PTI news agency
-
పీటీఐతో సోనీ ఇండియా జట్టు
న్యూఢిల్లీ: దేశీయంగా అతి పెద్ద స్వతంత్ర న్యూస్ ఏజెన్సీ అయిన పీటీఐకి ప్రత్యేకంగా డిజిటల్ ఇమేజింగ్ సొల్యూషన్స్ అందించేలా సోనీ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ప్రెస్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఫొటోగ్రాఫర్లు, వీడియో జర్నలిస్టులకు సోనీ ఇండియా ఎక్స్‌క్లూజివ్ డిజిటల్ ఇమేజింగ్ సొల్యూషన్స్ సరఫరాదారుగా ఉంటుంది. ఆయా ఉత్పత్తులను వాడటంలో వారికి శిక్షణ కూడా ఇస్తుంది. పీటీఐ వంటి విశ్వసనీయ న్యూస్ ఏజెన్సీతో జట్టు కట్టడం తమకు ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయమని సోనీ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. మరోవైపు వీడియో జర్నలిజంలోకి అడుగుపెడుతున్న తమకు.. కొంగొత్త టెక్నాలజీలను ఆవిష్కరించడంలో ముందుండే సోనీతో భాగస్వామ్యం ఎంతగానో ప్రయోజనకరమని పీటీఐ సీఈవో విజయ్ జోషి చెప్పారు. పీటీఐ ప్రతి రోజూ 2,000 పైచిలుకు స్టోరీలు, 200 పైగా ఫొటోగ్రాఫ్‌లను సుమారు 500పైగా భారతీయ వార్తాపత్రికలకు అందిస్తోంది. చదవండి: అన్ని మోడళ్ల కార్లను మార్చేస్తున్న వోల్వో.. కారణం ఇదే! -
40 శాతం వరకూ జీఎస్టీ పన్ను!
శ్లాబుల్లో ప్రస్తుతం మార్పులు లేవు ∙అధికారుల వెల్లడి న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేటును బిల్లులో ఉన్న 14 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించిన నేపథ్యంలో పన్ను అత్యధికంగా 40 శాతం వరకూ ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. వచ్చే వారం ప్రారంభమయ్యే రెండో దఫా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు చర్చకు వచ్చినపుడు పన్ను రేటు ‘14 శాతానికి మించకూడదు’ అనే నిబంధన స్థానంలో ‘20 శాతానికి మించకూడదు’ అనే నిబంధన చేర్చనున్నారు. ఈ మార్పు ప్రభావం 4 శ్లాబ్‌ల విధానంపై ఉండదని, అయితే భవిష్యత్‌లో పన్ను పెంపుదలకు ఇబ్బందిలేకుండా ఉండటానికే కొత్త నిబంధన అని అధికారులు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. భవిష్యత్‌లో పన్ను పెంచాల్సి వస్తే పార్లమెంట్ అనుమతి తీసుకోనక్కర్లేకుండానే.. కొత్త నిబంధన వల్ల జీఎస్టీ కౌన్సిల్ పెంచవచ్చని చెప్పారు. దీంతో కేంద్ర, రాష్ట్ర జీఎస్టీలు అత్యధికంగా 20 శాతం చొప్పున ఉండనున్నాయి కాబట్టి పన్ను అత్యధికంగా 40 వరకూ ఉండే అవకాశం ఉంటుందని వారు వెల్లడించారు.