రేపు రాత్రి నుంచి దుర్గమ్మ దర్శనం రద్దు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : సంపూర్ణ సూర్యగ్రహణం కారణంగా మంగళవారం రాత్రి నుంచి బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం నిలిపివేయనున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. సాయంత్రం పూజా కార్యక్రమాల అనంతరం రాత్రి 7.30 గంటలకు దుర్గామల్లేశ్వరస్వామి ఆలయాలతో పాటు ఉపాలయాల తలుపులు మూసివేస్తారని తెలిపారు.
బుధవారం ఉదయం 7.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, మహా నివేదన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.