కూలిన విశాఖ పోర్టు రక్షణ గోడ
విశాఖపట్నం: : పై-లిన్ తుపాన్ వల్ల ఫిషింగ్ హార్బర్‌కు ప్రమాదం పొంచి ఉంది. రెండు చోట్ల పోర్టు రక్షణ గోడ కూలింది. ఈ పరిస్థితులలో సముద్రపు బ్యాక్ వాటర్ హార్బర్లోకి చొచ్చుకువెళ్లే ప్రమాదం ఉంది. పోర్టు యాజమాన్యం స్పందించాలని మత్స్యకారులు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, భీమిలి మంగమారిపేట గ్రామంలో ఇళ్లలోకి సముద్రపు నీరు వచ్చి చేరుతోంది.