proton
-
గ్యాస్ ట్రబుల్ మందులతో కిడ్నీకి చేటు..
కడుపు ఉబ్బరంగా ఉందనిపిస్తే చాలు.. చాలామంది ఒమీప్రొజోల్, మెటాప్రొలోల్ వంటి మందులు ఎడాపెడా వాడేస్తూంటారు. ప్రొటాన్ పంప్ ఇన్హిబిటర్లు అని పిలిచే ఈ మందుల వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సైంటిఫిక్ రిపోర్ట్స్ మ్యాగజైన్ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం.. పీపీఐ మందులతో పోలిస్తే హిస్టమైన్ –2 రకం మందులు తీసుకునే వారికి కిడ్నీ సమస్యలు తక్కువ. అమెరికాలో అందుబాటులో ఉన్న కోటి మంది రోగుల వివరాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు రూబెన్ అబగ్యాన్ అనే శాస్త్రవేత్త చెప్పారు. పీపీఐ మందులు మాత్రమే తీసుకున్న వారి వివరాలను పరిశీలిస్తే ఇతరులతో పోలిస్తే కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని చెప్పారు. కొంచెం స్పష్టంగా చెప్పాలంటే ఈ మందులు తీసుకునే ప్రతి ముగ్గురిలో ఒకరు తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడే అవకాశం ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. పీపీఐ మందులు అత్యవసరమైనప్పటికీ వాటితో ఈ సమస్యలున్నాయని స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని.. పైగా పీపీఐ పద్ధతిపై ఆధారపడని యాంటాసిడ్లు, హిస్టమైన్ –2 రకం మందులతో దుష్ఫలితాలు తక్కువన్న విషయాన్ని గుర్తించాలని వివరించారు. -
ఈ ఎస్సైగారు... మేడీజీ మాస్టారు!
బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. వీటిని ఇదే వరుసలో గుర్తుపెట్టుకోవడం మరీ అంత కష్టం కాకపోవచ్చు. కానీ అలా గుర్తుపెట్టుకోలేని పిల్లలు కూడా ఉంటారు. అలాంటి వారి కోసం దివాకర్ యాదవ్ ఓ కొండ గుర్తు చెప్తారు. ‘పెన్’ అని గుర్తుపెట్టుకోండి చాలు అని. పి ఫర్ ప్రోటాన్, ఇ ఫర్ ఎలక్ట్రాన్, ఎన్ ఫర్ న్యూట్రాన్ అని ఈజీగా రాసేయొచ్చు అంటారు. మరి వీటిని కనిపెట్టిన వారి పేర్లను ఎలా గుర్తు పెట్టుకోవాలి? అది కొంచెం కష్టమైన విషయమే. అయితే దానికీ దివాకర్ దగ్గర ఓ చిట్కా ఉంది. అదొక్కటే కాదు... టెన్త్ విద్యార్థుల చదువుకు, వారి భవిష్యత్తుకు పనికొచ్చే టిప్స్ ఆయన దగ్గర చాలా ఉన్నాయి. మరేమిటి? ఈయనిలా... పో-లీ-స్ డ్రెస్‌లో ఉన్నారు! పోలీస్ డ్రెస్‌లో ఉండడం కాదు. నిజంగా పోలీసే. దివాకర్ యాదవ్ విశాఖ నగర కమిషనరేట్‌లోని పీఎంపాలెం పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ సబ్ఇన్స్పెక్టర్!! 2007 బ్యాచ్ ఎస్ఐ. పూర్వాశ్రమంలో ఆయనేమీ టీచర్‌గా పని చేయలేదు. బీఈడీ కూడా చేయలేదు. ఉపాధ్యాయుడు కావాలనుకోలేదు కూడా. చదివింది ఎంసీఏ. అయితే విద్యార్థుల భవిష్యత్తుపై, విద్యా బోధనపై ఆయనకు ఎందుకింత తపన? కారణం ఉంది. దివాకర్ ఇంతకు మునుపు విశాఖలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో, పద్మనాభం, పీఎంపాలెం స్టేషన్లలో క్రైం ఎస్సైగా పనిచేశారు. ఆ సమయంలో వివిధ కేసుల్లో నిందితులుగా పట్టుబడ్డ బాల నేరస్తుల్లో ఎక్కువమంది టెన్త్ తప్పిన వారే అయివుండడాన్ని ఆయన గమనించారు. ఇలాంటి వారు టెన్త్ పాసై ఉన్నత చదువులకెళ్తే ఇలా చెడు దారిపట్టే వారు కాదుకదా? అన్న ఆలోచన కలిగింది. దాంతో ఆయన ప్రభుత్వ హైస్కూళ్లలో చదివే టెన్త్ పిల్లలకు పాఠాలతో పాటు, నాలుగు మంచి మాటలు చెప్పదలచుకున్నారు దివాకర్. 2011లో పద్మనాభం స్టేషన్ ఎస్సైగా ఉన్నప్పట్నుంచి టెన్త్ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. కాస్త తీరిక దొరికితే చాలు... హైస్కూలు కెళ్లి తనకు పట్టున్న సైన్స్, మ్యాథ్స్, హిస్టరీ సబ్జెక్టులను ఉదాహరణలతో సహా బోధిస్తుంటారు. చిట్టి బుర్రల్లో నాటుకుపోయేలా కొండ గుర్తులు చెప్తుంటారు. ఉదాహరణకు ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్లను కనుగొన్న వారి పేర్లను గుర్తుపెట్టుకోవాలంటే ఆర్టీసీని గుర్తుపెట్టుకోవాలంటారు. ఆర్టీసీలో ఆర్ అంటే రూథర్‌ఫర్డ్, టి... థామ్సన్, సి... చాడ్విక్ అని చెబుతారు. బాహుఅజషాఔ చరిత్ర లో సబ్జెక్టులో కూడా దివాకర్ బోధన తేలిగ్గా సాగుతుంది. ఉదా: మొగల్ సామ్రాజ్య పాలకులు బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబులను గుర్తుంచుకోవడానికి వారి పేర్లలో తొలి అక్షరాలు ‘బాహుఅజషాఔ’ గుర్తుంచుకుంటే చాలని వివరిస్తారు. ఇలా అనేక అంశాలను షార్ట్‌కట్‌లో బోధించడంతో విద్యార్థులు ఎస్ఐ మాస్టార్ క్లాసంటే తెగ ముచ్చట పడతారు. టీచర్లూ సహకరిస్తున్నారు దివాకర్ డఫ్ అండ్ డంబ్ స్కూల్లోనూ పాఠాలు బోధిస్తారు. పర్సనాలిటీ డెవలప్మెంట్, మేనేజిమెంట్ స్కిల్స్‌పై పిల్లలకు అవగాహన కల్పిస్తారు. టెన్త్ ఫెయిలయితే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో వారికి చెబుతారు. దివాకర్ సంకల్పానికి హైస్కూళ్ల ఉపాధ్యాయులు కూడా సహకరిస్తూ ఆయనతో క్లాసులు చెప్పిస్తారు. ఇక్కడే కాదు.. బందోబస్తుకు వేరే ప్రాంతాలకు పంపినా అక్కడా దివాకర్ ఖాళీ వేళ తన సంకల్పం వదలరు. ఫొటోలు: శ్రీనివాస్ ఆకుల పిల్లలను ఇన్స్పైర్ చేస్తున్నారు ఎస్సైగారు తన బోధన ద్వారా పిల్లలను ఇన్స్పైర్ చేస్తున్నారు. టిప్స్‌తో వారికి అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నారు. మేం చెప్పనివి కూడా ఆయన చెబుతుంటారు. మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. మాట వినని విద్యార్థులకు ఆయన ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించాలనుకుంటున్నాం. మా టీచర్లు బోధించేది ఒక సబ్జెక్టే. ఆయన మూడు నాలుగు బోధిస్తున్నారు. ఆయన సంకల్పం అభినందనీయం. - ఎం.రాజబాబు, హెచ్ఎం, గవర్నమెంట్ హైస్కూల్, మధురవాడ మార్పు కోసమే నా తపన బాలనేరస్తుల్లో టెన్త్ తప్పిన వారు ఎక్కువమంది ఉంటున్నారు. దాంతో గవర్నమెంట్ స్కూళ్లలో టెన్త్ పిల్లలకు దిశానిర్దేశం చేయాలన్న ఆలోచన కలిగింది. నాలుగేళ్లుగా ఆయా స్కూళ్లలో పాఠాలు చెబుతున్నాను. టెన్త్ పిల్లలకు భవిష్యత్తు పట్ల అవగాహన కల్పిస్తే తప్పటడుగులు వేయకుండా ఉంటారు. తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. శాంతి భద్రతల సమస్య తగ్గుతుంది. ఇదేదో ఘనతగా కాకుండా సామాజిక బాధ్యతగా చేస్తున్నాను. విద్యార్థుల స్పందన, ఉపాధ్యాయుల ప్రోత్సాహం చెప్పలేనంత సంతృప్తినిస్తోంది. - దివాకర్ యాదవ్, ఎస్ఐ -
దైవమూ కణమూ మనమూ క్షేమమే!
‘ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్’... ఇంగ్లీషులో ఓ నానుడి! తెలుగులోనైతే... ‘వివరంలోనే ‘విషయం’ అనుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ‘దైవ’కణంపై చేసిన వ్యాఖ్యలు ఈ మాటల్నే గుర్తు చేస్తున్నాయి. వివరాలు తెలుసుకునే ముందు... ఒక్కటైతే స్పష్టం... దైవమూ... కణమూ... మనమూ అంతా క్షేమమే! దైవకణం జోలికెళితే విశ్వం మొత్తం నాశనమైపోతుందన్నది స్టీఫెన్ హాకింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్య. శాస్త్రవేత్తగా ఆయన పేరు ప్రఖ్యాతులకు తిరుగులేదు. కాబట్టి చాలామంది ఈ మాటల్ని నమ్మే ఉంటారు. ఇంకేముంది.. ఈ ప్రపంచం నాశనమైపోతోందట... ఉన్నన్నాళ్లూ హ్యాపీగా బతికేద్దాం అని.. మరోటనే జల్సా రాయళ్లకూ కొదవ లేకపోవచ్చు. అయితే... ఇదంతా వాస్తవమేనా? దైవకణం... శాస్త్రపరిభాషలో హిగ్స్ బోసాన్ నిజంగానే విశ్వాన్ని లయం చేసేయగలదా? అదెప్పుడు జరుగుతుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు మన మెదళ్లను తొలుస్తూంటాయి. వీటన్నింటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం...! హాకింగ్ వ్యాఖ్యల్లో నిజానిజాలేమిటో తెలుసుకునే ముందు ఈ హిగ్స్ బోసాన్ కణం ఏమిటో దాని ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కంటికి కనిపించని అతిసూక్ష్మమైన కణాల తాలూకూ లక్షణాలు, ధర్మాలను వివరించేందుకు భౌతిక శాస్త్రంలో స్టాండర్డ్ మోడల్ అని ఒక సిద్ధాంతం ఉంది. దీని ప్రకారం ఈ విశ్వం మొత్తం ఫెర్మియాన్లు, బోసాన్లు అనే రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంది. ఎలక్ట్రాన్లతోపాటు డౌన్క్వార్క్ వంటివాటితో మనకు కనిపించే వస్తువులు, పదార్థాలు తయారవుతాయి. బోసాన్లు... ఫెర్మియాన్లను ప్రభావితం చేయగల శక్తి కణాలు! వీటిల్లో చాలా రకాలున్నాయి. ఫోటాన్లు విద్యుదయస్కాంత శక్తికి హేతువు.. కాంతిని ప్రసారం చేస్తాయి. డబ్యూ, జెడ్ బోసాన్లు పదార్థ క్షయానికి, మార్పులకూ కారణమైన బలహీన శక్తి. గ్లుయాన్ బోసాన్ కణ కేంద్రకంలోని ప్రోటాన్లు, న్యూట్రాన్లు చెల్లాచెదురు కాకుండా బంధించి ఉంచే బలమైన శక్తి. ఈ బోసాన్లే కాకుండా గురుత్వాకర్షణ శక్తికీ గ్రావిటాన్ బోసాన్ అనేది కారణమని అంటారు. దీన్ని ఇప్పటివరకూ గుర్తించలేదు. బరువుల్లో భారీ తేడాలు! బోసాన్లు దాదాపుగా ఒకేరకమైన కణాలైనప్పటికీ వీటి బరువుల్లో మాత్రం చాలా తేడాలుంటాయి. ఉదాహరణకు ప్రోటాన్‌కు అసలు బరువనేదే ఉండదు. కానీ ఎలక్ట్రాన్‌కు 0.0005 జీఈవీ (గిగా ఎలక్ట్రాన్ వోల్టులు, శక్తి, బరువులకు ప్రమాణం) బరువు ఉంటే.. డౌన్క్వార్క్ 0.01 జీఈవీ బరువు ఉంటుంది. అదే సమయంలో జెడ్ బోసాన్ బరువు ఏకంగా 91 జీఈవీలు ఉంటుంది. ఎందుకీ తేడా అన్న ప్రశ్న వచ్చినప్పుడు హిగ్స్ బోసాన్ ప్రస్తావన వస్తుంది. విశ్వం మొత్తమ్మీద ఓ అదృశ్య క్షేత్రం ఆవరించి ఉంటుందని... కణాలు ఈ క్షేత్రంలో ఉండే బోసాన్లతో ఢీకొన్నప్పుడు వాటికి బరువు అబ్బుతుందని సిద్ధాంతకర్తలు అంచనాలు కట్టారు. దీని బరువు దాదాపు 126 జీఈవీలు ఉన్నప్పటికీ ఢీకొన్న కణాన్ని బట్టి బరువులో తేడా వచ్చేస్తుంది కాబట్టే ఎలక్ట్రాన్, డౌన్క్వార్క్ల బరువులు తక్కువగా జెడ్బోసాన్ బరు చాలా రెట్లు ఎక్కువగా ఉందని అంచనా. 2012లో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్ సమీపంలో భూగర్భంలో ఏర్పాటు చేసిన భారీ ప్రయోగశాలలో జరిపిన ప్రయోగాల ద్వారా ఈ హిగ్స్‌బోసాన్ అనేది ఒకటి ఉందని తొలిసారి స్పష్టమైంది. ఫొటాన్లను దాదాపు 3.5 టెరా ఎలక్ట్రాన్ వోల్టుల (టెరా = ఒకటిపక్కన 12 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య) వేగంతో ఢీకొట్టించి.. ఆ క్రమంలో చెల్లాచెదురైన అతిసూక్ష్మ కణాలను గుర్తించడం ద్వారా హిగ్స్‌బోసన్ అత్యంత స్వల్ప సమయం పాటు ఉనికిలో ఉండిందని ఈ ప్రయోగాల ద్వారా నిర్ధారించారు. విశ్వంలో హిగ్స్ బోసాన్ వంటి కణం లేకపోయి ఉంటే... ఈ చెట్టూపుట్టా... పురుగుపుట్రా ఇప్పుడున్నట్లుగా ఉండేవి కాదేమో! అందుకే ఈ కణానికి ఇంత ప్రత్యేకత. చివరికి నాశనమేనా? మొదట్లో చెప్పినట్టుగా స్టీఫెన్ హాకింగ్ చేసిన వ్యాఖ్యలను వివరంగా చూస్తే విషయం ఇట్టే అర్థమైపోతుంది. హిగ్స్ బోసాన్ కణం వంద బిలియన్ అంటే... 10000 కోట్ల గిగా ఎలక్ట్రాన్ వోల్టుల స్థాయుల్లో అస్థిరంగా మారుతుందని హాకింగ్ అంచనా కట్టారు. ఎప్పుడన్నదీ స్పష్టం చేయలేదు. కొంతమంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. ఇది రానున్న కోటానుకోట్ల ఏళ్ల వరకూ సాధ్యమయ్యే విషయం కాదు. అలాగే భూమ్మీద అత్యంత శక్తిమంతమైన పార్టికల్ ఆక్సిలరేటర్ పూర్తిస్థాయి సామర్థ్యం వెయ్యి జీఈవీలకు మించదు. అటువంటప్పుడు హాకింగ్ ప్రతిపాదన నిజం కావాలంటే ఈ శక్తి మరో పదిరెట్లు ఎక్కువ కావాలి. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ, పదార్థాలను చూస్తే... ఇది కూడా దాదాపు అసాధ్యమైన విషయమే! - గిళియార్ గోపాలకష్ణ మయ్యా! 2000 వరకూ స్టీఫెన్ హాకింగ్ హిగ్స్ బోసాన్ కణం అసలు లేదని వాదించారు. ఈ కణాన్ని ఎప్పటికీ గుర్తించలేమని మిషిగన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త గార్డన కీనేతో వంద డాలర్ల పందెం కాశాడు. 2012లో ఈ పందెం ఓడిపోయారు కూడా. అంతకుమునుపు కూడా కష్ణబిలాల విషయంలోనూ ఇద్దరు శాస్త్రవేత్తలతో పందెం కాసి ఓడిపోయారు హాకింగ్. విశ్వ విస్తరణకు సంబంధించిన ఒకే ఒక్క పందెంలో హాకింగ్ ఇప్పటివరకూ గెలిచారు.