breaking news
Public office
-
ప్రజల జీవితాల్లో మార్పే లక్ష్యం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వాధినేతగా 24 సంవత్సరాలు పూర్తిచేసుకొని మంగళవారం 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. 2001 అక్టోబర్ 7న ఆయన తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 12 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. 2014 నుంచి దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. దేశంలో ఓటమి ఎరుగని ప్రభుత్వాధినేతగా మోదీ రికార్డు సృష్టించారు.ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు. ఈ గొప్ప దేశానికి సేవ చేసే అవకాశం రావటం తన అదృష్టమని పేర్కొన్నారు. ‘నా తోటి భారతీయులు నాపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు. ప్రభుత్వాధినేతగా నేను 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను. ఈ సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు స్థిర చిత్తంతో గట్టి ప్రయత్నం చేశాను. ఈ గొప్ప దేశ ప్రగతికి నా వంతు కృషి చేశాను’అని పేర్కొన్నారు.నిరాశ నుంచి గొప్ప స్థాయికి పయనం తాను 2014లో దేశ ప్రధాని పదవి చేపట్టేనాటికి దేశంలో అవినీతి, ప్రజల్లో నిరాశ, నిస్పృహ నెలకొని ఉన్నాయని.. తన 11 ఏళ్ల పదవీ కాలంలో దేశం ఆ పరిస్థితి నుంచి బయటపడి.. ఎంతో ప్రగతిపథంలో దూసుకెళ్తోందని ప్రధాని తెలిపారు. ‘2014 సార్వత్రిక ఎన్నికల కోసం 2013లో నన్ను బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకొనే నాటికి యూపీఏ ప్రభుత్వం అవినీతి, కుటిలతత్వం, విధాన వైఫల్యాలకు పర్యాయపదంగా ఉంది. అంతర్జాతీయంగా బలహీన సంబంధాలు కలిగి ఉంది. కానీ, విజు్ఞలైన భారతీయులు మా కూటమికి, మా పారీ్టకి ఎన్నికల్లో అద్భుత మెజారిటీ ఇచ్చారు.గత 11 ఏళ్లలో మనమంతా కలిసి ఎంతో మార్పు తీసుకొచ్చాం. ముఖ్యంగా మన మహిళా శక్తి, యువశక్తి, అన్నదాతలు ఎంతో స్వయంసమృద్ధి సాధించారు. 25 కోట్ల మంది పేదరికం కోరల నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ప్రపంచ అద్భుత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ పరిగణించబడుతోంది’అని ప్రధాని పేర్కొన్నారు.సవాళ్లే నన్ను బలంగా మార్చాయి ప్రభుత్వాధినేతగా మొదట్లో తాను ఎదుర్కొన్న సవాళ్లే తనను శక్తిమంతంగా మార్చాయని ప్రధాని మోదీ తెలిపారు. ‘నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదట అధికారం చేపట్టేనాటికి భారీ భూకంపం, తీవ్రమైన తుఫాన్, వరుస కరువులతో రాష్ట్ర ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. బలమైన సంకల్పంతో ప్రజలకు సేవ చేసేందుకు, గుజరాత్‌ను పునరి్నరి్మంచేందుకు ఆ సవాళ్లు నన్ను శక్తిమంతుడిని చేశాయి. నాడు గుజరాత్‌ను ఇక బాగు చేయలేం అన్నారు. కానీ, అందరం కలిసికట్టుగా కష్టపడి సుపరిపాలనకు గుజరాత్‌ను పవర్‌హౌస్‌గా మార్చాం’అని చెప్పారు.తన తల్లి చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని మోదీ గుర్తుచేసుకున్నారు. ‘సీఎంగా ప్రమాణం చేసే సమయంలో మా అమ్మ నాకు ఒక మాట చెప్పారు. నీ పని ఏమిటో నాకు సరిగా తెలియదు కానీ.. రెండు విషయాలు మాత్రం మర్చిపోవద్దు. ఒకటి.. నువ్వు ఎప్పుడూ పేదల బాగు కోసమే పనిచేయాలి. రెండు.. లంచం తీసుకోవద్దు అని చెప్పారు. నేను కూడా ప్రజలకు అదే చెప్తాను. అవసరంలో ఉన్న చివరి వ్యక్తికి కూడా సేవ చేయటమే లక్ష్యంగా పెట్టుకోవాలి. -
అధికారానికి సాష్టాంగం
సూళ్లూరుపేట : అధికారం ముందు అధికార యంత్రాంగం సాష్టాంగపడింది. ప్రభుత్వ కార్యాలయంలో అదీనూ తహశీల్దార్ కార్యాలయంలో ప్రొటోకాల్ లేని ఒక మాజీ మంత్రి పరసా రత్నం ముందు అధికారులు మంగళవారం క్యూ కట్టి జీ హుజూర్ అంటూ సలాం కొట్టారు. ఏ హోదా లేని ఆయన ఇచ్చిన ఆదేశాలను వినయంగా నోట్ చేసుకున్నారు. అంతటితో ఆగలేదు కదా.. తెలుగుదేశం పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు సూచించిన అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న సూళ్లూరుపేట నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. స్థానిక ఎమ్మెల్యే శాసనసభ సమావేశాల్లో ఉండగా ఓటమిపాలైన టీడీపీ అభ్యర్ధి దర్జాగా ప్రభుత్వ కార్యాలయంలోనే సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం అధికారపార్టీ నేతల అహంకారానికి, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా మారింది. ఆర్డీవో నుంచి అన్నిశాఖల అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొనడం గమనార్హం. గ్రామ సచివాలయాల నుంచే గ్రామ పాలన జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలషిస్తున్నట్టు మాజీమంత్రి చేసిన ఉపన్యాసానికి అధికారులు చప్పట్లు కొట్టి మరీ అధికారపక్షానికి విధేయతను చాటుకున్నారు. అధికారులతో పరసా సమీక్ష ఎలా చేస్తారు? ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూటి ప్రశ్న ప్రజా విశ్వాసం కోల్పోయిన పరసా వెంకటరత్నం సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో ఏ హోదాలో సమీక్షించారని స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రశ్నిం చారు. ఆర్డీఓ సమక్షంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా హైదరాబాద్‌లో ఉన్న సంజీవయ్య ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. విద్యావంతుడైన, రాజకీయ అనుభవం కలిగిన మాజీ మంత్రి పార్టీ కార్యకర్తలను వెంటబెట్టుకుని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడానికి కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా అంటూ మండిపడ్డారు. ఆయనకు రాజ్యాంగ నిబంధనలు తెలియవా! ఆయన నీతిమాలిన పనిచేస్తే డివిజన్‌స్థాయి అధికారి అయిన ఆర్డీఓ ఎంవీ రమణ మండలంలోని అన్ని శాఖల అధికారులను ఎలా సమావేశానికి పిలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అధికారులకు ప్రొటోకాల్ తెలియదా! ఆయన సమావేశానికి పిలవగానే వచ్చేస్తారా! దీనిపై తాను ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ఓడిపోయిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు మర్యాదపూర్వకంగా రావచ్చునేమోగాని కార్యాలయంలో కూ ర్చుని అభివృద్ధిపై సమీక్షిస్తే అధికారులు ఎలా అనుమతి ఇస్తారని అన్నారు. ఇటీవల టీడీపీ నాయకులు తిరుమూరు సుధాకర్‌రెడ్డి తాను అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నానని విమర్శించారు కదా! ఇప్పుడు పరసా అధికారులను బ్లాక్ మెయిల్ చేసి సమీక్ష సమావేశాలు ఎలా నిర్వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు అధికారుల్లా పనిచేయాలే గాని అధికారం ఉందని అధికారపార్టీ నాయకులు చెప్పినట్టు ఆడితే తాను సహించనన్నారు. పరసారత్నం కలల్లో నుంచి బయటకు వచ్చి ఇకనైనా నీతిమాలిన పనులు మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని అన్నారు. -
నవలోకం
సాక్షి, ఏలూరు : తెలుగు నేల రెండుగా చీలిపోయింది. నవ్యాంధ్రప్రదేశ్‌ను కొత్తగా నిర్మించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ మార్పులు, చేర్పులు అనివార్యం అవుతున్నాయి. ఇన్నాళ్లూ ఎన్నికల కారణంగా క్షణం తీరిక లేకుండా గడిపిన అధికారులు ఆ ప్రక్రియ ముగియడంతో పాలనపై దృష్టి సారించారు. ముఖ్యం గా రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన పనులను వేగవంతం చేస్తున్నారు. కార్యాలయూలన్నీ ఒకేచోటజిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రధాన కార్యాలయూలు ఉన్నాయి. ము ఖ్యంగా కలెక్టరేట్ ప్రాంగణంలో అత్యధికంగా 22 శాఖల కార్యాలయాలు నడుస్తున్నాయి. మిగతా శాఖల కార్యాలయూలు నగరంలోనేవేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో సంబంధిత సేవలు పొందడం ప్రజలకు కష్టంగా మారింది. ఒకచోటు నుంచి మరో చోటుకు పదేపదే ఆటోలలో వెళ్లాల్సి రావడం ఖర్చుతో కూడుకున్న పనికావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న అన్ని కార్యాలయూలను ఒకేచోట నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన భవనాలు నిర్మించేందుకు స్థానిక ఆదివారపుపేటలోని ఏఎస్ఆర్ స్టేడియం సమీపంలో రెండున్నర ఎకరాల భూమిని కేటాయించారు. ఇక్కడ ఇప్పటికే దాదాపు రూ.3 కోట్లతో ఐటీడీఏ ట్రైనింగ్ సెంటర్, విద్యార్థుల వసతి భవనాల నిర్మాణం ప్రారంభించారు. మరికొన్ని భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి ఐటీడీఏ కార్యాలయాలు, వసతి గృహాలు కోటరామచంద్రపురంలో ఉన్నాయి. వాటిని జిల్లా కేంద్రంలో అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. జేవీఆర్ నగర్లో ఉన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్, ఏఎస్ఆర్ స్టేడియం వద్ద ఉన్న ఆర్మీ హాస్పిటల్, ఎన్ఆర్ పేటలో ఉన్న ఐసీడీఎస్ అర్బన్ కార్యాలయం, టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఎదురు రోడ్డులో ఉన్న కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, బాలయోగి పార్క్‌లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్‌ను కొత్తగా నిర్మించే భవనాల్లోకి మార్చనున్నారు. ఇదే ప్రాంతంలో ఏఎస్ఆర్ స్టేడియం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నారుు. ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఇక్కడికి సమీపంలో కేంద్రీకృతం కానున్నాయి.