జల్సాలతో జైలుపాలు
శ్రీను(పేరుమార్చం) సదాశివపేట మండలంలోని ఓ గ్రామం. సంగారెడ్డిలోని డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీను...సినిమాల్లో హీరోలు ఖరీదైన బైక్‌లపై రయ్యిమంటూ దూసుకుపోవడం చూసి తానూ అలా జీవితం గడపాలని భావించాడు. ఈ క్రమంలోనే చెడుస్నేహాలతో చదువుపక్కనపెట్టాడు. వ్యసనాలకు బానిసై వాటికోసం తల్లిదండ్రులను పీడించేవాడు. అయినా డబ్బు సరిపోక చోరీల బాటపట్టాడు. పుస్తెలతాడుతో మహిళ కనిపిస్తే బైక్‌పై వెళ్లి క్షణాల్లో పనికానిచ్చేవాడు. వాటిని విక్రయించగా వచ్చిన సొమ్ములతో జల్సాలు చేసేవాడు. ఇలా హస్తలాఘవం చూపుతూ పోలీసులకు దొరికిపోయాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా పాత నేరాలన్నీ ఒక్కొక్కటిగా కక్కేశాడు. ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. చదువుకుని ప్రయోజకుడవుతాడనుకున్న కుమారుడు ఊచలు లెక్కబెడుతుంటే...ఆ తల్లిదండ్రులు దేవుడా...మాకెందుకీ శిక్ష అంటూ రోదిస్తున్నారు.
ఇలాంటి శ్రీనులు జిల్లాలో చాలామందే ఉన్నారు..వీరి వల్ల నరకయాతన అనుభవిస్తున్న తల్లిదండ్రులూ అంతే మంది ఉన్నారు. కేవలం వ్యసనాలు, చెడు స్నేహాలతో జల్సాలతో జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్న యువత కన్నవాళ్లకూ చెడ్డపేరు తీసుకువస్తున్నారు. తెలిసీతెలియక జీవితాలను కోల్పోతున్న యువతకు ఎప్పటికప్పుడు గమనిస్తూ కౌన్సెలింగ్ ఇస్తే వారు దారి తప్పకుండా ఉంటారని మానసిక వైద్యులు చెబుతున్నారు.

తల్లిదండ్రులూ..... తస్మాత్ జాగ్రత్త!
తల్లిదండ్రులు ఎక్కువగా తమ పిల్లల కదలికలపై దృష్టి సారించకపోవడం వ ల్లే యువకులు చెడు వ్యసనాలకు బానిసలై దారి తప్పుతున్నట్లు తెలుస్తోంది. పిల్లల స్నేహితులు ఎలాంటి వారు? వారు కుటుంబ వివరాలు వంటి వాటిని కూడా తల్లిదండ్రులు తెలుసుకుంటే మంచిది. పిల్లలు చదువుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కళాశాలలకు వెళ్తున్నాడా? లేదా? అని ఆరా తీయాలి. వీలైతే కళాశాలకు ఫోన్ చేసైనా, స్వయంగా వెళ్లయినా తెలుసుకోవడం మంచిది. వారికి సెల్ఫోన్లు ఇచ్చే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వారు నిత్యం ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారో, ఎస్ఎంఎస్లు, కంప్యూటర్లలో మెయిల్స్ వంటి వాటిపై ఓ కన్నేసి ఉంచాలి.
జల్సాలకు అలవాటుపడితే పరిస్థితులు ఎలా చేయిదాటుతాయో వివరిస్తుండాలి. ఒకవేళ నేరాలకు పాల్పడితే ఎటువంటి శిక్షలు ఉంటాయో వారికి అవగాహన కల్పిస్తుండాలి. హైదరాబాద్ నగరం జిల్లాకు సమీపంలోనే ఉండటంతో అనేక మంది తల్లిదండ్రులు వారి పిల్లలను చదువు నిమిత్తం నగరానికి పంపుతున్నారు. విద్యార్థులు ప్రతి రోజు ఇంటి నుంచి కళాశాలకని చెప్పి వెళ్తూ సినిమాలు, షికార్లతో పాటు చెడు స్నేహాలతో పక్కదారి పడుతున్నారు. అనేక కేసుల్లో నిందితులుగా యువకులే తేలుతుండడంతో జిల్లా పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అంతేగాక కేసుల్లో ఇరుక్కుంటే ఏ విధంగా జీవితం నాశనమవుతుందో చెబుతూ అవగాహన కల్పిస్తున్నారు.
జీవితాన్ని నాశనం చేసుకోవద్దు
చాలా కేసుల్లో నిందితులుగా యువకులే ఉంటున్నారు. చదువుకోవాల్సిన సమయంలో జల్సాలకు అలవాటు పడి కేసుల్లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ విషయంలో పిల్లలకు మంచి, చెడు గురించి వివరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఎక్కువగా ఉంది. పిల్లల ప్రవర్తన గురించి ఓ వైపు కన్నేసి ఉంచాలి. చెడు మార్గంలో వెళ్లి బంగారు భవితను నాశనం చేసుకోవద్దని ఎప్పటికప్పుడు వారికి తెలియజేస్తుండాలి. పోలీసు శాఖ తరపున మేము కూడా విద్యార్థులకు అవగాహన కల్పించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం.
-విజయ్‌కుమార్, జిల్లా ఎస్పీ
అవగాహన కల్పించాలి
పిల్లలు యవ్వనంలోకి రాగానే వారికి మంచి చెడుల గురించి వివరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలు నిత్యం చేస్తున్న కార్యకలాపాలు, ఫోన్ సందేశాలు వంటి వాటిపై నిఘా వేయాలి. ముఖ్యంగా వారి స్నేహితులు, వారి కుటుంబ వివరాల గురించి తెలుసుకోవాలి. కేసుల వల్ల జీవితంలో నష్టపోయిన వారి గురించి వారికి వివరిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించాలి. యువకులు కూడా మంచి కోసం తెగించాలే తప్ప చెడు కోసం కాదని గమనించాలి. ప్రస్తుతం నమోదవుతున్న హెచ్ఐవీ కేసుల్లో ఎక్కువగా యువకులే బాధితులుగా ఉండటం విచారకరం.
-డాక్టర్ మురహరి, మానసిక వైద్యనిపుణులు