ప్రూఫ్ లెస్ సిమ్‌లతో యువతులకు వేధింపులు
నెల్లూరు: ప్రూఫ్‌లు లేని సిమ్‌లను వినియోగిస్తూ ఫోన్ల ద్వారా కొందరు యువకులు మహిళలను వేధిస్తున్నారు. జిల్లాలోని తోటపల్లిగూడూరు మండల పరిధిలోని నరుకూరు, సాలిపేట, మహాలక్ష్మీపురంలలో కొందరు యువకులు అర్ధరాత్రి యువతులకు కాల్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. నరుకూరు సెంటర్‌కు చెందిన ఓ యువతి(19)కి కొందరు ఆకతాయిలు 8008702817, 9966541870, 9573306361 నంబర్ల నుంచి కాల్ చేసి వేధించారు.
దీంతో బెదిరిపోయిన ఆమె తల్లిదండ్రులకు ఫోన్ ఇవ్వడంతో వారిని కూడా దుర్భాలాడాడు. మరో ఘటనలో సాలిపేటకు చెందిన ఓ మహిళకు ఫోన్ చేసిన ఆకతాయి అసభ్యకరంగా మాట్లాడాడు. ప్రూఫ్‌లు లేని సిమ్‌లతో ఆకతాయిలు కాల్ చేస్తుండటంతో వారిని గుర్తించడం కష్టంగా మారుతోంది. దీంతో ప్రూఫ్‌లు లేని సిమ్‌లు అమ్ముతున్న సెల్ షాపుల ఓనర్లతో పాటు, ఆకతాయిలను ఎలాగైనా పట్టుకోవాలని స్ధానికులు పోలీసులను కోరుతున్నారు.