శ్రీహరికోటకు చేరుకున్న ప్రధాని మోడీ
చెన్నై: ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి దక్షిణాది పర్యటనకు వచ్చారు. పీఎస్ఎల్వీ సీ-23 రాకెట్ ప్రయోగాన్ని తిలకించేందుకు ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ సెంటర్ కు చేరుకున్నారు. మోడీకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.
సోమవారం ఉదయం పీఎస్ఎల్వీ సీ-23 రాకెట్ ప్రయోగాన్ని మోడీ వీక్షించనున్నారు. ఉపగ్రహ ప్రయోగం సందర్భంగా షార్ సెంటర్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మోడీ అంతకుముందు ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చి అక్కడి నుంచి ప్రత్యేక హెలీకాప్టర్లో శ్రీహరికోటకు వచ్చారు. చెన్నై విమానాశ్రయంలో తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత స్వాగతం పలికారు.