విద్యుత్‌షాక్‌తో హాస్టల్ కుక్ మృతి
బీసీ బాలుర ప్రభుత్వ కళాశాల హాస్టల్లో కరెంట్ షాక్‌తో వంట మనిషి మృతి చెందాడు. కర్నూలు జిల్లా కోడుమూరులోని ప్రభుత్వ కళాశాల హాస్టల్లో లద్దగిరి గ్రామానికి చెందిన శివన్న(38) కుక్‌గా పనిచేస్తున్నాడు. అతడు బుధవారం 10.30 గంటల సమయంలో బోరు మోటారు ఆన్ చేసేందుకు స్విచ్ ఆన్ చేయబోగా షాక్ కొట్టింది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు ఎస్సై మహేశ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.