వేధింపుల వైద్యాధికారిపై కేసు
కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న నర్సులు, ఏఎన్ఎంలను లైంగికంగా వేధిస్తున్న సీనియర్ ప్రజా వైద్యాధికారి వసంతరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వసంతరావు లైంగిక వేధింపులపై పీహెచ్సీలో పనిచేస్తున్న హెడ్ నర్సులు, నర్సులు, ఏఎన్ఎంలు సుమారు 30 మంది సోమవారం కరీంనగర్లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం కూడా ఇచ్చారు. అదే రోజు రాత్రి చొప్పదండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వసంతరావుపై సెక్షన్ 354/ఏ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.