ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తించాలి
వరంగల్ క్రైం : ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తించాలని వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి పోలీసులకు పిలుపునిచ్చారు. వరంగల్ అర్బన్, రూరల్ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్లూకోల్ట్స్ టీమ్‌ను గురువారం డీఐ జీ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో పోలీసులు ప్రజలకు మరింత చేరువ కావడంతోపాటు తక్షణ పోలీసు సహకారం అందించాలని డీఐజీ, ఎస్పీ సంయుక్త ఆలోచనతో బ్లూకోల్ట్స్ విభాగానికి శ్రీకారం చుట్టారు.
అర్బన్, రూరల్ పరిధిలో శాంతిభద్రతలకు సంబంధించి ఏవైనా సమస్యలు, గొడవలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్య తలెత్తినపుడు తక్షణమే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు సాయం చేయాలని, ము ఖ్యంగా ఈవ్‌టీజింగ్, మహిళలపై వేధింపుల వంటి సమస్యలు నిరోధించడానికి ఈ విభా గం పని చేయాలన్నారు.
ఫోన్ చేసిన వెంటనే ఆయా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇద్దరు సభ్యులున్న బ్లూ కోల్ట్స్ టీమ్ చేరుకుని బాధితులకు సహకరించడంతోపాటు సంఘటన జరగడానికి కారణాలను విశ్లేషిస్తుందన్నారు. కార్యక్రమంలో అర్బన్ ట్రాఫిక్ అదనపు ఎస్పీ అనిల్‌కుమార్, డీఎస్పీలు దక్షిణామూర్తి, హిమావతి, రాజిరెడ్డి, జనార్ధన్, రమేశ్తోపా టు అర్బన్, రూరల్‌కు చెందిన సీఐలు పాల్గొన్నారు.