Proposal List
-
తెలుగురాష్ట్రాల మెగాఫుడ్ పార్క్‌ల లిస్ట్ ఇదే!
దేశవ్యాప్తంగా మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ కింద కేంద్రం ఏర్పాటుచేయబోయే ఆరు మెగా ఫుడ్ పార్క్‌లకు తెలుగు రాష్ట్రాల నుంచి ఏడు ప్రతిపాదనలు వచ్చినట్టు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ సహాయమంత్రి నిరంజన్ జ్యోతి చెప్పారు. కేంద్రం ఏర్పాటుచేయబోయే ఈ పార్కులకు 2016 జూలై 31 నుంచి ప్రతిపాదనలు స్వీకరించామని, ఈ గడువు గత నెల ఏడో తేదీతో ముగిసినట్టు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 54 ప్రతిపాదనలు వచ్చాయని, వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినది ఒకటి, తెలంగాణకు చెందినవి ఆరు ప్రాంతాలు ఉన్నట్టు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభల్లో మంత్రి ఈ ప్రతిపాదిత పార్క్‌ల వివరాలు లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. ఏపీ, తెలంగాణలు మెగాఫుడ్ పార్క్‌లకు సమర్పించిన ప్రతిపాదిత స్థలాలు.. 1. లేపాక్షి ఆగ్రో ఇండస్ట్రీస్, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ 2. జీ.ఎమ్ రెడ్డి ఫార్మ్స్ ప్రైవేట్.లిమిటెడ్, వరంగల్ జిల్లా, తెలంగాణ 3. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఐఐసీ), కరీంనగర్ జిల్లా, తెలంగాణ 4. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఐఐసీ), వరంగల్ జిల్లా, తెలంగాణ 5. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఐఐసీ), రంగారెడ్డి జిల్లా, తెలంగాణ 6. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఐఐసీ), మెదక్, తెలంగాణ 7. బసవాశక్తి మెగా ఫుడ్ పార్క్ ప్రై.లిమిటెడ్, మెదక్ జిల్లా, తెలంగాణ మెగా ఫుడ్ పార్క్‌ల ఏర్పాటుకు 2008-2015లో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆమోదించిన ప్రాంతాలు: ఆంధ్రప్రదేశ్ జాబితా... 1. శ్రీని ఫుడ్ పార్క్ ప్రై.లిమిటెడ్, చిత్తూరు జిల్లా 2. గోదావరి మెగా ఆక్వా పార్క్ ప్రై.లిమిటెడ్, పశ్చిమగోదావరి జిల్లా 3. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ), కృష్ణా జిల్లా తెలంగాణ జాబితా... 1. స్మార్ట్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రై.లిమిటెడ్, నిజామాబాద్ 2. రాగ మయూరి ఆగ్రోవెట్ ప్రై.లిమిటెడ్, మహబూబ్‌నగర్ 3. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఖమ్మం -
‘మాఫీ జాబితా’పై రైతుల్లో ఆందోళన
చేవెళ్ల: రుణ మాఫీ ప్రతిపాదిత జాబితా(ప్రపోజల్ లిస్ట్)పై పేర్లు లేని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హులమైనా.. తమ పేర్లు అందులో చేర్చలేదని మండిపడుతున్నారు. రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతుల జాబితాను అన్ని బ్యాంకుల నుంచి సేకరించిన రెవెన్యూ అధికారులు వాటిని గ్రామాల్లో ప్రదర్శించారు. దీంతో జాబితాలో పేర్లులేని రైతులు ఆందోళన చెందుతున్నారు. బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాల విషయంలో ఇప్పటికీ గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. పట్టాదారు పాసుపుస్తకం పెట్టి బ్యాంకులలో బంగారంపై రుణం తీసుకున్న వారికే రుణమాఫీ వర్తిస్తుందని కొన్ని బ్యాంకులు ప్రకటిస్తుండగా, పాస్ పుస్తకాలు లేకున్నా బంగారాన్ని తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలన్నీ మాఫీ అవుతాయని మరికొన్ని బ్యాంకులు ప్రకటిస్తుండడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. బంగారం తాకట్టుపెట్టి పాస్‌పుస్తకం లేకుండా తీసుకున్న రుణాలన్నీ కమర్షియల్ లోన్ (వ్యాపార రుణం) కిందకు వస్తాయని కొన్ని బ్యాంకులు తెలియజేస్తుండగా, పాస్ పుస్తకంలేకున్నా రైతులు బంగారం తనఖా పెట్టి తీసుకున్న రూ.లక్షలోపు తీసుకున్న రుణాలన్నీ క్రాప్‌లోన్ కిందకే వస్తాయని మరికొన్ని బ్యాంకులు చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో తెలియక రైతులు తికమక పడుతున్నారు. దీంతో బుధవారం మండలంలోని ఆలూరు, చేవెళ్లలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో అధికారులతో పలు గ్రామాల రైతులు వాగ్వాదానికి దిగారు. ఆలూరు బ్యాంకు వద్ద ఆలూరు, ఖానాపూర్, వెంకన్నగూడ, రేగడిఘనాపూర్ తదితర గ్రామాలకు చెందిన పలువురు రైతులు రుణమాఫీ జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవని బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. తమను అర్హుల జాబితాలో చేర్చి సంబంధిత అధికారులకు లిస్టు పంపాలని, వారే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అదేవిధంగా మండలంలోని ముడిమ్యాల, కుమ్మెర, పలుగుట్ట తదితర గ్రామాల రైతులు మండల కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు చేరుకుని పాస్ పుస్తకం పెట్టకుంగా బంగారంపై రుణం తీసుకున్న వారి పేర్లను కూడా అధికారులకు పంపాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రదర్శించినది తుది జాబితా కాదని, గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించిన అనంతరం అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితాను ప్రకటిస్తామని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. మరో నాలుగైదు రోజులలో తుది జాబితా విడులయ్యే అవకాశం ఉందని తెలిపారు. రుణమాఫీ విషయంలో అర్హులైన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, నిజంగానే అర్హత ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని వారు పేర్కొంటున్నారు.