తెలుగురాష్ట్రాల మెగాఫుడ్ పార్క్ల లిస్ట్ ఇదే!
తెలుగురాష్ట్రాల మెగాఫుడ్ పార్క్ల లిస్ట్ ఇదే!
Published Fri, Dec 2 2016 6:44 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
దేశవ్యాప్తంగా మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ కింద కేంద్రం ఏర్పాటుచేయబోయే ఆరు మెగా ఫుడ్ పార్క్లకు తెలుగు రాష్ట్రాల నుంచి ఏడు ప్రతిపాదనలు వచ్చినట్టు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ సహాయమంత్రి నిరంజన్ జ్యోతి చెప్పారు. కేంద్రం ఏర్పాటుచేయబోయే ఈ పార్కులకు 2016 జూలై 31 నుంచి ప్రతిపాదనలు స్వీకరించామని, ఈ గడువు గత నెల ఏడో తేదీతో ముగిసినట్టు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 54 ప్రతిపాదనలు వచ్చాయని, వాటిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినది ఒకటి, తెలంగాణకు చెందినవి ఆరు ప్రాంతాలు ఉన్నట్టు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభల్లో మంత్రి ఈ ప్రతిపాదిత పార్క్ల వివరాలు లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
ఏపీ, తెలంగాణలు మెగాఫుడ్ పార్క్లకు సమర్పించిన ప్రతిపాదిత స్థలాలు..
1. లేపాక్షి ఆగ్రో ఇండస్ట్రీస్, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్
2. జీ.ఎమ్ రెడ్డి ఫార్మ్స్ ప్రైవేట్.లిమిటెడ్, వరంగల్ జిల్లా, తెలంగాణ
3. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఐఐసీ), కరీంనగర్ జిల్లా, తెలంగాణ
4. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఐఐసీ), వరంగల్ జిల్లా, తెలంగాణ
5. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఐఐసీ), రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
6. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఐఐసీ), మెదక్, తెలంగాణ
7. బసవాశక్తి మెగా ఫుడ్ పార్క్ ప్రై.లిమిటెడ్, మెదక్ జిల్లా, తెలంగాణ
మెగా ఫుడ్ పార్క్ల ఏర్పాటుకు 2008-2015లో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆమోదించిన ప్రాంతాలు:
ఆంధ్రప్రదేశ్ జాబితా...
1. శ్రీని ఫుడ్ పార్క్ ప్రై.లిమిటెడ్, చిత్తూరు జిల్లా
2. గోదావరి మెగా ఆక్వా పార్క్ ప్రై.లిమిటెడ్, పశ్చిమగోదావరి జిల్లా
3. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ), కృష్ణా జిల్లా
తెలంగాణ జాబితా...
1. స్మార్ట్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రై.లిమిటెడ్, నిజామాబాద్
2. రాగ మయూరి ఆగ్రోవెట్ ప్రై.లిమిటెడ్, మహబూబ్నగర్
3. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఖమ్మం
Advertisement
Advertisement