breaking news
proteen
-
రుచికరంగా..ఆరోగ్యంగా తిందాం ఇలా..!
ఆరోగ్యంగా తినాలంటే ఉప్పు , గ్లూకోజ్ తక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. కానీ మన నాలుక టేస్ట్ కావాలంటూ..పోషకాలు లేని ఆహారంవైపే పరుగులు తీస్తుంది. ముఖ్యంగా నూనెలో డీప్ ఫ్రై చేసి, అధికం సోడియంతో ఉండే వాటినే మనసు కోరుకుంటుంది. ఊబకాయం, డయాబెటిస్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడకూడదంటే చక్కెర, ఉప్పు తగ్గించడం తప్పనిసరి. మరి ఇలా నాలుకను కట్టేసేలా టేస్ట్ లెస్‌గా తినడం అందరి వల్ల కాదు. అలాంటప్పుడు ఇలా తెలివిగా రుచిని మిస్ కాకుంకా, పోషకాలు పోకుండా ఆరోగ్యంగా తినాంటే ఇలా ట్రై చేయండని చెబుతున్నారు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ జమునా. మరి అదెలాగో తెలుసుకుందామా..!.రుచిని కోల్పోకుండా సంతృప్తికరంగా తినాలనకుంటే ఉమామి రుచి బెస్ట్ అంటున్నారామె. అదేం రుచి అంటే..ఉమామి' అంటే జపనీస్ భాషలో "ఆహ్లాదకరమైన రుచి". 1980లలో అధికారికంగా ప్రత్యేక రుచిగా ఈ పేరు పెట్టడం జరిగింది. ఉమామి అనేది ఒక డిష్‌ని ఎలివేట్ చేసేలా రిచ్‌నెస్, ఫుల్నెస్ కూడిన ఒక విధమైన రుచి. అంటే ఉప్పు తక్కువగా ఉన్న మంచి టేస్ట్‌గా ఉంటుంది. అలాగే చప్పిడి భోజనం తిన్నామనే ఫీల్ రాదట. మాంసం, చేపలు, పుట్టగొడుగుల కూరల్లోని గ్రేవీకి తీపి, పులుపుతో కూడిన రుచినే ఈ ఉమామి. ఇది మనసుకు ఓదార్పుని, ఊరటనిచ్చే ఆహ్లాదకరమైన రుచి అని చెప్పొచ్చు. అనేక ఆహారాల్లో ఉండే గ్లూటామేట్, అమైనో ఆమ్లం మన నాలుకపై ఉండే రుచి గ్రాహకాలను ప్రేరేపిస్తుంది. ఇదే ఉమామి రుచి. ఎక్కువగా మాంసం, సముద్రపు ఆహారంలో ఈ ఉమామి టేస్ట్ అనుభవానికి వస్తుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. అందుకే తక్కువ సోడియం ఉన్న ఆహారాలకు ఉమామి రుచిని పెంచే పదార్థాలను జోడిస్తే..ఆహారం రుచికరంగా మారుతుంది, ఆరోగ్యకరంగా తినే అవకాశం ఉంటుందని జపన్ పరిశోధనల్లో వెల్లడైంది. ఇందులో అధికంగా ఉండే గ్లూటామేట్ సంతృప్తిని అందించి, స్నాక్స్ అవసరాన్ని తగ్గిస్తుందట. అందుకోసం..ఉమామి రుచి కోసం మోనోసిడియం గ్లూటామేజ్(ఎంఎస్‌జీ)ని ఉపయోగిస్తారట. ఇది సహజ పదార్థాల నుంచే తయారవతుంది. పెరుగు లేదా వెనిగర్ తయారీకి ఉపయోగించే పద్ధతిలో తయారు చేయడం లేదా చెరుకు లేదా టాపియోకా కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారట. ఇందులో ఉప్పులోని సోడియం కంటెంట్ కంటే తక్కువగా, పైగా ఉప్పుకి ప్రత్యామ్నాయంగా ఉంటుందట. పైగా ఇది భోజనాన్ని మితంగా తినేలా చేస్తుంది. అదీగాక ఇంద్రియాలతో రుచిని అనుభవించే మనకు జిహ్వ చాపల్యం శాపంగా మారకుండా ఉమామి రుచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందట. ఫలితంగా రుచిని కోల్పోకుండా పోషకాహారాలను కచ్చితంగా తీసుకోగలుగుతారు.చివరగా ఉమామి రుచి కోసం గ్లూటామేట్ అధికంగా ఉండే కూరగాయలు ప్రతిసారి జోడించడం కుదరనప్పుడూ పైన చెప్పిన కృత్రిమ ఈ ఎంఎస్‌జీ రుచితో కూడిన మసాలా ఉప్పు ఉయోగపడుతుంది. పోషకాహరం పేరుతో పాక రుచిని కోల్పోకుండా తెలివిగా తినే విధానమే ఇది అని చెబుతున్నారు మాజీ ప్రోఫెసర్ జమునా.డాక్టర్ జమునా ప్రకాష్ ఫుడ్ కన్సల్టెంట్, మాజీ ప్రొఫెసర్, మైసూర్ విశ్వవిద్యాలయం(చదవండి: ఆంజినాని అర్థం చేసుకుంటే..అతివల గుండె పదిలం..!) -
పోషకాల బ్రేక్‌ఫాస్ట్..!
ఒక రోజంతా శక్తిమంతంగా, ఉత్సాహంగా గడిచిందంటే వారిపై ఆ రోజు ఉదయాన్నే తీసుకునే అల్పాహారం ప్రభావం తప్పక ఉంటుంది. పిల్లల జ్ఞాపకశక్తికీ పోషకాలు గల ఆహారం ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే పిల్లలు, పెద్దలు తీసుకునే బలవర్ధకమైన, సులువుగా తయారు చేసుకునే వంటకాలు ఇవి.. హెల్తీ మిక్స్ హల్వాకావల్సిన పదార్థాలుహెల్త్ మిక్స్ – కప్పు (క్యారెట్ లేదా బీట్రూట్ లేదా గుమ్మడి తురుము లేదా గోధుమ నూక); నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బెల్లం లేదా కొబ్బరి చక్కెర – 1/4 కప్పు; పాలు – కప్పు; బాదం, జీడిపప్పు, చియా సీడ్స్ – టేబుల్ స్పూన్;తయారీ విధానంపాన్లో నెయ్యి వేడి చేసి, హెల్తీ మిక్స్ వేసి, బాగా వేయించాలి. పాలు పోసి, కలుపుతూ ఉండాలి.. మిశ్రమం చిక్కగా అయ్యాక, తురిమిన బెల్లం, కొబ్బరి చక్కెర ’కోకో షుగర్) వేసి బాగా కలపాలి. అన్నీ పూర్తిగా కలిసే వరకు మరో 2–3 నిమిషాలు ఉడికించాలి.తరిగిన డ్రై ఫ్రూట్స్ అలంకరించి, సర్వ్ చేయాలి. పోషకాలు: పిల్లలకు, పెద్దలకు ఇష్టమైనదే కాదు... మంచి పోషకాలు కూడా ఉండే స్వీట్ ఇది. బెల్లం లేదా కొబ్బరి చక్కెర వాడటం వల్ల ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. బీట్రూట్, క్యారట్, గుమ్మడిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు లభిస్తాయి. పాల మిశ్రమం కాబట్టి క్యాల్షియమూ అందుతుంది. చిల్లాకావల్సిన పదార్థాలు: పెసరపప్పు – కప్పు (తగినన్ని నీళ్లు ΄ోసి, రెండు గంటలసేపు నానబెట్టాలి); నీళ్లు – అర కప్పు (తగినన్ని); ఉల్లిపాయ – చిన్నది (సన్నగా తరగాలి); పచ్చి మిర్చి – సన్నగా తరగాలి; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత; నూనె – తగినంత.తయారీ విధానంపెసరపప్పును వడకట్టి, నీళ్లు కలిపి, మెత్తగా రుబ్బుకోవాలి. పిండిని గిన్నెలోకి తీసుకొని (క్యారెట్ తురుము, పాలకూర తరుగు, నానబెట్టిన ఓట్స్ కూడా కలుపుకోవచ్చు) తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. పెనం వేడి చేసి, ఒక గరిటెతో పెనం పైన పిండి పోసి, దోసెలా వెడల్పు చేయాలి. మీడియం మంట మీద రెండు వైపులా గోధుమ రంగు వచ్చేవరకు ఉంచాలి. కొత్తిమీర, పుదీనా చట్నీతో వేడిగా సర్వ్ చేయాలి.పోషకాలుక్యాలరీలు తక్కువగా ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్, జింక్ సమృద్ధిగా లభించే ఈ చిల్లా ఉదయం, సాయంత్రం స్నాక్‌గా తీసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్లోకీ బాగుంటుంది. దీనిని రోల్ చేసి, ఉడికించిన కూరగాయలతో స్టఫ్ చేసి కూడా అందివ్వవచ్చు. హెల్తీ మిక్స్ పరాఠాకావల్సిన పదార్థాలుహెల్తీ మిక్స్ (రాగులు, జొన్న, సజ్జలు, కొర్రలు మొలకెత్తిన గింజలు, గుమ్మడి, అవిసెగింజలతో చేసిన పిండి) – కప్పు; నెయ్యి లేదా నూనె – టీ స్పూన్; ఉప్పు – తగినంత; గోరువెచ్చని నీళ్లు (తగినన్ని); తయారీ విధానంఒక గిన్నెలో, మిల్లెట్ మిక్స్, ఉప్పు వేయాలి. గోరువెచ్చని నీటిని క్రమంగా వేస్తూ, పిండిని మెత్తని ముద్దలా అయ్యేలా బాగా కలపాలి. చేతులకు నూనె లేదా నెయ్యి రాసుకొని, చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. రెండు బటర్ పేపర్ షీట్ల మధ్య పిండి బాల్ ఉంచి, చపాతీ కర్రతో మెల్లగా, తేలికపాటి ఒత్తిడితో, రోల్ చేయాలి. పెనం వేడి చేసి, ప్రతి పరాఠాను సన్నని మంట మీద కొద్దిగా నెయ్యి/నూనెతో బంగారు గోధుమ రంగు వచ్చే వరకు రెండు వైపులా కాల్చాలి. చట్నీ లేదా పెరుగుతో వేడిగా వడ్డించాలి. పోషకాలు: పరాటాకు కూరగాయలను ఉడికించి, వాడుకోవచ్చు. ఏమేం దినుసులు, కూరగాయలు వాడుతున్నామో దానిని బట్టి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. (చదవండి: కూల్ మాన్సూన్లో..స్పెషల్ హాట్ ట్రీట్స్..!) -
కమ్మగా కడుపుకింత కరెంటు ఫుడ్డు
షడ్రషోపేతమైన భోజనం తిన్నా.. మన శరీరానికి ఒంటబట్టేది మాత్రం కాసిన్ని కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లే! అంతేనా? మరి ఈ మాత్రానికి బోలెడంత శ్రమకు ఓర్చి వ్యవసాయం చేయాలా? అవసరం లేదంటున్నారు ఫిన్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు. వ్యవసాయం లేకపోతే రుచి మాట దేవుడెరుగు.. అసలు జీవుడు బతికి ఉండేదెలా అంటే.. మేమున్నాం కదా.. ఎంచక్కా కాస్త కరెంటు.. కొంచెం కార్బన్‌డైయాక్సైడ్.. మరికాసిన్ని బ్యాక్టీరియాతో ఒంటికి కావాల్సిన ప్రొటీన్లను తయారు చేసి ఇచ్చేస్తామంటున్నారు వీళ్లు. ఏం..? నమ్మబుద్ధి కావడం లేదా? అయితే పక్క ఫొటో చూడండి. అందులోని చెంచాలో ఉందే.. అది ఇలా తయారైన ప్రొటీనే! కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చుగానీ.. ఇది భలే రుచిగా ఉంటుందట.. పైగా పోషకాలూ ఎక్కువే. ‘ఫుడ్ ఫ్రం ఎలక్ట్రిసిటీ’ అనే ప్రాజెక్టు కింద లాప్పీన్రాంటా టెక్నాలజీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గత ఏడాది ఆగస్టు నుంచి ఈ కృత్రిమ ప్రొటీన్ తయారీ ప్రయత్నాల్లో ఉన్నారు. ఓ బయోరియాక్టర్‌లోకి కాసిన్ని నీళ్లు, బ్యాక్టీరియా, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్పరస్ వంటివి వేయడం.. దాంట్లోకి కరెంటుతోపాటు కార్బన్‌డైయాక్సైడ్ వాయువును పంపడంతో ప్రొటీన్ తయారీ ప్రక్రియ మొదలవుతుంది. విద్యుత్తు కారణంగా నీటి నుంచి హైడ్రోజన్ విడుదలైతే.. బ్యాక్టీరియా ఇతర పదార్థాలను వాడుకుని ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఈ రసాయన చర్యలన్నింటి ఫలితంగా చివరకు పొడిలాంటి సింగల్ సెల్ ప్రొటీన్ తయారవుతుంది. ఉత్పత్తి అయిన పదార్థంలో 50 శాతం వరకూ ప్రొటీనే.. ఇంకో పాతికశాతం కార్బొహైడ్రేట్లు కూడా ఉంటాయి దీంట్లో. మిగిలినది కొవ్వులు, న్యూక్లియిక్ యాసిడ్లు. వాడే బ్యాక్టీరియాను మార్చడం ద్వారా తుది ఉత్పత్తిలోని అంశాల మోతాదుల్లో మార్పులూ చేయవచ్చు. ప్రస్తుతం ఒక గ్రాము ప్రొటీన్ తయారు చేసేందుకు రెండు వారాల సమయం పడుతోందని.. కాఫీకప్పు సైజుండే బయో రియాక్టర్ స్థానంలో పెద్దది వాడటం.. కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా దీన్ని పదిరెట్లు ఎక్కువ సమర్థంగా తయారు చేయవచ్చునని అంటున్నారు.. ఫిన్లాండ్ టెక్నికల్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన జూహా పెక్కా పిట్క్నీన్. ఈ బయో రియాక్టర్ ఇప్పటికిప్పుడు మనుషుల కోసం వాడకున్నా.. సమీప భవిష్యత్తులో పాడిపశువులకు, కోళ్లు ఇతర పౌల్ట్రీ జంతువులకు ఆహారాన్ని అందించేందుకు వాడుకునేందుకు మాత్రం అవకాశముంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్