protest demonstrations
-
పెరూలో ఆందోళనలు హింసాత్మకం
లిమా/వాటికన్ సిటీ: దక్షిణ అమెరికా ఖండంలోని పెరూలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జనం వీధుల్లోకి వస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి రాజధాని లిమాకు చేరుకుంటున్నారు. అధ్యక్షురాలు డినా బోలార్టే వెంటనే నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగుతున్నారు. డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఘర్షణలో 55 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా శుక్రవారం రాత్రి దక్షిణ పూనోలో నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. పోలీసులతో జరిగిన ఘర్షణలో ఒక నిరసనకారుడు మరణించాడు, 9 మంది గాయపడ్డారు. దేశంలో హింస ప్రజ్వరిల్లుతుండడంతో ప్రభుత్వ అప్రమత్తమైంది. పెరూలో 15వ శతాబ్దానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత కట్టడం, ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన మచ్చూపిచ్చూ సందర్శనను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు సాంస్కృతిక శాఖ ప్రకటించింది. మచ్చూపిచ్చూలో 417 మంది సందర్శకులు చిక్కుకుపోయారు. వారిలో 300 మందికిపైగా విదేశీయులున్నారు. పెరూలో హింసాకాండను వెంటనే ఆపాలని ప్రభుత్వానికి, ప్రజలకు పోప్ ఫ్రాన్సిస్ విజ్ఞప్తి చేశారు. -
ఫ్రాన్స్‌లో భద్రతా బిల్లుపై జనాగ్రహం
పారిస్: విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ఫొటోలను షేర్ చేయడాన్ని నిషేధిస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వం తీసుకొచ్చిన భద్రతా బిల్లుపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇటీవల ఫ్రాన్స్‌లో ఓ నల్ల జాతీయుడిని పోలీసులు కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం ప్రభుత్వం భద్రతా బిల్లును తీసుకొచ్చింది. ఇది పార్లమెంట్ దిగువ సభలో ఆమోదం పొందింది. ఇక సెనేట్‌లో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ కొత్త బిల్లు ప్రకారం.. విధుల్లో ఉన్న పోలీసుల ఫోటోలు తీయడం, వాటిని షేర్ చేయడం వంటివి చేస్తే ఏడాది జైలు శిక్ష, 53 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. -
భవిష్యత్ కార్యాచరణపై రేపు ప్రకటన : అశ్వత్థామ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీని ప్రైవేటీకరణ సాధ్యం కాదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి శనివారం స్పష్టం చేశారు. కార్మికులు అధైర్యపడవద్దని, ప్రైవేటీకరణ అనేది చట్టంలో లేదని వెల్లడించారు. ఆర్టీసీ జేఏసీ జారీ చేసిన ప్రకటనను ఎండీకి పంపిస్తామని, సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామన్నారు. మరోవైపు ఆదివారం ఎంజీబీఎస్‌లో మహిళా ఉద్యోగులు ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతారని వెల్లడించారు. అన్ని డిపోల కార్మికులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు నివాళులర్పించి డిపోల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలిన పిలుపునిచ్చారు. తదుపరి కార్యాచరణను ఆదివారం ప్రకటిస్తామని పేర్కొన్నారు. మరోవైపు కార్మికుల దీక్ష 50వ రోజుకు చేరింది. వివిధ జిల్లాల్లో కార్మికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఖమ్మంలో బస్‌డిపో నుంచి బస్టాండ్ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌లోకి కార్మికులు, అఖిల పక్ష నాయకులు చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. డిపోకి వస్తున్న బస్సులను మహిళా కండక్టర్లు ఆపేసి వాటి టైర్లలోని గాలి తీశేసారు. కొత్తగూడెం పట్టణంలో సీపీఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల కోసం నాయకులు విరాళాలు సేకరించారు. నిజామాబాద్‌లో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీని ధర్నాచౌక్ నుంచి ప్రారంభించగా బస్టాండ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, రైల్వే స్టేషన్ మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించారు. బోధన్‌లో అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లాలో ప్రైవేటీకరణకు నిరసనగా బస్టాండ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డిలో బస్టాండ్ ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బస్టాండ్ నుంచి ఐబీ వరకు దాదాపు 200 మంది కార్మికులు ర్యాలీ తీశారు. కరీంనగర్ జిల్లాలో బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. గోదావరి ఖనిలో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ చౌరస్తాలో కార్మికులు మానవ హారం నిర్మించారు. -
పేదింటి పిల్లల పెద్ద విజయం!
వీధుల్లో విద్యార్థులు ఊరేగింపుగా వెళ్లడం ఆ గ్రామప్రజలకు కొత్తేమీ కాదు. ‘భారత్‌మాతాకు జై’ ‘జై జవాన్ జై కిసాన్’ ఇలా ఎప్పుడూ వినవచ్చే నినాదాలు కాకుండా ఎప్పుడూ వినబడని నినాదాలు వినిపించాయి. దీంతో ఆ గ్రామస్థులకు ఆసక్తి పెరిగింది. ‘చదువుకునే హక్కు మాకు ఉంది. చదువు చెప్పేవారు మాత్రం లేరు’... ఈ తరహా నినాదాల నేపథ్యంలో ‘టీచర్లు కావాలంటున్నారు. మరి ఇప్పుడు స్కూల్లో ఎలా చదువుకుంటున్నారు?’ అనే సందేహం రావచ్చు. ఈ సందేహనివృత్తి కోసం మనం రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న భిమ్ అనే ఆ ఊరికి వెళ్ళొద్దాం... భిమ్లో ఉన్న గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్లో మొత్తం 700 మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయులు మాత్రం ముగ్గురే! ఇక ప్రిన్సిపల్ పోస్ట్ ఎనిమిది ఏళ్లుగా ఖాళీగా ఉంది. మొత్తం 11 ఫస్ట్ గ్రేడ్ టీచర్ పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితి గురించి తెలిసి కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ స్కూల్లో ఎలా చదివిస్తున్నారు? ‘‘ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత ఉంటే అక్కడెందుకు చదివిస్తాం?!’’ అంటారు చాలామంది. అదనపు ఉపాధ్యాయుల నియామకం కోసం పెద్దవాళ్లు చేసిన ప్రయత్నాలను దగ్గరి నుంచి గమనించిన పిల్లలు తమ కోసం తామే ఉద్యమించాలనుకున్నారు. దానికి ‘గాంధీజయంతి’ని ముహూర్తంగా పెట్టుకున్నారు. గాంధీ జయంతి రోజున స్కూలు గేటుకు తాళం వేసి, బ్యానర్లు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు పిల్లలు. ఆ తరువాత బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ ముందు ఎండలో ధర్నాకు కూర్చున్నారు. అక్టోబర్ 7లోపు కొత్త ఉపాధ్యాయుల నియామకం జరగకపోతే స్కూల్‌కు తాళం వేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయుల నియామకం జరగకపోవడంతో అక్టోబర్ 8న స్కూలు గేటుకు తాళం వేసి విద్యార్థులందరూ బయటకి వచ్చారు. పిల్లల ధర్నా విషయం కలెక్టర్ కార్యాలయం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సీయం కార్యాలయాలకు చేరింది. కదలిక మొదలైంది. ఒకేరోజు...నలుగురు టీచర్ల నియామకం జరిగింది. మరుసటి రోజు ఏడుగురు ఉపాధ్యాయులూ స్కూలుకొచ్చారు. అయితే ఈ సత్యాగ్రహం ఇక్కడితో ఆగలేదు. పొరుగున ఉన్న ఊళ్లలో కూడా భీమ్ తరహా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఫలితం ఇంకా రాలేదు. వస్తుందనే నమ్మకం మాత్రం వారిలో చాలా గట్టిగా ఉంది. దీనికి కారణం భిమ్ పిల్లల సత్యాగ్రహ విజయమే!