ ఉమామహేశ్వర్‌రెడ్డి, నాయకులు దేవరి మల్లప్ప, కొండా శ్రీనివాస్‌రెడ్డి, రఘువర్మ, భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, కర్ణంరాజు, దొబ్బలి ఆంజనేయులు, అంజన్‌కుమార్, ఇరిగేషన్ అధికారులతో పాటు దేవరకద్ర, ధన్వాడ, చిన్నచింతకుంట మండలాల ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.